STOCKS

News


ఐటీ, ఫార్మాలు మెరుగు...టెలికాం, ఎన్‌బీఎఫ్‌సీలతో జాగ్రత్త

Friday 19th October 2018
Markets_main1539938963.png-21291

ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ ఎక్కువగా ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ రంగ స్టాక్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఈ రంగాలకు చెందిన కంపెనీలు మంచి ఎర్నింగ్స్‌ను ప్రకటించొచ్చని, వీటి ప్రాఫిట్‌ మార్జిన్లు మెరుగుపడొచ్చని అంచనా వేస్తోంది. అలాగే టెలికం, మెటల్స్‌, మైనింగ్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, కన్‌స్ట్రక‌్షన్‌, ఎన్‌బీఎఫ్‌సీ రంగాలకు చెందిన స్టాక్స్‌తో జాగ్రత్తగా ఉండాలని ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ శరవణ కుమార్‌ హెచ్చరించారు. చాలా ప్రతికూలతలు ఉన్నప్పటికీ టూవీలర్‌ కంపెనీల వల్ల ఆటో రంగ ఎర్నింగ్స్‌ పెరగొచ్చని అంచనా వేశారు. రూపాయి పతనం ఐటీ రంగ వృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. అమెరికా జనరిక్‌ మార్కెట్‌లో ధరల తగ్గుదల సమస్య కొలిక్కి వచ్చిందనే అంశాన్ని ఫార్మా ఎర్నింగ్స్‌ తెలియజేస్తాయని పేర్కొన్నారు. అధిక కార్పొరేట్‌ రుణాలను కలిగిన బ్యాంకులు కొత్త మొండి బకాయిలను ప్రకటించొచ్చని అంచనా వేశారు. ధరల పెరుగుదల వల్ల కాకుండా విక్రయాల జోరు వల్ల సిమెంట్‌ రంగంలో వృద్ధి నమోదు కావొచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంత డిమాండ్‌లో రికవరీ వల్ల ఎఫ్‌ఎంసీజీ రంగం ప్రయోజనం పొందుతుందని పేర్కొన్నారు. అయితే వర్షపాతం సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉండటం ఆందోళనకరమైన అంశమని తెలిపారు. 
అమెరికా ఈక్విటీ మార్కెట్లు పతనం కావడం, అక్కడ బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం వంటి అంశాలు వర్ధమాన మార్కెట్లకు ప్రతికూలమని శరవణ కుమార్‌ పేర్కొన్నారు. అధిక వ్యాల్యుయేషన్ల వల్ల అమెరికా టెక్నాలజీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొందని తెలిపారు. రూపాయి 2019 మార్చి 31 నాటికి అమెరికా డాలర్‌తో పోలిస్తే 78 స్థాయికి పడిపోవచ్చనే అంచనాలున్నాయని పేర్కొన్నారు. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌, ఎన్‌బీఎఫ్‌సీల్లో అసెట్‌ లయబిలిటీ వ్యత్యాసాలు, ఎన్నికలు వంటి అంశాల వల్ల ఇటీవల కాలంలో మార్కెట్లు కరెక‌్షన్‌కు గురయ్యాయని వివరించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ విషయంలోకి ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం మళ్లీ వచ్చిందని తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ సంక్షోభం వల్ల ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనలను కఠినతరం చేస్తామని ఆర్‌బీఐ ప్రకటించిందని గుర్తుచేశారు. అలాగే స్వల్పకాలిక ఫండింగ్‌పై ఎక్కువగా ఆధరపడకూడదని ఎన్‌బీఎఫ్‌సీలను సూచించిందన్నారు. వీటి వల్ల ఎన్‌బీఎఫ్‌సీల వృద్ధి రేటు గతంలో మాదిరి కాకుండా తగ్గొచ్చని అంచనా వేశారు. 
రిటైల్‌ ఇన్వెస్టర్లు ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని శరవణ కుమార్‌ సూచించారు. ఒడిదుడుకులు ఉన్నప్పుడు లార్జ్‌ క్యాప్‌ ఎంఎఫ్‌ ఈక్విటీ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని తెలిపారు. బేర్‌ మార్కెట్‌లో లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌.. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ల కన్నా మంచి పనితీరు కనబరుస్తుందని పేర్కొన్నారు. కాగా ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ సగటున రూ.20,426 కోట్ల అసెట్స్‌ను నిర్వహిస్తోంది. దేశంలో 18వ అతిపెద్ద ఫండ్‌ సం‍స్థ ఇది.


IT

You may be interested

రెండేళ్లు వేచిచూడగలరా!

Friday 19th October 2018

నాలుగు సిఫార్సులు చేస్తున్న ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ దీర్ఘకాలిక దృక్పధంతో కనీసం రెండేళ్లు వేచిచూసే ఓపిక ఉన్న ఇన్వెస్టర్ల కోసం ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ నాలుగు మేలైన షేర్లను సిఫార్సు చేస్తోంది.. 1. అశోక్‌ లేలాండ్‌: ఇటీవల కాలంలో నెగిటివ్‌ వార్తలతో షేరు భారీ పతనాన్ని చూసింది. ప్రస్తుత స్థాయిల వద్ద ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 2020 నుంచి బీఎస్‌6 ప్రమాణాల అమలు కంపెనీకి కలిసిరానుంది. అధిక టన్నేజ్‌ ట్రక్కులకు డిమాండ్‌ పెరగడం, కంపెనీకి డిఫెన్స్‌ రంగ

ఏడాది కోసం ఐదు సిఫార్సులు

Friday 19th October 2018

వచ్చే 12- 15 నెలల కాలంలో మంచి రాబడినందించే ఐదు స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి. 1. గ్రాఫైట్‌ ఇండియా: ఈ ఏడాది కంపెనీ ఎర్నింగ్స్‌ రికార్డు స్థాయికి చేరతాయని అంచనా. మూడేళ్లు వరుసగా నష్టాలు నమోదు చేసిన సంస్థ ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చూపుతోంది. దీనికితోడు అత్యంత చౌక వాల్యూషన్ల వద్ద ట్రేడవుతోంది. గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌ వినియోగంలో అప్‌ట్రెండ్‌ ఆరంభం కావడం కంపెనీకి కలిసివచ్చే అంశం.

Most from this category