STOCKS

News


మే 3 నుంచి ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్యూ

Saturday 20th April 2019
Markets_main1555738944.png-25241

- మే 17న ముగింపు 
- రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.25,000 కోట్లు సమీకరణ

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ రైట్స్‌ ఇష్యూ వచ్చే నెల 3న మొదలై 17న ముగుస్తుంది. ఈ రైట్స్‌ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ రూ.25,000 కోట్లు సమీకరించనున్నది. స్ల్పిట్‌ దరఖాస్తు ఫారాలను మే 10లోపు సమర్పించాలని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ రైట్స్‌ ఇష్యూకు అర్హులైన వాటాదారులను గుర్తించడానికి రికార్డ్‌ డేట్‌ను ఈ నెల 24గా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఈ రైట్స్‌ ఇష్యూలో భాగంగా ఒక్కో షేర్‌ను రూ.220 ధరకు అర్హులైన వాటాదారులకు జారీ చేస్తారు. 
విస్తరణకు ‘రైట్స్‌ ఇష్యూ’ నిధులు...
ఈ రైట్స్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తులో నెట్‌వర్క్‌ విస్తరణకు, కంటెంట్‌ తయారీకి, సాంకేతిక భాగస్వామ్యాల కోసం వినియోగించాలని కంపెనీ యోచిస్తోంది. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.25,000 కోట్లతో పాటు ఫారిన్‌ కరెన్సీ పెర్‌పెచ్యువల్‌ బాండ్ల జారీ ద్వారా మరో రూ.7,000 కోట్లను, మొత్తం రూ.32,000 కోట్ల నిధులను ఈ కంపెనీ సమీకరిస్తోంది. భారతీఎయిర్‌ టెల్‌ కంపెనీలో అతి పెద్ద ఇన్వెస్టర్‌ సింగ్‌టెల్‌, మరో పెద్ద భాగస్వామి జీఐసీ సింగపూర్‌లు ఈ నిధుల సమీకరణలో పాలుపంచుకోనున్నాయి. రైట్స్‌ ఇష్యూలో సింగ్‌టెల్‌ కంపెనీ రూ.3,750 కోట్లు, జీఐసీ సింగపూర్‌ సంస్థ రూ.5,000 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేయడానికి అంగీకరించాయి.



You may be interested

యూపీఎస్సీ ప్రిపరేషన్‌ చాలా ఈజీ!

Saturday 20th April 2019

- వీడియో పాఠాలు అందిస్తున్న లెర్నింగ్‌ స్పేస్‌ - 12 వేల మంది యూజర్లు; 25 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే - త్వరలోనే రూ.7 కోట్ల నిధుల సమీకరణ పూర్తి - ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ వెంకటేశ్వర రావు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 1990 యూపీఎస్సీ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షలో 72వ ర్యాంక్‌. మంచి హోదాలో ఇండియన్‌ రైల్వే సర్వీసెస్‌లో  (ఐఆర్‌ఎస్‌) ఉద్యోగం. ఇల్లు, పెళ్లి, పిల్లలు.. అంతా బాగానే ఉంది. కానీ, ఏదో

భారత్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడి

Saturday 20th April 2019

టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ వెల్లడి న్యూఢిల్లీ: షార్ట్‌ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేధించినప్పటికీ భారత్‌లో వచ్చే మూడేళ్లలో 1 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ వెల్లడించింది. అలాగే ఈ ఏడాది ఆఖరుకి భారత్‌లోని ఉద్యోగుల సంఖ్యను కూడా 1,000కి పెంచుకోనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం 250 మంది ఉద్యోగులున్నట్లు బైట్‌డ్యాన్స్ డైరెక్టర్ (ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ విభాగం) హెలినా లెర్ష్‌ వెల్లడించారు. స్వల్ప నిడివి ఉండే

Most from this category