STOCKS

News


700 బిలియన్‌ డాలర్లు నష్టపోయిన క్రిప్రోకరెన్సీ

Friday 23rd November 2018
Markets_main1542967656.png-22350

ఈఏడాదిలోనే అత్యధికంగా నష్టపోయిన వారంగా క్రిప్రోకరెన్సీ ట్రేడింగ్‌ రికార్డు సృష్టించింది. గోడకు కొట్టిన బంతిలా ఈ విభాగంలోని డిజిటల్‌ కరెన్సీలు వెనక్కు వచ్చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 700 బిలియన్‌ డాలర్లు (మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.49,46,550 కోట్లు) సంపద ఆవిరైపోయింది. ఈ విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా అవతరించిన బిట్‌కాయిన్‌ తాజాగా 4,000 డాలర్ల మార్కుకు సమీపించింది. సరిగ్గా ఏడాది కిందట 20,000 డాలర్లకు సమీపించి.. మరింత ముందుకు వెళ్లడం ఖాయం అనే భ్రమలు కల్పించిన ఈ డిజిటల్‌ కరెన్సీ, పలు దేశాల నియంత్రణా పరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో తిరోగమనం బాట పట్టింది. భారతకాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి కాయిన్‌డెస్క్‌ ప్లాట్‌ఫాంపై 4,119 వద్ద ట్రేడవుతోంది. మరో క్రిప్టోకరెన్సీ ఎథరియం 6 శాతం (7 డాలర్లు) నష్టపోయి ప్రస్తుతం 123 డాలర్ల వద్ద కొనసాగుతుంది. లైట్‌కాయిన్‌ 4 శాతం నష్టపోయి 32 దగ్గర కదలాడుతోంది. ఇక భారత్‌లో క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత లేదనే విషయం తెలిసిందే.



You may be interested

10,239 పాయింట్లను కోల్పోతే 10,000 వద్దకే..

Friday 23rd November 2018

ముంబై: వారాంతం ప్రకారం నిఫ్టీ 10,239 పాయింట్ల దిగువన ముగిసిందంటే.. అక్కడ నుంచి 9,900 – 9,700 స్థాయికి పడిపోయే అవకాశం ఉందని భావించవచ్చని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహ్మద్‌ విశ్లేషించారు. అక్టోబరు 4న 10,754-10,843 స్థాయిలోని బేరిష్‌ గ్యాప్‌లోనికి ప్రవేశించినట్లు వివరించిన ఈయన.. నిజానికి ఈఏడాది ప్రారంభం నుంచే మార్కెట్‌ బేర్‌ పట్టులోనికి వెళ్లిపోయిందని చార్టుల

నెలరోజులకు మూడు సిఫార్సులు..

Friday 23rd November 2018

ముంబై: నిఫ్టీకి 10500-10440 పాయింట్ల స్థాయిలో కీలక మద్దతు ఉందని వే2వెల్త్‌ బ్రోకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఆదిత్య అగర్వాల్ విశ్లేషించారు. ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోగలిగితే.. షార్ట్‌ కవరింగ్‌ చోటుచేసుకుని ఈ సిరీస్‌ ముగింపు నాటికి 10600-10650 స్థాయిలకు చేరుకుంటుందని అంచనావేశారు. దిగువస్థాయిల వద్ద ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, మిడ్ క్యాప్ టెక్నాలజీ, ఆటో రంగ షేర్లు మద్దతు ఇవ్వనున్నట్లు విశ్లేషించారు. వచ్చే నెలరోజుల్లో

Most from this category