STOCKS

News


బీఈఎల్‌ 11 శాతం అప్‌

Wednesday 26th September 2018
Markets_main1537948635.png-20593

ముంబై:- వచ్చే మూడేళ్లలో కంపెనీ రెండంకెల వృద్ధిని సాధిస్తుందని యాజమాన్యం చేసిన ప్రకటనతో ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌(బీఈఎల్‌) షేరు బుధవారం భారీగా లాభపడింది. వచ్చే మూడేళ్లలో కంపెనీ ఆదాయం 12-15శాతం వృద్ధిని, ఈబిటా మార్జిన్‌ వృద్ధి 17-19శాతం మధ్య నమోదు చేస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రూ.18-20వేల కోట్ల ఆర్డర్లను దక్కించుకుందని ప్రకటించింది. అలాగే పెరిగిన కొత్త ధరల విధానం కంపెనీ మార్జిన్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని కంపెనీ తెలిపింది. ప్రస్తుత నెలలో రూ.9200 కోట్ల విలువైన ఏడు ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు ఆర్డర్లు దక్కించుకోన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సానుకూలాంశాల నేపథ్యంలో ఇంట్రాడేలో బీఈఎల్‌ షేరుకు కొనుగోళ్ల మద్దతు పెరగడంతో షేరు 12శాతానికి పైగా లాభపడి రూ.85.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గతముగింపు ధర(రూ.76.05)తో  వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.74.30 రూ.192.95లుగా నమోదయ్యాయి.



You may be interested

ఇండియా మార్కెట్ల డీరేటింగ్‌!

Wednesday 26th September 2018

యూబీఎస్‌ అంచనా అంతర్జాతీయ మార్కెట్లు బలంగా ఉన్నా దేశీయ మార్కెట్లలో భారీ పతనం సంభవిస్తోంది. సూచీల్లో అస్థిరతకు ఈ పతనం సంకేతమని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ యూబీఎస్‌ అభిప్రాయపడుతోంది. ఈ పతనానికి తాత్కాలిక లిక్విడిటీ ఇబ్బందులు కారణమా? లేక కొత్తగా బయటపడిన క్రెడిట్‌ సంక్షోభం తాలుకా స్పందనా? అనేది తెలియాల్సిఉందని పేర్కొంది. సూచీల్లో అధిక వాల్యూషన్లకు నెగిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ తోడవడం ఆందోళనకరమని తెలిపింది. అందువల్ల ఇప్పటికైతే తగ్గినప్పుడు కొను సూత్రాన్ని పాటించలేమని

ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ సమస్య: కేం‍ద్రం జోక్యం ఎందుకు?

Wednesday 26th September 2018

ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ సమస్యలోకి కేంద్రం పరోక్షంగా జోక్యం చేసుకుంది. మంగళవారం నాటి ఎల్‌ఐసీ ప్రకటనను గమనిస్తే ఇది అర్థమౌతుంది. ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంబంధిత రంగంలో పరిస్థితులు మరింత అధ్వానంగా మారకుండా ఉండేందుకు కేంద్ర జోక్యం చాలా అవసరమని ఎఫ్‌ఐడీసీ చైర్మన్‌ రామన్‌ అగర్వాల్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.  ఐఎల్‌&ఎఫ్‌ఎస్‌ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న విషయం నిజమేనని, అయితే దీన్ని సాకుగా పేర్కొంటూ

Most from this category