STOCKS

News


నెలరోజుల కోసం టాప్‌ సిఫార్సులు

Thursday 8th November 2018
Markets_main1541669837.png-21793

ముంబై: ఈవారంలో నిఫ్టీ ఇప్పటివరకు అధిక శాతం రేంజ్‌బౌండ్‌లోనే కొనసాగింది. 10,440 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉండగా.. ఈ స్థాయిని కోల్పోతే 10340, ఆ తరువాత 10260 అత్యంత కీలక స్థాయిలుగా ఉన్నాయని సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ ఆశిష్‌ చతుర్‌మెహతా విశ్లేషించారు. 10,600 స్థాయిని అధిగమించి, ఆ స్థాయి ఎగువన నిలబడగలిగినప్పుడే 10,750-10,850 రేంజ్‌కు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు. నిఫ్టీ ఆప్షన్స్‌ విభాగంలో అత్యధిక పుట్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ (ఓఐ) 10,000 వద్ద.. ఆ తరువాత 10,200 వద్ద ఉన్నట్లు తెలిపారు. అత్యధిక కాల్స్‌ ఓఐ 107800 వద్ద ఉండగా.. ఆ తరువాత స్ట్రైక్స్‌ 11000 వద్ద ఉన్నట్లు వివరించారు. 10,500 వద్ద కొన్ని పుట్‌ రైటింగ్స్‌ ఉండగా.. అత్యధిక కాల్‌ రైటింగ్స్‌ 11000 వద్ద ఉన్నట్లు తెలియజేశారు. ఇక వచ్చే నెల రోజుల్లో 10-15 శాతం వరకు రాబడి ఇవ్వగలిగే సత్తా ఉన్న 5 షేర్లను సూచించారయన. వీటిలో 3 షేర్లను కొనుగోలుచేయవచ్చని, 2 షేర్లను అమ్మివేయవచ్చని విశ్లేషించారు. అవేంటంటే..

పీవీఆర్‌ | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర రూ.1,422 | స్టాప్ లాస్‌: రూ.1,350 | టార్గెట్ రూ.1,630 | రాబడి అంచనా 14 శాతం
రూ.1,655 వద్ద మేలో గరిష్టస్థాయిని తాకిన ఈ షేరు ఆ తరువాత దిద్దుబాటుకు లోనైంది. అయితే, వీక్లీ చార్టుల పరంగా గతనెలలోనే డబుల్‌ బోటమ్‌ను నమోదుచేసి బ్రేకవుట్‌ లెవిల్స్‌ వద్ద కొనసాగుతోంది. డైలీ చార్టులో 200-రోజుల సగటు కదలికల స్థాయి కనిష్ట బోటమ్‌ను అధిగమించింది. బోలింగర్ బ్యాండ్‌ అప్పర్‌ స్థాయిని అధిగమించడం ద్వారా ట్రెండ్‌ కొనసాగుతుందనే సంకేతం ఇచ్చింది.

యాక్సిస్ బ్యాంక్ | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర: రూ. 607.10 | స్టాప్ లాస్‌: రూ. 600 | టార్గెట్: రూ. 700 | రాబడి అంచనా 15శాతం
దాదాపు మూడేళ్ల పాటు రూ.350-650 స్థాయిలో కొనసాగిన ఈ షేరు.. వీక్లీ చార్టులో సిమ్మెట్రికల్‌ ట్రయాంగిల్‌ పాట్రన్‌ను రూపొందించింది. గతవారంలో దిగువస్థాయిల వద్ద రివర్సల్‌ నమోదుచేసింది. 200-రోజుల సగటు కదలికల స్థాయి వద్ద సపోర్ట్‌ తీసుకుని.. షార్ప్‌ బౌన్స్‌ బ్యాక్‌తో పాట్రన్‌ ముగిసినట్లు సంకేతం ఇచ్చింది. డైలీ చార్టులో ఎంఏసీడీ లైన్‌ సున్నా వద్ద నుంచి ఈక్వెలిబ్రెయం (సమతుల్య స్థాయి) ఎగువకు చేరింది. 

