STOCKS

News


షేర్‌ఖాన్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Thursday 14th March 2019
Markets_main1552547501.png-24604

ఎన్నికల ముందు వచ్చే ర్యాలీలో మంచి సత్తా చూపే నాలుగు మిడ్‌క్యాప్స్‌ను షేర్‌ఖాన్‌ సిఫార్సు చేస్తోంది. అందరూ ఊహించినట్లు ఎఫ్‌ఎంసీజీ స్టాకులో లేదా బాటా, టైటాన్‌ లాంటి కన్జూమర్‌ స్టాకులో కాకుండా ప్రీఎలక‌్షన్‌ ర్యాలీలో కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించింది. 
1. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌: షేరులో కొంత బలహీనత కనిపిస్తున్నా, త్వరలో కోలుకొని దూసుకుపోగలదు. 
2. అతుల్‌: మిడ్‌క్యాప్‌ నుంచి లార్జ్‌క్యాప్‌గా మారనుంది. రెండేళ్ల తర్వాత షేరులో మంచి కదలికలు కనిపిస్తున్నాయి. 
3, 4: కల్పతరు పవర్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌: ఇన్‌ఫ్రా రంగంలో ఈ రెండు షేర్లు హైబీటాతో ఉన్నాయి. ఎన్నికలముందు ప్రభుత్వాలు ప్రకటించే పలు కార్యక్రమాలు ఈ కంపెనీలకు పాజిటివ్‌గా మారతాయి.
ఈ నాలుగింటితో పాటు ఎన్నికలతో సంబంధం లేకుండా ఇండియన్‌ హోటల్స్‌ షేరు లాంగ్‌టర్మ్‌కు పరిశీలించవచ్చని షేర్‌ఖాన్‌ పేర్కొంది. కంపెనీ మౌలిక ప్రదర్శన బాగుందని, గత ఫలితాలు అంచనాలకు తగ్గట్లే ఉన్నాయని వివరించింది. 

 



You may be interested

రాణిస్తున్న రియల్టీ షేర్లు

Thursday 14th March 2019

లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న మార్కెట్‌లో రియల్టీ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో 2.50శాతం ర్యాలీ చేసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండియాబుల్‌ రియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌ షేర్లు అత్యధికంగా 7.50శాతం లాభపడింది. అలాగే డీఎల్‌ఎఫ్‌ షేరు 5శాతం, ఫోనిక్స్‌ లిమిటెడ్‌ 3శాతం, ప్రెస్టేజ్‌ ఎస్టేజ్‌ షేరు 2శాతం లాభపడ్డాయి. సన్‌ టెక్‌, ఓబెరాయ్‌ లిమిటెడ్‌ షేర్లు 1శాతం వరకు

ఈకామర్స్ సంస్థలకూ అసోసియేషన్‌

Thursday 14th March 2019

న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్ సంస్థలు తాజాగా ది ఈ-కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (టీఈసీఐ) ఏర్పాటు చేసుకున్నాయి. స్నాప్‌డీల్‌, షాప్‌క్లూస్‌, అర్బన్‌క్లాప్ తదితర సంస్థలు కలిసి దీన్ని నెలకొల్పాయి. అంతర్జాతీయ సంస్థలకు దీటుగా దేశీ సంస్థలు కూడా రాణించేందుకు, దేశీ ఈ-కామర్స్ రంగం వృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి తోడ్పడే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లు స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బెహల్ తెలిపారు. డేటా ప్రైవసీ, లాజిస్టిక్స్‌, పేమెంట్స్

Most from this category