STOCKS

News


మూడీస్‌ వాచ్‌లిస్ట్‌లో ఎయిర్‌టెల్‌.. షేరు 5% డౌన్‌

Friday 9th November 2018
Markets_main1541745429.png-21818

దేశీ ప్రముఖ టెలికం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌పై హాంగ్‌ కాంగ్‌కు చెందిన మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ప్రధానంగా దృష్టి పెట్టింది. భారతీ ఎయిర్‌టెల్‌ని రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ వాచ్‌లిస్ట్‌లో ఉంచింది. అంటే కంపెనీ పనితీరు సంతృప్తికరంగా లేకపోతే రేటింగ్‌లో కోత విధిస్తుంది. లాభదాయకత తక్కువ స్థాయిల్లో ఉండటం, క్యాష్‌ఫ్లో బలహీనంగా ఉండొచ్చనే అంచనాలు ఇందుకు కారణమని మూడీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సీనియర్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌ అన్నాలిసా డిచియరా తెలిపారు. తీవ్రమైన పోటీ కారణంగా ఇండియన్‌ మొబైల్‌ ఆపరేషన్స్‌ లాభదాయకత చాలా తక్కువగా ఉండటం, అధిక రుణ భారం, నెగటివ్‌ క్యాష్‌ ఫ్లో వంటివి ప్రతికూల అంశాలని పేర్కొన్నారు. మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ వార్తాల నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు మార్నింగ్‌ సెషన్‌లో ఏకంగా 5 శాతానికిపైగా పతనమైంది. కాగా భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రస్తుతం బీఏఏ3 ఇష్యూయర్‌ అండ్‌ సీనియర్‌ అన్‌సెక్యూర్డ్‌ రేటింగ్‌ ఉంది. బీఏఏ3 అనేది అతితక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ బాండ్‌ రేటింగ్‌. రేటింగ్‌ను దీనికి మించి తగ్గిస్తే అప్పుడు స్పెక్యులేటివ్‌ గ్రేడ్‌ లభిస్తుంది. ఇది రిస్క్‌ రేటింగ్‌.

మధ్యాహ్నం 12:05 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు ధర 2 శాతం క్షీణతతో రూ.300 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో షేరు ధర ఒకానొక సమయంలో రూ.288కి కూడా పడిపోయింది. 



You may be interested

స్వల్ప లాభంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌

Friday 9th November 2018

మార్కెట్‌ ఫ్లాట్‌ ట్రేడింగ్‌లో భాగంగా శుక్రవారం నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ కూడా స్వల్పంగా లాభపడింది. నేడు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 25,742.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు నష్టాల్లో ట్రేడ్‌ అయిన్పటికీ, హెవీ వెయిటేజీ షేర్లైన యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ షేర్ల ర్యాలీ బ్యాంక్‌ నిప్టీ ఇండెక్స్‌ మాత్రం లాభాల్లో ట్రేడైంది. ఇంట్రాడేలో అరశాతం

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ : అప్పర్‌ సర్క్యూట్‌

Friday 9th November 2018

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేరు శుక్రవారం 10శాతం లాభపడి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఏపీలో విశాఖపట్టణం కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించే డీసీఐఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న 73.44శాతం వాటా శాతం ఉంది. నిధుల సమీకరణలో భాగంగా ఈ కంపెనీలో ప్రభుత్వానికి ఉ‍న్న మొత్తం వాటాను విశాఖపట్టణం పోర్ట్‌ట్రస్ట్‌, పారదీప్‌ పోర్ట్‌ట్రస్ట్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ట్రస్ట్‌, కాండ్లా పోర్ట్‌ట్రస్ట్‌ల కన్సార్షియానికి విక్రయించేందుకు కేంద్ర కేబినేట్‌ గురువారం ఆమోదించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Most from this category