పిడిలైట్ ఇండస్ట్రీస్ | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర: Rs 1,010 | స్టాప్ లాస్‌: రూ. 990 | టార్గెట్: రూ .1,150 | రాబడి అంచనా 14శాతం
డైలీ చార్టులో స్వల్పకాలిక డబుల్‌ బోటమ్‌ను నమోదుచేసింది. అత్యధిక వాల్యూమ్స్‌తో లాంగ్‌ బుల్‌ క్యాండిల్‌ను ఏర్పాటుచేసింది. ఇంతకుముందు మద్దతు స్థాయి శ్రేణి రూ.1030-1020.. ఇప్పుడు బలమైన నిరోధంగా ఉంది.

ఈక్విటాస్‌ హోల్డింగ్స్ | సిఫార్సు:సెల్ | ప్రస్తుత ధర: రూ. 106 | స్టాప్ లాస్‌: రూ. 112 | టార్గెట్: రూ. 95 | రాబడి అంచనా 10శాతం
డైలీ చార్టు పరంగా లోయర్‌ టాప్స్‌, లోయర్‌ బోటమ్స్‌ను నమోదుచేసిన ఈ షేరు తిరోగమనంలో ఉన్నట్లు సంకేతం ఇచ్చింది. అక్టోబరు 26న గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమై ఆ తరువాత ఈ గ్యాప్‌ను పూరించింది. రూ.121 నుంచి 115కు పతనమై మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అయ్యింది. అయితే, మళ్లీ రివర్సల్‌ను సూచిస్తూ డౌన్‌ ట్రెండ్‌లో ఉన్నట్లు ఆశిష్‌ చతుర్‌మెహతా వెల్లడించారు.

అపోలో టైర్స్ | సిఫార్సు: సెల్ | ప్రస్తుత ధర: రూ. 220 | స్టాప్ లాస్‌: రూ. 225 | టార్గెట్: రూ. 192 | రాబడి అంచనా 13శాతం
రూ.230 దగ్గర ఉన్నటువంటి కీలక మద్దతు స్థాయి నుంచి బ్రేక్‌ డౌన్‌ అయ్యింది. ఈ ఏడాది సెప్టెంబరులో రూ.192 వద్ద కనిష్టస్థాయిని నమోదుచేసిన ఈ షేరుకు రూ.230 ప్రధాన నిరోధంగా మారింది. 50-రోజుల సగటు కదలికల వద్ద షూటింగ్ స్టార్ క్యాండిల్‌ స్టిక్‌ పాట్రన్‌ను ఏర్పాటుచేసింది.

ఇవి కేవలం టెక్నికల్‌ అనలిస్ట్‌ ఆశిష్‌ చతుర్‌మెహతా అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.


 You may be interested

ఓఎన్‌జీసీకి హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌

Thursday 8th November 2018

ముంబై:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వ రంగ సం‍స్థ ఆయిల్‌ అండ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) షేరుకు ప్రముఖ రేటింగ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. చమురు, సహజ వాయువు ఉత్పత్తి రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఓఎన్‌జీసీ కంపెనీ షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషణలు ఇలా ఉన్నాయి... రంగం:- చమురు ఉత్పత్తి, శుద్ధి రేటింగ్‌:- కొనవచ్చు టార్గెట్‌ ధర:-  రూ.182 క్యూ2 ఫలితాలు:- అంతర్జాతీయంగా చమురు

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌పై సెంట్రమ్‌ పాజిటివ్‌

Thursday 8th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ వెల్త్‌ రీసెర్చ్‌ తాజాగా ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ స్టాక్‌పై పాజిటివ్‌గా ఉంది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ స్టాక్‌: ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ రేటింగ్‌: ఔట్‌ఫర్ఫార్మర్‌ ప్రస్తుత ధర: రూ.136 టార్గెట్‌ ప్రైస్‌: రూ.175 అప్‌సైడ్‌ అంచనా: 30 శాతం సెంట్రమ్‌.. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఔట్‌పర్ఫార్మర్‌ రేటింగ్‌ ఇచ్చింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.175గా నిర్ణయించింది. అంటే ప్రస్తుత ధరతో

Most from this category