STOCKS

News


బ్లాక్‌స్టోన్‌ చేతికి ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

Wednesday 12th June 2019
Markets_main1560319174.png-26246

  • 97.7 శాతం వాటా కొనుగోలు 
  • రూ.2,200 కోట్ల డీల్‌
  • మరో రూ.800 కోట్లు పెట్టుబడి

 న్యూఢిల్లీ: తక్కువ ఆదాయ వర్గాల వారికి గృహరుణాలిచ్చే ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీని బ్లాక్‌స్టోన్‌ సంస్థ కొనుగోలు చేసింది. ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 97.7 శాతం వాటాను రూ.2,200 కోట్లకు కొనుగోలు చేశామని బ్లాక్‌స్టోన్‌ వెల్లడించింది. ఈ కంపెనీ భవిష్యత్తు వృద్ధి కోసం మరో రూ.800 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని పేర్కొంది. ఈ పెట్టుబడుల కారణంగా కంపెనీ నెట్‌వర్త్‌ దాదాపు రెట్టింపవుతుందని, ఈక్విటీకి, రుణానికి ఉండే నిష్పత్తి దాదాపు సగం తగ్గుతుందని వివరించింది. 
ఆధార్‌ ఆస్తులు... రూ.10,000 కోట్లు 
ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 97.7 శాతం వాటాను బ్లాక్‌స్టోన్‌ నిర్వహణలో ఉన్న ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్స్‌ కొనుగోలు చేశాయి. ఈ కంపెనీలో నియంత్రణ వాటాలున్న వాధ్వాన్‌ గ్లోబల్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ (డబ్ల్యూజీసీ), డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి పూర్తి వాటాను కొనుగోలు చేశామని బ్లాక్‌స్టోన్‌ పేర్కొంది. దాదాపు 20 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నిర్వహణ ఆస్తులు రూ.10,000 కోట్లుగా ఉన్నాయి. ఈ కంపెనీ ఇచ్చే సగటు గృహ రుణం రూ.10 లక్షల మేర ఉంటుంది. 51,200 కోట్ల డాలర్ల అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ బ్లాక్‌స్టోన్‌...  2006 నుంచి భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ భారత రియల్టీ, ఇతర రంగాల్లో 1,040 కోట్ల డాలర్లు  ఇన్వెస్ట్‌ చేసింది. You may be interested

యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌లో కోత..!

Wednesday 12th June 2019

పరిశీలిస్తున్న మూడీస్‌; రేటింగ్‌ తగ్గించే అవకాశం ముంబై: బ్యాంకింగేతర సంస్థలకు అధిక స్థాయిలో రుణాలను మంజూరీ చేసిన నేపథ్యంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ తగ్గే అవకాశం ఉందని.. అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ సంకేతాలిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు ‘బీఏ1’ రేటింగ్‌ ఉండగా.. ఇందులో సవరణ జరిగే అవకాశం ఉందనే దిశగా మూడీస్‌ వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంక్‌ మొత్తం

రేట్ల కోత రుణాల డిమాండ్‌ను పెంచకపోవచ్చు

Wednesday 12th June 2019

బ్యాంకులకు మూలధన నిధుల ఆటంకాలు ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ సమస్యలు దీంతో రుణాల వృద్ధి కష్టమేనని ఫిచ్‌ అంచనా ముంబై: ఆర్‌బీఐ వరుసగా మూడు సార్లు పావు శాతం చొప్పున మొత్తం 0.75 శాతం రెపో రేట్‌ను తగ్గించినప్పటికీ రుణాలకు వృద్ధి పుంజుకోకపోవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ అభిప్రాయపడింది. బ్యాంకుల స్థాయిలో మూలధన ఇబ్బందులు, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభం తీవ్రతరం కావడాన్ని కారణాలుగా పేర్కొంది. ఈ ఏడాది మూడు సార్లు ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్షలు జరగ్గా,

Most from this category