STOCKS

News


ఈ నెల 13 నుంచి భెల్‌ షేర్ల బైబ్యాక్‌

Thursday 6th December 2018
Markets_main1544075999.png-22694

న్యూఢిల్లీ: భెల్‌ షేర్ల బైబ్యాక్‌ ఈ నెల 13 నుంచి ప్రారంభమై 27న ముగియనున్నది. . ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా భెల్‌ కంపెనీ 5.16 శాతం వాటాకు సమానమైన 18.93 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌ కోసం ఈ కంపెనీ రూ.1,628 కోట్లు కేటాయించింది. టెండర్‌ ఆఫర్‌ మార్గంలో షేర్లను బైబ్యాక్‌ చేస్తామని, రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను బైబ్యాక్‌ ధరను రూ.86గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది.ఈ షేర్ల బైబ్యాక్‌ను ఈ ఏడాది అక్టోబర్‌ 25నే డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించింది. తర్వాతి రోజే బైబ్యాక్‌ వివరాలను కంపెనీ వెల్లడించింది. గత నెల 6 రికార్డ్‌ డేట్‌గా ఉంది. మరో వారం రోజుల్లో షేర్ల బైబ్యాక్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో బుధవారం బీఎస్‌ఈలో భెల్‌ షేర్‌  5.75 శాతం నష్టంతో రూ.66.40 వద్ద ముగిసింది.



You may be interested

జీడీపీ అంచనాల్ని తగ్గించిన ఫిచ్‌

Thursday 6th December 2018

7.8 శాతం నుంచి 7.2 శాతానికి ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ రేటింగ్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-19) సంబంధించి ఇండియా జీడీపీ వృద్ధి రేటు అంచనాల్లో కోత విధించింది. 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరపు జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతం నుంచి 7 శాతానికి, 2020-21 ఆర్థిక సంవత్సరపు జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతం

ముంబై-పుణె మధ్య హెలికాప్టర్‌ సేవలు

Thursday 6th December 2018

ముంబై: యాప్‌తో నిమిషంలో క్యాబ్‌ బుక్‌ చేసుకున్నట్టే... త్వరలో హెలికాప్టర్‌ సర్వీస్‌ను ఇంతే సులభంగా ఆర్డర్‌ చేసే అవకాశం రానుంది. దేశంలో తొలిసారిగా రెండు నగరాల మధ్య హెలికాప్టర్‌ సేవలు ఆరంభం కానున్నాయి. అమెరికాలో అతిపెద్ద హెలికాప్టర్‌ సేవల సంస్థ అయిన ‘ఫ్లై బ్లేడ్‌’ ఇందుకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీకి చెందిన హంచ్‌ వెంచర్స్‌ భాగస్వామ్యంతో కలసి ఈ సంస్థ ముంబై-పుణె నగరాల మధ్య హెలికాప్టర్‌ సర్వీసులను వచ్చే మార్చి

Most from this category