STOCKS

News


భారతీ ఎయిర్‌టెల్‌కు రైట్స్‌ ఇష్యూతో బలం!

Friday 19th April 2019
Markets_main1555697228.png-25234

భారతీ ఎయిర్‌టెల్‌ భారీ రైట్స్‌ ఇష్యూ మే 3న ప్రారంభమై 17వ తేదీన ముగియనుంది. రైట్స్‌ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం మీద రూ.25,000 కోట్లను సమీకరించనుంది. రైట్స్‌ ఇష్యూలో పాల్గొనేందుకు రికార్డ్‌ తేదీగా ఏప్రిల్‌ 24ను కంపెనీ ఖరారు చేసింది. ఈ తేదీ నాటికి వాటాదారులుగా ఉన్న వారికే రైట్స్‌ ఇష్యూలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ ఇష్యూ కంపెనీకి లాభించే అంశంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

 

రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు ఈ నెల మొదట్లోనే కంపెనీకి సెబీ అనుమతించింది. రిలయన్స్‌ జియో పోటీని ఎదుర్కొని మార్కెట్లో పోటీనిచ్చేందుకు గాను 4జీ నెట్‌వర్క్‌ల బలోపేతంపై ఇన్వెస్ట్‌ చేసేందుకు కంపెనీ భారీ నిధుల సమీకరణ తలపెట్టింది. మరో పోటీ సంస్థ వొడాఫోన్‌ ఐడియా సైతం రూ.25,000 కోట్ల రైట్స్‌ ఇష్యూను చేపట్టిన విషయం తెలిసిందే. జియో రంగప్రవేశం తర్వాత భారతీ ఎయిర్‌టెల్‌ గత మూడేళ్ల కాలంలో పెద్ద ఎత్తున నిధుల సమీకరణ మార్గాలను ఆశ్రయించింది. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, డీటీహెచ్‌ వ్యాపారంలో వాటాలను విక్రయించడంతోపాటు, ఆఫ్రికా టెలికం వ్యాపారంలో భాగంగా టవర్ల వ్యాపారాన్ని డైవెస్ట్‌ చేయడం ద్వారా మొత్తం మీద రూ.27,800 కోట్లను సమీకరించింది. తాజా నిధుల సమీకరణ కంపెనీకి సానుకూలమని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. తాజా నిధులతో భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా రుణ భారం తగ్గుముఖం పడుతుందని వెల్లడించింది. డెట్‌ టు ఈక్విటీ రేషియో భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థకు ప్రస్తుతం 1.5రెట్లు, వొడాఫోన్‌ ఐడియాకు 1.6రెట్లు ఉండగా, రైట్స్‌ ఇష్యూ అనంతరం ఇది 0.9రెట్లకు తగ్గుతుందని తన నివేదికలో పేర్కొంది. ప్రమోటర్లు పెద్ద ఎత్తున నిధులు అందించేందుకు ముందుకు రావడం, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాల పట్ల వారిలో ఉన్న విశ్వాసానికి నిదర్శమని ఎడెల్‌వీజ్‌ తెలిపింది.



You may be interested

ర్యాలీలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఏం చేశాయి?

Friday 19th April 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) ఫిబ్రవరి నుంచి మొదలైన ర్యాలీలో ప్రభుత్వరంగ బ్యాంకులు, స్పెషాలిటీ కెమికల్స్‌, కార్బన్‌ బ్లాక్‌ కంపెనీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు, ఫార్మా కంపెనీల్లో వాటాలను తగ్గించుకున్నాయి. అదే సమయంలో కన్జ్యూమర్‌ ఆధారిత వ్యాపార కంపెనీలైన ఎఫ్‌ఎంసీజీ, హాస్పిటాలిటీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం గమనార్హం. దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు విద్యుత్‌ తయారీ సంస్థలు, బ్యాటరీ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్‌ చేశాయి.    మార్చి త్రైమాసికంలో మొత్తం మీద ఈక్విటీల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌

ఆర్‌ఐఎల్‌ షేరుపై అనలిస్టుల అంచనాలివి..

Friday 19th April 2019

మార్చి క్వార్టర్‌లో రికార్డు లాభాలను ప్రకటించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ షేరు సోమవారం(ఏప్రిల్‌ 22న) ట్రేడింగ్‌ను పాజిటివ్‌గా ప్రారంభించవచ్చని షేర్‌ఖాన్‌ బ్రోకరింగ్‌ సంస్థ సీనియర్‌ విశ్లేషకుడు అభిజిత్‌ బోరా అభిప్రాయపడుతున్నారు. స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ (జీఆర్‌ఎమ్‌) 8.2 డాలర్లు నమోదైంది. ఇది సింగపూర్‌ జీఆర్‌ఎమ్‌ కంటే అధికంగా ఉందని ఆయన్నారు. కన్జ్యూమర్‌ వ్యాపారాలైన రీటైల్‌, జియో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ ఆయా రంగాల మార్జిన్లు పెరిగాయి. ఇక ముందస్తు అంచనాలకు అనుగుణంగానే చమురు శుద్ధి,

Most from this category