STOCKS

News


ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో పెట్టుబడి అవకాశాలు: బీఎన్‌పీ

Tuesday 16th October 2018
Markets_main1539629801.png-21173

ఇటీవల బాగా దిద్దుబాటుకు గురైన స్టాక్స్‌లో వృద్ధి అవకాశాలున్న కొన్నింటిలో బీఎన్‌పీ పారిబాస్‌ ఇన్వెస్ట్‌ చేసింది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లకు అవకాశాలున్నట్టు ఈ సంస్థ తెలిపింది. లిక్విడిటీ కఠినతరం, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో బీఎస్‌ఈ ఫైనాన్స్‌ ఇండెక్స్‌ గత నెలలో 13 శాతం పతనమైన విషయం తెలిసిందే. ప్రైవేటు బ్యాంకులు, జీవిత బీమా సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ను నిర్వహించే అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల ఆస్తులు... వచ్చే ఏడాది పాటు కాల వ్యవధి తీరే అప్పులను మించే ఉన్నాయని బీఎన్‌పీ పారిబాస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా ఈక్విటీ విభాగం రీసెర్చ్‌ హెడ్‌ అభిరామ్‌ ఏలేశ్వరపు తెలిపారు. ప్రత్యేకంగా కొన్ని చాలా ఆసక్తికరంగా ఉన్నట్టు చెప్పారు. అన్నింటినీ ఒకే గాటన కట్టరాదన్నారు. 

 

బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహింద్రా బ్యాంకు, రిలయన్స్‌ నిప్పన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను బీఎన్‌పీ పారిబాస్‌ తమ పోర్ట్‌ఫోలియోకి యాడ్‌ చేసుకుంది. సెప్టెంబర్‌ 24 నాటి నివేదికలో ఈ స్టాక్స్‌ను కొనుగోలు జాబితాలో పేర్కొంది. గత నెలలో ఈ స్టాక్స్‌ 11 నుంచి 26 శాతం మధ్యలో దిద్దుబాటుకు గురికావడం గమనార్హం. స్టాక్స్‌ ధరలు ఎక్కువగా పడిపోవడం, ఒడిదుడుకులు పెరిగిపోవడం అన్నవి బోటమ్‌ అప్‌ స్టాక్‌ ఎంపికకు మంచి అవకాశాలుగా పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 18 రెట్ల వద్ద ట్రేడ్‌ అవుతోందని, ఐదేళ్ల సగటు కంటే అధికమేనన్నారు. కనుక తదుపరి దిద్దుబాటుకు ఒత్తిళ్లు ఉన్నట్టు చెప్పారు. ‘‘అమ్మకాలతో వ్యాల్యూషన్‌ కాస్తంత చౌకగా మారింది. కానీ నిఫ్టీ, బీఎస్‌ఈ 500 సూచీలు వాటి చారిత్రక సగటు స్థాయిలకు పైనే ట్రేడ్‌ అవుతున్నాయి. బోటమ్‌ అప్‌ స్టాక్‌ ఎంపిక విధానాన్ని కొనసాగిస్తాం’’ అని అభిరామ్‌ చెప్పారు.  

 

పెరుగుతున్న చమురు ధరలు, ముదిరిన వాణిజ్య యుద్ధం సమస్యలు, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలకు ముందు మూడు కీలక రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలు అన్నవి మార్కెట్లలో అస్థిరతలు కొనసాగేందుకు కారణమవుతాయని అంచనా వేశారు. ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి సెన్సెక్స్‌ 37,500 స్థాయిలో ఉంటుందన్న లక్ష్యాన్ని పేర్కొన్నారు. తమ ప్రాంతీయ పోర్ట్‌ఫోలియోలో భారత్‌ తటస్థంగా ఉందన్నారు. నిఫ్టీ 50 సూచీ ఆదాయాలు సగటున పెరగొచ్చని, సెప్టెంబర్‌ త్రైమాసికంలో కనిష్టం నుంచి మధ్యస్థంగా ఉండొచ్చన్నారు. ప్రధానంగా ఎగుమతి కంపెనీలు, ఇంధనం, కన్జ్యూమర్‌ సంస్థల నుంచి తోడ్పాటు ఉంటుందని చెప్పారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచితే గనుక, ఇప్పుడే ఊపందుకుంటున్న వృద్ధికి విఘాతం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. రేట్ల పెంపు కరెన్సీ విలువకు సాయపడుతుందన్న దానికి ఆధారం లేదని, వర్ధమాన దేశాల్లో ఇదే చూశామని చెప్పారు. You may be interested

మిడ్‌క్యాప్‌లో దిద్దుబాటు కొనసాగుతుంది: మాక్వేర్‌

Tuesday 16th October 2018

మిడ్‌క్యాప్‌ విభాగంలో కరెక్షన్‌ కొనసాగుతుందని అంతర్జాతీయ ఈక్విటీ రీసెర్చ్‌ సంస్థ మాక్వేర్‌ క్యాపిటల్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. నిధుల వ్యయాలు పెరుగుతండడమే కారణమని పేర్కొంది. వచ్చే రెండేళ్ల పాటు ఎన్నో అంశాల కారణంగా నిధుల వ్యయాలు అంతర్జాయంగా పెరుగుతాయని, ఇవి స్టాక్‌ విలువలపై ప్రభావం చూపిస్తాయని మాక్వేర్‌ క్యాపిటల్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ హెడ్‌ సందీప్‌ భాటియా పేర్కొన్నారు. అయితే, ఆదాయాల్లో రికవరీ ఈ ప్రతికూల ప్రభావానికి నిరోధంగా నిలుస్తుందని భావిస్తున్నట్టు

రెండో రోజూ లాభాలే

Monday 15th October 2018

10500 పైన ముగిసిన నిఫ్టీ రాణించిన ఐటీ షేర్లు ఫార్మా, ఐటీ షేర్ల ర్యాలీ అండతో మార్కెట్‌ రెండో రోజూ లాభాలతో ముగిసింది. ఇంట్రాడే తీవ్ర ఒడిదుడుకులతో ట్రేడింగ్‌ కొనసాగినప్పటికి చివరి గంటలో కొనసాగిన కొనుగోళ్ల పర్వంతో సూచీలు సోమవారం లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ 10500 పాయిం‍ట్లపైన ముగిసింది. సెన్సెక్స్‌ 150 పాయింట్లను ఆర్జించింది. చివరకు సెన్సెక్స్‌ 131 పాయింట్ల లాభంతో 34,865 వద్ద, నిఫ్టీ 40.00 పాయింట్ల లాభంతో 10512.50  పాయిం‍ట్ల వద్ద

Most from this category