News


ఎయిర్‌టెల్‌కు డౌన్‌గ్రేడ్‌ షాక్‌​..!

Friday 11th January 2019
Markets_main1547197722.png-23534

గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ మెరిలించ్‌ దేశీయ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లకు షాకిచ్చింది. రానున్న రోజుల్లో ఎయిర్‌టెల్‌ ఎదుర్కోనున్న సవాళ్లను దృష్టి పెట్టుకుని ఆ కంపెనీ షేరు రేటింగ్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ మెరిలించ్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. అలాగే షేరు టార్గెట్‌ ధరను ప్రస్తుత ధర నుంచి రూ.300లకు కుదించింది. ఫలితంగా ఎయిర్‌టెల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనై ఇంట్రాడే 2.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.2:20లని.కు షేరు గతముగింపు(రూ.337.25)ధరతో పోలిస్తే 1.50శాతం నష్టంతో రూ.334 వద్ద ట్రేడ్‌ అవుతోంది. టెలికం రంగంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా జనవరి 1 2020 నుండి పూర్తిగా ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జీలను ఎత్తివేయాలని ట్రాయ్‌ తీసుకున్న నిర్ణయంతో రానున్న మూడేళ్ల ఎయిర్‌టెల్‌ ఎబిటా 2-10శాతం మధ్యలో నమోదవుతుందని మెర్లించ్‌ అంచనా వేసింది. అలాగే రిలయన్స్‌ జియో టెలికా మార్కెట్‌లో నెం.1 స్థానాన్ని చేరేంత వరకు జియో టారీఫ్‌లను తగ్గిస్తూనే ఉంటుందని, ఇది ఎయిర్టెల్‌కు ప్రతికూలాంశంగా మారుతుందని మెరిలించ్‌ అభిప్రాయపడుతుంది.



You may be interested

ఎంపిక చేసిన మిడ్‌క్యాప్స్‌ కొనొచ్చు!

Friday 11th January 2019

సీఎల్‌ఎస్‌ఏ సిఫార్సు గతేడాది పతనానంతరం కోలుకుంటున్న మిడ్‌క్యాప్స్‌ విభాగంలో నాణ్యమైన స్టాకులను లాంగ్‌టర్మ్‌ కోసం కొనుగోలు చేయవచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సూచించింది. తను సూచించిన స్టాక్స్‌పై ఎంతమంది అనలిస్టులు పాజిటివ్‌గా ఉన్నారో సైతం సీఎల్‌ఎస్‌ఏ వెల్లడించింది. 1. ఆదిత్య బిర్లా ఫాషన్‌ అండ్‌ రిటైల్‌: టార్గెట్‌ రూ. 240. దేశంలో టాప్‌ 4 అపెరల్‌ బ్రాండ్స్‌ ఉన్న కంపెనీ. రాబోయే రెండేళ్లలో ఈపీఎస్‌లో దాదాపు 30 శాతం వృద్ది ఉండొచ్చు.

టీసీఎస్‌ షేరు కొనొచ్చు.. కానీ ఎప్పుడు?

Friday 11th January 2019

క్యు3 ఫలితాల అనంతరం షేరుపై రివ్యూ బలమైన డీల్స్‌ గెలుచుకోవడం, డిజిటల్‌ విభాగంలో మంచి వృద్ది నమోదు కావడంతో టీసీఎస్‌ క్యు3 ఫలితాలు ఆకట్టుకున్నాయి. అయితే మార్జిన్లు క్రమానుగతంగా బలహీనపడడం ఆందోళనకరమని అనలిస్టుల అభిప్రాయం. మార్జిన్లపై భయాలతో పలు బ్రోకింగ్‌ సంస్థలు టీసీఎస్‌ ఎర్నింగ్స్‌ అంచనాలను తగ్గించాయి. యూఎస్‌లో మందగమనం వస్తే రెవెన్యూ వృద్ధి బలహీనపడవచ్చంటున్నాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ షేరు పోర్టుఫోలియోలో ఉండాల్సిన స్టాకే కానీ ప్రస్తుత ధరల వద్ద

Most from this category