STOCKS

News


స్వల్పకాలానికి 5 స్మాల్‌క్యాప్‌ సిఫార్సులు

Wednesday 5th December 2018
Markets_main1543998440.png-22664

ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, బ్రెగ్జిట్‌పై యూకే పార్లమెంట్‌ ఓటింగ్‌, ఫెడ్‌ సమావేశం, ఒపెక్‌ మీటింగ్‌ వంటి అనేక మార్కెట్‌ ప్రభావిత అంశాలు వరుసగా ఉన్నందున ఫార్మా రంగం షేర్లు ఒడిదుడుకులకు లోనుకావచ్చని మోనార్క్‌ నెట్‌వర్క్‌ క్యాపిటల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అర్పన్‌ షా అన్నారు. అయితే, సిప్లా, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ప్రస్తుతం పెట్టుబడులకు సూచింపదగిన షేర్లుగా ఉన్నట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వాల్యూయేషన్స్‌ సమంజసంగా ఉన్నటువంటి నాణ్యమైన ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలలో ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, బజాజ్ ఫైనాన్స్‌ ఉన్నాయన్నారు. ఇక నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ నవంబర్‌ సిరీస్‌లో నిఫ్టీని అవుట్‌పెర్ఫార్మ్‌ చేసినప్పటికీ డిసెంబర్‌లో మాత్రం 6,150-6,350 పాయింట్ల శ్రేణిలో కన్సాలిడేషన్‌ జరగవచ్చని అన్నారు. ఈ స్థాయి నుంచి బ్రేకవుట్‌ సాధిస్తే 6,700-7,000 పాయింట్ల వరకు వెళ్లేందుకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో స్వల్పకాలంలో 7-14 శాతం వరకు రాబడిని ఇవ్వగలిగిన 5 షేర్లను సిఫార్సుచేశారు. వీటిలో నాలుగు బై సిఫార్సులు ఉండగా.. ఒక సెల్‌ సిఫార్సు ఉంది. అవేంటంటే..

ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్ | ప్రస్తుత ధర: రూ.1,120 | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.1,215 | స్టాప్ లాస్‌: రూ.1,080 | రాబడి అంచనా: 8.2 శాతం
గతవారంలో లార్జ్‌క్యాప్‌ ఐటీలో షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీ నమోదైనప్పటికీ మిడ్‌క్యాప్‌లో మాత్రం జరగలేదు. ఇక ఈ షేరు రూ.1,040 స్థాయిలో డబుల్‌ బోటమ్‌ను నమోదుచేసి అక్కడ నుంచి బౌన్స్‌ అయ్యింది. ప్రస్తుతం 200-ఎస్‌ఎంఏ ఎగువన ట్రేడవుతుండడం సానుకూల అంశంగా ఉంది. ఎంఏసీడీ సైతం పాజిటీవ్‌ క్రాసోవర్‌ను ఇచ్చిందని విశ్లేషించారు.

ఎన్‌డ్యూరెన్స్‌ టెక్నాలజీస్ | ప్రస్తుత ధర: రూ. 1,120 | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.1,260 | స్టాప్ లాస్‌: రూ.1,060 | రాబడి అంచనా: 12.5 శాతం
క్రితం మద్దతు స్థాయి వద్ద  డబుల్‌ బోటమ్‌ను నమోదుచేసింది. ఈస్థాయి పొలారిటీ లైన్‌ మార్పుతో విలీనమవుతోంది. అప్‌మూవ్‌ కొనసాగితే రూ.1,260 వరకు వెళుతుందన్నారు.

రిలయన్స్ క్యాపిటల్ | ప్రస్తుత ధర: రూ.232 | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.260 | స్టాప్ లాస్‌: రూ.215 | రాబడి అంచనా: 12 శాతం
రూ.220 స్థాయి నుంచి అనేక మార్లు బౌన్స్‌ బ్యాక్‌ అయ్యింది. వచ్చే కొద్ది రోజుల్లోనే 50-రోజుల సగటుకదలికలకు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషించారు.

పేజ్‌ ఇండస్ట్రీస్ | ప్రస్తుత ధర: రూ.25,840 | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.28,500 | స్టాప్ లాస్‌: రూ.24,700 | రాబడి అంచనా: 14 శాతం
మల్టీవీక్‌ సపోర్ట్‌ స్థాయికి పడిపోయిన ఈ షేరుకు ఇంత క్రితం ఇదే స్థాయి ప్రధాన నిరోధంగా ఉంది. ఇక్కడ మద్దతు తీసుకుని  రూ.28,500 వరకు వెళ్లేందుకు అవకాశం ఉంది.

పిడిలైట్ ఇండస్ట్రీస్ | ప్రస్తుత ధర: రూ.1,162 | రేటింగ్: సెల్‌ | టార్గెట్ ధర: రూ.1,085 | స్టాప్ లాస్‌: రూ.1,200 | రాబడి అంచనా: 6.8 శాతం
ఇంతకుముందు రూ.1180 వద్ద రెండు సార్లు నిరోధాన్ని ఎదుర్కొంది. తాజాగా మళ్లీ ఇక్కడ నుంచి పడిపోయింది. వీక్లీ చార్టులో ఆర్‌ఎస్‌ఐ బలమైన ప్రతికూలతను సూచిస్తోంది. రూ.1200 స్థాయిని అధిగమించలేకపోతే రూ.1100 వరకు పడిపోయే అవకాశం ఉంది.

ఇవి కేవలం అనలిస్టుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌..!

Wednesday 5th December 2018

కీలక వడ్డీరేట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం కోసం మార్కెట్‌ వర్గాల నిరీక్షణ నేపథ్యంలో పలు బ్యాంకు షేర్లు నష్టాల బాట పట్టాయి. ఫలితంగా బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ నేటి ట్రేడింగ్‌లో 1శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(26,693.80)తో పోలిస్తే అరశాతం నష్టంతో 26,557.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన

ఒప్పొ ట్రిపుల్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్‌.. ధరెంతో తెలుసా?

Wednesday 5th December 2018

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘ఒప్పొ’ తాజాగా మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘ఆర్‌17 ప్రో’ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కంపెనీ నుంచి ఆర్‌ సిరీస్‌లో వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే. ఇందులో 6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఫ్లస్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ లెవెల్‌ 6 ప్రొటెక‌్షన్‌, వాటర్‌డ్రాప్‌ నాచ్‌, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌, 128 జీబీ మెమరీ, 8 జీబీ

Most from this category