STOCKS

News


వచ్చే ఏడాది 40000 స్థాయికి సెన్సెక్స్‌

Wednesday 19th December 2018
Markets_main1545213227.png-23084

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ బీఎన్‌పీ పారిబాస్‌.. భారత్‌ వృద్ధిపై తటస్థంగా ఉంది. 2019లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40,000 మార్క్‌ను అందుకుంటుందని అంచనా వేసింది. మంగళవారం నాటి ముగింపు స్థాయి 36,347 పాయింట్లతో పోలిస్తే 10 శాతానికి పైగా అప్‌సైడ్‌ ఉంటుందని పేర్కొంది. అయితే కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ వృద్ధిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ఇంకా పుంజుకోలేదని పేర్కొంది. ఇకపోతే రాజకీయ పరిస్థితుల వల్ల తలెత్తే అస్థిరతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. స్టాక్‌ మార్కెట్‌ వ్యాల్యుయేషన్స్‌ విషయానికి వస్తే.. సెన్సెక్స్‌ పీ/బీవీ మల్టీపుల్స్‌.. లాంగ్‌టర్మ్‌ యావరేజ్‌తో సమానంగానే ఉన్నాయని, అయితే గత ఆరేళ్లుగా ఆర్‌వోఈ తగ్గినప్పుడు, దీనికి అనుగుణంగా మల్టీపుల్స్‌ తగ్గలేదని పేర్కొంది. అందువల్ల వ్యాల్యుయేషన్స్‌ వాస్తవానికి దూరంగా ఉన్నాయని, రీరేటింగ్‌ అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ‘ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో వివిధ రంగాల్లో నాణ్యమైన స్టాక్స్‌ చాలా ఉన్నాయి. ఇవి ఫ్రీక్యాష్‌ ఫ్లో కలిగి ఉండి, మంచి రాబడులను అందిస్తున్నాయి. అందువల్ల భారత్‌పై అండర్‌వెయిట్‌తో లేము’ అని బీఎన్‌పీ పారిబాస్‌ సెక్యూరిటీస్‌ ఆసియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ మనీషి రేచౌదురి తెలిపారు. వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో ఎర్నింగ్స్‌ తగ్గొచ్చని, క్రూడ్‌ ఆయిల్‌ ధరల్లో ఒడిదుడుకులు ఉండొచ్చని, రూపాయిపై ఒత్తిడి పెరగొచ్చని, ఎన్నికల వల్ల అస్థిరతలు ఉండొచ్చని అంచనా వేశారు. రెండో అర్ధ భాగంలో విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు పెరగొచ్చని తెలిపారు. 2019, 2020లో కంపెనీల ఎర్నింగ్స్‌ వృద్ధి 14-15 శాతంగా ఉండొచ్చని పేర్కొన్నారు. ఫైనాన్షియల్స్‌, హెల్త్‌కేర్‌, కన్సూమర్‌ డిస్క్రీషనరీ విభాగాల్లో వృద్ధిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచినా కూడా భారత్‌ మంచి వృద్ధి రేటు నమోదు చేస్తుందని తెలిపారు. ఇన్వెస్ట్‌మెంట్‌ సైకిల్‌ పుంజుకుంటుందని పేర్కొన్నారు.    



You may be interested

10,950 పైన నిఫ్టీ ముగింపు

Wednesday 19th December 2018

మార్కెట్‌ ర్యాలీ బుధవారం కూడా ఆగలేదు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, అటో, ఎఫ్‌ఎంసీసీ షేర్ల అండతో సూచీలు వరుసగా ఏడోరోజూ లాభాలతో ముగిశాయి.  నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 10,967 వద్ద, సెన్సెక్స్‌ 137 పాయింట్ల లాభంతో 36484 వద్ద స్థిరపడ్డాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ర్యాలీ రెండోరోజూ కొనసాగడం, బాండ్ల బైబ్యాక్‌ ఇష్యూ ద్వారా ఈ నెలలో అదనంగా మరో రూ.10,000 కోట్ల నిధులను ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేయాలనే

బ్యాంక్‌ నిఫ్టీ జంప్‌

Wednesday 19th December 2018

ద్రవ్యత్వ సంక్షోభం నుంచి గట్టేందుకు ఆర్‌బీఐ చేసిన బాండ్ల బైబ్యాక్‌ ఇష్యూ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌కు కలిసొస్తుంది. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో 1శాతం ర్యాలీ చేసింది. వచ్చే నెలలో బాం‍డ్ల బైబ్యాక్‌ ద్వారా రూ.50వేల కోట్ల నిధులను ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేస్తామని మంగళవారం ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 27,229.05ల వద్ద  ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ప్రభుత్వరంగ బ్యాంక్‌

Most from this category