13 నెలల కనిష్టస్థాయికి బిట్‌కాయిన్
By Sakshi

క్రిప్టోకరెన్సీ విభాగంలో మార్కెట్ లీడర్‌గా అవతరించిన బిట్‌కాయిన్ తాజాగా 5,000 డాలర్ల మార్కును కోల్పోయింది. సరిగ్గా ఏడాది కిందట 20,000 డాలర్లకు సమీపించి.. మరింత ముందుకు వెళ్లడం ఖాయం అనే భ్రమలు కల్పించిన ఈ డిజిటల్ కరెన్సీ, పలు దేశాల నియంత్రణా పరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో తిరోగమనం బాట పట్టింది. భారతదేశంలో క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత లేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది ప్రారంభంలో స్పష్టంచేయడం.. ఆ తరువాత అనేక దేశాల నుంచి ఇదే తరహా సవాళ్లను ఈ కరెన్సీ ఎదుర్కోవడం లాంటి ప్రతికూల పరిణామాలతో పతనం దిశగా జర్నీ కొనసాగించింది. ఇక తాజాగా శుక్రవారం అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (యూఎస్ సెక్) ఎయిర్ఫోక్స్, పారగాన్ కాయిన్ ఇంక్ అనే రెండు క్రిప్టోకరెన్సీ కంపెనీలపై సివిల్ పెనాల్టీ విధించిన కారణంగా సోమవారం ట్రేడింగ్‌లో భారీ పతనాన్ని నమోదుచేసింది. ఇరు సంస్థలు ఏకంగా 250,000 డాలర్లను పెనాల్టీ కింద కట్టాల్సి ఉందన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో వరుసగా 8వ రోజూ పతనమైంది. భారతకాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి కాయిన్‌డెస్క్ ప్లాట్‌ఫాంపై 13 శాతం నష్టపోయి 4,805 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 718 డాలర్లు కోల్పోయింది. మరో క్రిప్టోకరెన్సీ ఎథరియం కూడా 13 శాతం (23 డాలర్లు) నష్టపోయి ప్రస్తుతం 146 డాలర్ల వద్ద కొనసాగుతుంది. లైట్‌కాయిన్ 10 శాతం నష్టపోయి 37 దగ్గర కదలాడుతోంది.
You may be interested
ఆర్బీఐ-కేంద్రం సయోధ్య.. రూపీకి బలం..
Tuesday 20th November 2018అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి మంగళవారం లాభాల్లో ట్రేడవుతోంది. రూపాయి బలపడటం ఇది వరుసగా ఆరో సెషన్. అలాగే రూపాయి వరుసగా ఇన్ని సెషన్లు పెరగడం 2017 అక్టోబర్ నుంచి చూస్తే ఇదే ప్రధమం. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య సోమవారం జరిగిన సమావేశంలో దాదాపు కీలక అంశాలన్నిటి మధ్య సయోధ్య కుదరడం సానుకూల ప్రభావం చూపింది. ఉదయం 9:15 సమయంలో ఇండియన్ రూపాయి తన మునపటి ముగింపుతో
మంగళవారం వార్తల్లోని షేర్లు
Tuesday 20th November 2018వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఫోర్టీస్ మలార్ హాస్పిటల్:- సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి విజయశరత్ దిక్షాన్ రాజీనామా చేశారు. ఎస్కార్ట్:- రూ.100 కోట్ల వాణిజ్య పేపర్ల ఇష్యూకు ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసెల్ ఏ1(+) రేటింగ్‌ను కేటాయించింది. ఎన్ఎండీసీ:- దొనిమలై మైనింగ్ లీజ్ సమస్యపై స్పష్టతనిచ్చింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ లీజ్‌ను రద్దు చేస్తున్నట్లు వెలువడిన వార్తలను ఖండించింది. దొనిమలై మైనింగ్ లీజును నవంబర్ 4నుంచి