STOCKS

News


ఫ్యూచర్‌ రిటైల్‌ షేర్ల విక్రయం

Friday 30th November 2018
Markets_main1543555840.png-22517

న్యూఢిల్లీ: భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీ... ఫ్యూచర్‌ రిటైల్‌ షేర్లను విక్రయించింది. బహిరంగ మార్కెట్‌ లావాదేవీల్లో భాగంగా ఫ్యూచర్‌ రిటైల్‌కు చెందిన 1.13 శాతం వాటాకు సమానమైన 57 లక్షలకు పైగా షేర్లను భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ అమ్మేసింది. ఈ షేర్లను ఎడిల్‌వీజ్‌ గ్రూప్‌ రూ.300 కోట్లకు కొనుగోలు చేసిందని బీఎస్‌ఈ బ్లాక్‌ డీల్‌ డేటా వెల్లడించింది. ఒక్కో షేర్‌ సగటు విక్రయ విలువ రూ.525.9 గా ఉంది. ఎడిల్‌వీజ్‌ గ్రూప్‌నకు చెందిన ఈక్యాప్ ఈక్విటీస్‌ 16.5 లక్షల షేర్లను రూ.87 కోట్లకు, ఎడిల్‌వేజ్‌ స్పెషల్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ 40.43 లక్షల షేర్లను రూ.212 కోట్లకు కొనుగోలు చేశాయి. కాగా గురువారం బీఎస్‌ఈలో ఫ్యూచర్‌ రిటైల్‌ షేర​ 4 శాతం నష్టంతో రూ.504 వద్ద ముగిసింది. 
 



You may be interested

ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు రూ.35,000 కోట్లు కావాలి: ఇక్రా

Friday 30th November 2018

ముంబై: దేశీయ విమానయాన సేవల సంస్థలకు వచ్చే నాలుగేళ్లలో భారీ స్థాయిలో నిధుల అవసరం ఉందని, సుమారు రూ.35,000 కోట్ల మేర మూలధనం అవసరం అవుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా. పెరిగిపోయిన చమురు ధరలు, రూపాయి విలువ క్షీణత, తీవ్రమైన పోటీ కారణంగా విమానయాన సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న విషయం తెలిసిందే. జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య

అమెజాన్‌పై జర్మనీ నియంత్రణ సంస్థ విచారణ

Friday 30th November 2018

బెర్లిన్‌: థర్డ్‌ పార్టీ విక్రేతల డేటాను తన లబ్ధికి ఉపయోగించుకుంటోందన్న ఆరోపణలపై యూరోపియన్ కమిషన్ విచారణ ఎదుర్కొంటున్న ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. మార్కెట్లో ఆధిపత్యాన్ని అమెజాన్‌ దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై తాజాగా జర్మనీ నియంత్రణ సంస్థ ఫెడరల్ కార్టెల్ ఆఫీస్ దృష్టి సారించింది. పోటీ సంస్థలను తమ ప్లాట్‌ఫాంపై విక్రయించనివ్వకుండా అమెజాన్ అడ్డుకుంటోందన్న అంశంపై విచారణ ప్రారంభించింది. విక్రేతలకు సంబంధించి అమెజాన్ వ్యాపార నిబంధనలు, డేటా

Most from this category