STOCKS

News


బేర్స్‌ స్వైరవిహారం

Thursday 4th October 2018
Markets_main1538650787.png-20860

  • సెన్సెక్స్‌ నష్టం 806 పాయింట్లు
  • 10600ల దిగువకు నిఫ్టీ

బేర్స్‌ చేసిన వీరవిహారానికి గురువారం మార్కెట్‌ నిలువునా పతనమయ్యింది. క్రితం రోజు నష్టాల ముగింపునకు కొనసాగింపుగా నేడు కూడా బేర్స్‌ హల్‌చల్‌ చేశారు. రూపాయి కొత్త జీవిత కాల కనిష్టానికి పతనం కావడం, ముడిచమురు మంటలు, వాణిజ్య లోటు, దేశీయ మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లు తరలిపోవడం తదితరకారణాలు మార్కెట్లో బేర్స్‌ పట్టును సాధించడానికి కారణయ్యాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం సాగిన బేర్స్‌లో వేటలో సెన్సెక్స్‌ సూచి ఇంట్రాడేలో 954 పాయింట్ల కోల్పోయి, చివరకు 806 పాయింట్ల నష్టంతో 35169.16 వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచి నిఫ్టీ  ఇంట్రాడేలో 311 పాయింట్ల కోల్పోయి, చివరకు 259 పాయింట్ల నష్టంతో 10,599.25 వద్ద ముగిసింది. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం(250 పాయింట్లు) నష్టంతో 24,819.30 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టపోయాయి. అత్యధికంగా ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎంజీసీ సూచీలు 3శాతం నష్టపోయాయి.
ఇంట్రాడే ట్రేడింగ్‌ సాగిందిలా:-
ఇటీవల మార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితుల నేపథ్యంలో నేటి ఉదయం సూచీలు భారీ గ్యాప్‌ డౌన్‌తో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెస్సెక్స్‌ 155 పాయింట్ల నష్టంతో 35820 వద్ద, నిప్టీ 104 పాయింట్ల నష్టంతో 10,754 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రూపాయి కొత్త జీవిత కాల కనిష్టానికి పతనం కావడం, ముడిచమురు మంటలు, వాణిజ్య లోటు, దేశీయ మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లు తరలిపోవడం తదితరకారణాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేకెత్తించడంతో మార్కెట్లలో మరింత పెరిగాయి. ముఖ్యంగా ట్రేడింగ్‌లో హెవీవెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌ బ్యాంకు షేర్లలో నష్టాల ట్రేడింగ్‌ సూచీల క్షీణతకు మరింత సహకరించింది. ఫలితంగా మిడ్‌సెషన్‌ కల్లా సెన్సెక్స్‌ సూచి 870 పాయింట్లు కోల్పోయి 35119, మరో ప్రధాన సూచి నిఫ్టీ 270 పాయింట్ల నష్టపోయి 10591కు చేరుకుంది. మిడ్‌సెషన్‌ అనంతరం కొచ్చర్‌ రాజీనామా ఆమోదం అంశం వెలుగులోకి రావడంతో బ్యాంకింగ్‌ షేర్లలో స్వల్పరికవరీ కొనసాగింది. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్‌ షేర్లు 5శాతం లాభపడంతో బ్యాంకింగ్‌ షేర్ల నష్టాలు స్వల్పంగా తగ్గాయి. అయితే, ఈ అంశం మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఫలితంగా గంట గంటకు మార్కెట్‌కు నష్టాలు పెరిగాయి. ట్రేడింగ్‌ చివరి సెషన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ...పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై సుంకాల్ని తగ్గిస్తున్నట్లు చేసిన ప్రకటనతో పెట్రో మార్కెటింగ్‌ షేర్లు, ఓఎన్‌జీసీ తీవ్రంగా నష్టపోవడంతో సెన్సెక్స్‌ సూచి 954 పాయింట్ల నష్టంతో 35,022 వద్ద, నిఫ్టీ సూచి 311 పాయింట్లు నష్టంతో 10,547.25 ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 8శాతం నష్టం:-
మార్కెట్‌ పతనంలో భాగంగా రియలన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు గురువారం ఎన్‌ఎస్‌ఈలో గురువారం 8.02శాతం నష్టపోయి రూ.1,108.50ల వద్ద ముగిసింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో రూ.1,189.50 ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో మార్కెట్‌ పతనంలో భాగంగా ఇన్వెస్టర్లు రిలయన్స్‌ షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. 8.22 శాతం నష్టపోయి రూ.1106.00 స్థాయికి చేరుకుంది. నేటి ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్‌లో రిలయన్స్‌ షేరు 2.32కోట్లు వాల్యూమ్స్‌తో ట్రేడైంది. రెండేళ్ల ఈ షేరు ఒకేరోజులో ఇంత స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. నేడు నిఫ్టీ కోల్పోయిన మొత్తం పాయింట్లలో ఒక్క రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరువే 62 పాయింట్లు కావడం విశేషం.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 8నుంచి  22శాతం నష్టపోగా, ఎల్‌ అండ్‌ టీ, యాక్సి్‌స్‌ బ్యాంకు, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇన్ఫ్రాటెల్‌, ఐసీఐసీఐ షేర్లు 1నుంచి 4శాతం పెరిగాయి.



You may be interested

ఆయిల్‌ షేర్లు కుదేలు..

Thursday 4th October 2018

ఆయిల్‌ రంగ షేర్లు ట్రేడింగ్‌ చివరి అర గంటలో భారీగా పతనమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయిల్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు బ్యారెల్‌కు 86 డాలర్లకు చేరిన నేపథ్యంలో ప్రజలపై ఆ భారం పడకుండా ఉండేందుకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గిస్తున్నట్లు ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2.50 తగ్గిస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే

ఆర్‌ఐఎల్‌ పతనం సాంకేతికమే!

Thursday 4th October 2018

ఇతర ప్రభావాలేమీ కనిపించడంలేదు మార్కెట్‌ నిపుణులు గురువారం మార్కెట్లు గజగజలాడాయి. దేశీయ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీ పతనంతో మార్కెట్లు దిక్కుతోచని పక్షులయ్యాయి. మార్కెట్‌ లీడర్‌ రిలయన్స్‌ షేరు గురువారం ఒక్కరోజే దాదాపు 7 శాతం పైచిలుకు పతనమైంది. ఒక దశలో 1106 రూపాయల వరకు క్షీణించిన ఆర్‌ఐఎల్‌ చివరకు స్వల్పంగా కోలుకొని 1122 రూపాయల వద్ద ముగిసింది. రిలయన్స్‌ ఢమాల్‌మనడంతో మార్కెట్లు అంతంతకంతకూ పడిపోయాయి. ఉన్నట్లుండి రిలయన్స్‌ షేరు ఇంతలా పడిపోవడం

Most from this category