STOCKS

News


వాల్యూ స్టాకులనే నమ్ముకోండి!

Friday 10th August 2018
Markets_main1533898559.png-19147

పొరింజు సూచన
మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ మూడు నాలుగేళ్లు నిర్విరామంగా ర్యాలీ జరిపాయని, దీంతో వాటి వాల్యూషన్లు చాలా ఎక్కువగా పెరిగాయని, అందుకే ఈ ఏడాది ఇవన్నీ పతనం చవిచూశాయని ప్రముఖ ఇన్వెస్టర్‌ పొరింజు వెలియత్‌ చెప్పారు. చిన్న స్టాకులు సత్తా చూపినన్ని సంవత్సరాలు బ్లూచిప్స్‌ పెద్దగా పరుగు తీయలేదని, ఇప్పుడిప్పుడే ఇవి అప్‌మూవ్‌లోకి పయనిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం చిన్న, మిడ్‌క్యాప్‌ స్టాకుల వాల్యూషన్లు దిగివచ్చాయన్నారు. ఈ సమయంలో వాల్యూస్టాకులను ఎంచుకొని పెట్టుబడులు పెట్టాలన్నారు. ప్రస్తుతం మిడ్‌క్యాప్స్‌కు నిర్వచనం మారిందని, కొత్త నిర్వచనం కింద పలు నాణ్యమైన కంపెనీలు వచ్చాయని చెప్పారు. నాణ్యమైన స్టాకులు ఇప్పటికీ అధిక పీఈల వద్ద ఉన్నాయని కొందరు చెబుతారని, అలాంటివి కొనవద్దని సూచిస్తారని చెప్పారు. కానీ అవన్నీ పట్టించుకోవద్దని, గత కరెక‌్షన్‌తో కొత్త సైకిల్‌ ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు. ప్రతి చక్రీయ వలయం ఆరంభాన్ని కొనుగోళ్లకు అవకాశంగా మలుచుకోవాలన్నారు. గతంలో పరుగులు తీయక తాజాగా పరుగులు మొదలెట్టినకంపెనీల షేర్లు ఇదే ధోరణి కొనసాగిస్తారని చెప్పలేమన్నారు. పలు పెద్ద కంపెనీలు ప్రస్తుతం అధిక వాల్యూషన్ల వద్ద ఉన్నాయని, వీటిని ఎంచుకునే బదులు నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం అని చెప్పారు. 
దేశీయ మార్కెట్‌పై బుల్లిష్‌
చిన్నా చితకా అవాంతరాలున్నా, దేశీయ మార్కెట్లు ముందుకే కొనసాగుతాయని పొరింజు అంచనా వేశారు. అయితే సూచీలు బలంగా ఉంటాయని చెప్పి పసలేని స్టాకులను కొంటే ప్రయోజనం ఉండదన్నారు. మంచి వ్యాపార నమూనా, విలువైన మేనేజ్‌మెంట్‌, మెరుగైన ఫలితాలు చూసి మాత్రమే కంపెనీలను ఎంచుకోవాలన్నారు. దేశీయ ఎకానమీలో నిర్మాణాత్మక మార్పులు వస్తున్నాయని చెప్పారు. తాజా మార్పులన్నీ దీర్ఘకాలికంగా పలు ప్రయోజనాలు చేకూరుస్తాయన్నారు. లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్‌ చేసుకోవాల్సిన సమయం ఇదేనన్నారు. చిన్న కంపెనీల్లో కొన్ని కంపెనీల ప్రమోటర్లు బడా కంపెనీల ప్రమోటర్లలాగా ప్రొఫెషనల్స్‌ కాకపోవచ్చని, కానీ తమ కంపెనీని ఎలా ముందుకు తీసుకుపోవాలో స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్లని చెప్పారు. అలాంటి కంపెనీలను వెతికి పట్టుకోవాలని సూచించారు. అలాగని లార్జ్‌ క్యాప్స్‌పై పెట్టుబడులు పెట్టవద్దని తాను చెప్పడం లేదని, వీటిలో కన్నా నాణ్యమైన మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌పై పెట్టుబడి ఎక్కువ రాబడినిస్తుందన్నారు. ఇలాంటి స్టాకుల్లో పెట్టుబడులకు ఇదే మంచి అవకాశమని చెప్పారు. You may be interested

హెచ్‌పీసీఎల్‌ ఆకర్షణీయం..

Friday 10th August 2018

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రికమండేషన్‌ టార్గెట్‌ ధర- రూ. 463. సిఫార్సు- కొనొచ్చు. గత ఆగస్టులో టాప్‌ అవుట్‌ అయిన తర్వాత ఈ షేరు దాదాపు 42 శాత పతనమైంది. ప్రస్తుతం స్టాకు ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ట్రేడవుతోంది. చమురు ధరల ఒడిదుడుకులు షేరుపై ప్రభావం చూపుతున్నాయి. మార్జిన్లు తక్కువగా ఉన్నా త్వరలో పుంజుకుంటాయని అంచనా. ప్రపంచ ఇంధన డిమాండ్‌ రాబోయే కాలంలో పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ఇదే నిజమైతే కంపెనీకి ప్రయోజనం ఉంటంది. తాజా

భూషణ్‌ స్టీల్‌ మాజీ ప్రమోటర్‌ సింఘాల్‌ అరెస్ట్‌

Friday 10th August 2018

న్యూఢిల్లీ: భూషణ్‌ స్టీల్‌ మాజీ ప్రమోటర్‌ నీరజ్‌ సింఘాల్‌ను ఎస్‌ఎఫ్‌ఐఓ (సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌) అరెస్ట్‌ చేసింది. రూ.2,000 కోట్లకుపైగా నిధులు స్వాహా చేసిన కేసులో ఆయన నిందితుడు. సంస్థ నిధుల అవకతవకలకు సంబంధించి ఎస్‌ఎఫ్‌ఐఓ అరెస్ట్‌ చేసిన మొట్టమొదటి వ్యక్తి సింఘాల్‌ అని ఉన్నతాధికారులు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ వరకూ ఆయనను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారు. భూషణ్‌ స్టీల్‌కు అనుబంధంగా ఉన్న వివిధ కంపెనీల్లో వినియోగానికి

Most from this category