STOCKS

News


ఎయిర్‌టెల్‌, ఐడియాల షేర్లకు జియో షాక్‌

Friday 18th January 2019
Markets_main1547799593.png-23666

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెలికాం విభాగమైన రిలయన్స్‌ జియో క్యూ3లో భారీ లాభాలను ఆర్జించడంతో పాటు రుణభారాన్ని తగ్గించేందుకు నిధుల సమీకరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రత్యర్థి టెలికాం కంపెనీ షేర్లైన భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా షేర్లు నష్టాలబాట పట్టాయి.  జియో లాభాలు ఈ క్యూ3లో 65శాతం పెరిగి రూ.831 కోట్లకు చేరాయి. ముఖ్యంగా కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్యూ2లో 16 కోట్లుగా వున్న వినియోగదారుల సంఖ్య ఈ క్యూ3 కాలానికి 28 కోట్లకు చేరుకుంది. సగటున ప్రతి సబ్‌స్క్రెబర్‌ నెలకు 10.8బీజీ డాటాను, 794 నిమిషాల టాక్‌టైంను వినియోగించుకున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తానికి క్యూ3లో డేటా వినియోగం 431 కోట్ల గిగాబైట్ల నుంచి 864 కోట్ల గిగాబైట్స్‌కి చేరింది. రుణభారాన్ని తగ్గించేందుకు నిధుల సమీకరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
భారతీ ఎయిర్‌టెల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.330.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఒకానొకదశలో 7శాతం నష్టపోయి రూ.309.35 కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు ధర(రూ.332.05)తో పోలిస్తే 6శాతం నష్టంతో రూ.311.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ -50 సూచీలోని టాప్‌ -5 లూజర్లలో సన్‌ఫార్మా( 11శాతం నష్టం) తర్వాత అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే కావడం గమనార్హం.
వోడాఫోన్‌ ఐడియా:- నేడు ఎస్‌ఎస్‌ఈలో షేరు రూ.37.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 7శాతం నష్టపోయి రూ.34.35ల వద్ద కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.1:30లకు షేరు గత ముగింపు ధర(రూ.36.95)తో పోలిస్తే 6శాతం నష్టంతో రూ.34.75ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.32.00 రూ.104.35లుగా నమోదయ్యాయి.



You may be interested

తగ్గిన సన్‌ టీవీ వెలుగులు

Friday 18th January 2019

మీడియా షేర్ల పతనంలో భాగంగా సన్‌టీవీ షేర్లు శుక్రవారం ఏడాది కనిష్టానికి నష్టపోయాయి. నేటి బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో సన్‌టీవీ షేర్లు రూ.567.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో షార్ట్‌ సెల్లింగ్‌తో షేరు ఒక్కసారిగా తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకానొకదశలో 9శాతం నష్టపోయి రూ.513.75ల కనిష్టానికి చేరుకుంది. ఇది ఈ షేరుకు ఏడాది కనిష్టస్థాయికి కావడం గమనార్హం. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గతముగింపు(రూ.567.30)తో పోలిస్తే 7.50శాతం నష్టపోయి రూ.525.00ల వద్ద

లాంగ్‌టర్మ్‌ కోసం టాప్‌టెన్‌ సిఫార్సులు

Friday 18th January 2019

దీర్ఘకాల పెట్టుబడితో దాదాపు 50 శాతం వరకు రాబడినందించే పది స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 1. యాంబిట్‌ క్యాపిటల్‌ రికమండేషన్‌- వీఐపీ ఇండస్ట్రీస్‌: టార్గెట్‌ రూ. 653. దేశంలో లీడింగ్‌ లగేజ్‌ బ్రాండ్‌. డిస్ట్రిబ్యూటర్‌ నెట్‌వర్క్‌, ఉత్పత్తుల నాణ్యత కంపెనీని బలంగా నిలబెడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎబిటాలో 25 శాతం వార్షిక వృద్ధి ఉండొచ్చు. రెవెన్యూలో 24 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా. కరెన్సీ ఒడిదుడుకులు, ముడిపదార్ధాల వ్యయం

Most from this category