STOCKS

News


ఈ మూడు రంగాలు ఆకర్షణీయం

Friday 24th August 2018
Markets_main1535102505.png-19603

బీఓఐ ఏఎక్స్ఏ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌
రాబోయే ఎన్నికల సీజన్‌ కారణంగా ఏడాది వరకు మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయని బీఓఐ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రతినిధి అలోక్‌ సింగ్‌ చెప్పారు. అనిశ్చిత వాతావరణాన్ని కంపెనీల ఎర్నింగ్స్‌ పెరగడం సమతూకం చేస్తుందన్నారు. ఈ సమయంలో ప్రైవేట్‌ ఫైనాన్షియల్స్‌, ఇండస్ట్రియల్స్‌, కన్జమ్షన్‌ రంగాలను ఎంచుకోవాలని సూచించారు. అకౌంట్లు, లోన్ల పరంగా ప్రైవేట్‌ బ్యాంకులు ఇటీవల కాలంలో తమ వాటా పెంచుకుంటూవస్తున్నాయన్నారు. ఇదే ధోరణి మునుముందు కూడా కొనసాగుతుందని, పీఎస్‌బీలు ఎన్‌పీఏలతో సతమతం కావడం, ప్రైవేట్‌ బ్యాంకులు ముందుకు దూసుకుపోవడం చూడవచ్చని చెప్పారు. రిటైల్‌పై ఫోకస్‌ పెట్టిన ప్రైవేట్‌ బ్యాంకుల ఎర్నింగ్స్‌లో మరింత వృద్ధి ఉంటుందని అంచనా వేశారు. ఎన్‌బీఎఫ్‌సీలను సైతం పరిశీలించవచ్చని సూచించారు. అంతర్జాతీయ ట్రేడ్‌ వార్‌ కారణంగా దేశీయ ఇండస్ట్రియల్‌ కంపెనీలకు కలిసివస్తుందని అభిప్రాయపడ్డారు. మెటల్స్‌, కెమికల్స్‌, ఆగ్రోకెమికల్స్‌ రంగాల్లో చైనాపై షరతుల కారణంగా దేశీయ కంపెనీలు విస్తరించేందుకు పలు కొత్త అవకాశాలు వస్తాయని చెప్పారు. వినిమయ రంగం ఎవర్‌గ్రీన్‌ అన్నారు. మధ్యతరగతిలో వినిమయం పెరగడం, కంపెనీలు తమ వ్యాపారాలను మరింత విస్తరించడంతో ఈ రంగానికి వృద్ధి అవకాశాలు పెరిగాయన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో మరింత డిమాండ్‌ చూడవచ్చని చెప్పారు.

క్యు1లో కంపెనీలు మంచి ప్రదర్శన చూపాయని అలోక్‌ చెప్పారు. వాల్యూంలు, మార్జిన్ల పరంగా మంచి వృద్ది నమోదయిందన్నారు. సూచీల్లో లార్జ్‌క్యాప్స్‌ మంచి ప్రదర్శన చూపుతుండగా, మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ పేలవంగా ఉంటున్నాయని చెప్పారు. సూచీల పీఈ అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, విస్తృతమార్కెట్‌ వాల్యూషన్స్‌ సమర్ధనీయంగానే ఉన్నాయని చెప్పారు. ఇప్పటికిప్పుడు మార్కెట్లో పెద్ద కరెక‌్షన్‌ వస్తుందని భావించడంలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో కంపెనీలు ఇదే తరహా ప్రదర్శన చూపి, దేశీయ, విదేశీయ పరిస్థితులు అనుకూలంగా మారితే మార్కెట్లో మరో ర్యాలీ ఆరంభం అవుతుందని అంచనా వేశారు. 



You may be interested

ఫెడరల్‌ బ్యాంక్‌పై తటస్థం

Friday 24th August 2018

బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా ఫెడరల్‌ బ్యాంక్‌పై తటస్థ వైఖరిని వ్యక్తపరిచింది. ఎందుకో ఒకసారి చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: ఫెడరల్‌ బ్యాంక్‌ రేటింగ్‌: తటస్థం ప్రస్తుత ధర: రూ.81 టార్గెట్‌ ధర: రూ.103 ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌పై తటస్థంగా ఉంది. టార్గెట్‌ ధరను రూ.103గా కొనసాగించింది. కేరళ వరదలు బ్యాంక్‌ పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంచనా వేసింది. బ్యాంక్‌కు కేరళలో ఉన్న బ్రాంచ్‌ల

హిందుస్తాన్‌ జింక్‌ కొనొచ్చు: కోటక్‌

Friday 24th August 2018

బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా హిందుస్తాన్‌ జింక్‌ షేరు కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో ఒకసారి గమనిస్తే.. బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌ స్టాక్‌: హిందుస్తాన్‌ జింక్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.292 టార్గెట్‌ ప్రైస్‌: రూ.300 బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌.. హిందుస్తాన్‌ జింక్‌ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.300గా నిర్ణయించింది. అంతర్జాతీయంగా తక్కువ వ్యయంతో అధిక ఉత్పత్తిని సాధించే పలు కంపెనీల్లో హిందుస్తాన్‌ జింక్‌

Most from this category