STOCKS

News


నెలన్నర గరిష్టానికి ఎయిర్‌టెల్‌

Friday 16th November 2018
Markets_main1542352726.png-22094

ప్రముఖ టెలికాం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ షేరు శుక్రవారం నెలన్నర గరిష్టాన్ని తాకింది.  నేడు భారతీ ఎయిర్‌టెల్‌ షేరు బీఎస్‌ఈలో రూ.303.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తెలియని కారణాలతో షేరు 8శాతం లాభపడి రూ.328.80ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరు నెలన్నర గరిష్టస్థాయి. అక్టోబర్‌ 01వ తేది తరువాత ఇంత స్థాయిలో ధరను తాకడం ఇదే తొలిసారి. మధ్యాహ్నం గం.12:25ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.303.8)తో పోలిస్తే 6శాతం లాభంతో రూ.321.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 277.00లు రూ.547.20లుగా నమోదయ్యాయి. అలాగే ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 సూచీలో 5.50శాతం లాభంతో రూ.321 వద్ద ట్రేడ్‌ అవుతూ సూచీలో టాప్‌-5 గెయినర్లలో అగ్రస్థానంలో ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 1.05 కోట్ల వాల్యూమ్స్‌తో ట్రేడై రూ.329.00ల గరిష్టాన్ని తాకింది.



You may be interested

10,520-10,690 రేంజ్‌లో నిఫ్టీ!!

Friday 16th November 2018

ద్రవ్యల్బోణం తగ్గుదల, మార్కెట్‌లో లిక్విడిటీ పెంచేందుకు రూ.12,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను ఆర్‌బీఐ కొనుగోలు చేయడం, క్రూడ్‌ ధరలు భారీగా పతనం కావడం వంటి అంశాల వల్ల సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారిందని 5నాన్స్‌.కామ్‌ ఫౌండర్‌, సీఈవో దినేష్‌ రోహిరా తెలిపారు. ఈ వారాన్ని గమనిస్తే నిఫ్టీ ఇంట్రాడేలో 10,616 స్థాయిని బ్రేక్‌ఔట్‌ చేసిందని, 10,651 స్థాయిని తాకిందని, అయితే ఇండెక్స్‌ మళ్లీ ఆస్థాయిలో నిలదొక్కుకోలేకపోయిందని పేర్కొన్నారు. వారంలో 10,440

విదేశీ నిధులు రావడం కష్టమే..!

Friday 16th November 2018

మార్కెట్లను ఆదుకుంటోన్న దేశీ నిధులు ముంబై: ప్రస్తుతం దేశీ సూచీలను ఆదుకుంటోంది భారతీయుల నిధుల ప్రవాహమే అని వ్యాఖ్యానించిన సీఎల్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌, ఇండియా స్ట్రాటజిస్ట్ మహేష్ నందూర్కర్.. ఇక్కడివారి నిధులు మాత్రమే మార్కెట్లను ఇంకొంతకాలం నిలబెట్టగలవని విశ్లేషించారు. కేవలం వీరి నిధుల కారణంగానే అధిక విలువలో ఉన్నప్పటికీ.. అభివృద్ధి చెందుతున్న దేశాల సూచీలను అవుట్‌పెర్ఫార్మ్‌ చేయగలుగుతున్నాయని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశీ

Most from this category