STOCKS

News


10500 పాయింట్ల దిగువన నిఫ్టీ

Monday 10th December 2018
Markets_main1544438240.png-22807

సెన్సెక్స్‌ నష్టం@ 713పాయింట్లు
అంతర్జాతీయ ప్రతికూలతలకుతోడు ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో సోమవారం మార్కెట్లో బేర్స్‌ స్వైర విహారం చేశారు. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 713.53 పాయింట్లు కోల్పోయి 34959.72 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 205 పాయింట్ల నష్టంతో 10488.50 వద్ద ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 469 పాయింట్ల నష్టంతో 35,204 వద్ద, నిఫ్టీ 185 పాయింట్ల కోల్పోయి 10,508 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, ఈ ఏడాది రెండో క్వార్టర్‌లో కరెంట్‌ ఖాతా లోటు జీడీపీలో 2.9 శాతానికి పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌ మార్కెట్లో తిరిగి విక్రయాలు జరపడం, డాలర్‌ మారకంలో రూపాయి 3వారాల కనిష్టానికి చేరుకోవడం తదితర కారణాలు మార్కెట్‌పై ప్రభావాన్ని చూపాయి. దీనికి తోడు సాధారణ ఎన్నికలకు సెమిఫైనల్‌ భావించే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు  భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వెలువడవచ్చని పలు ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడికావడం కూడా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా ట్రేడింగ్‌ ఆద్యంతం అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు గంట గంటకు పెరుగుతూ వచ్చాయి. మిడ్‌సెషన్‌ అనంతరం యూరప్‌ మార్కెట్లు నష్టాల ప్రారంభం, ఆసియా మార్కెట్ల నష్టాల ముగింపు...ఇక్కడి సూచీల నష్టాలను మరింత తీవ్రతరం చేశాయి. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 757 పాయింట్లను కోల్పోయి 34,915.77 వద్ద, నిఫ్టీ సూచీ 219 పాయింట్లను కోల్పోయి 10,475 వద్ద ఇంట్రాడే కనిష్టానికి తాకాయి.

భారతీ ఎయిర్టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 4శాతం నుంచి 6శాతం నష్టపోగా, మారుతి, హెచ్‌పీసీఎల్‌, కోల్‌ఇండియా, బీపీసీఎల్‌, ఐఓసీ షేర్లు అరశాతం నుంచి 3.50శాతం వరకూ లాభపడ్డాయి.



You may be interested

ఎంకే గ్లోబల్‌ టాప్‌ పిక్స్‌ ఇవే..

Monday 10th December 2018

ఎంకే గ్లోబల్‌ తాజాగా వచ్చే 12-18 నెలల కాలంలో 13-85 శాతం రాబడిని అందించే పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం..  స్టాక్‌: అశోక్‌ లేలాండ్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌ రూ.186 రిటర్న్‌ అంచనా: 28 శాతం స్టాక్‌: అరబిందో ఫార్మా రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.690 రిటర్న్‌ అంచనా: 13 శాతం స్టాక్‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,306 రిటర్న్‌ అంచనా: 13 శాతం స్టాక్‌: ఐసీఐసీఐ బ్యాంక్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.392 రిటర్న్‌ అంచనా: 38 శాతం స్టాక్‌: ఇన్‌సెక్టిసైడ్స్‌

రియల్టీ షేర్లు..పల్టీ

Monday 10th December 2018

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం రియల్టీ రంగ షేర్లు బోర్లా పడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 3.30శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నాం గం.3:15ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(230.45)తో పోలిస్తే 3శాతం నష్టంతో 223.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోని మొత్తం 10 షేర్లు నష్టాల బాట పట్టాయి. అత్యధికంగా ఇండియాబుల్స్‌ రియల్టీ షేరు 6.50శాతం నష్టపోయింది. యూనిటెక్‌ 5శాతం, శోభ, ఒబేరాయ్‌

Most from this category