STOCKS

News


4 ఎన్‌బీఎఫ్‌సీలకు మోర్గన్‌ స్టాన్లీ బై రేటింగ్‌

Wednesday 21st November 2018
Markets_main1542796276.png-22270

ముంబై: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) సంక్షోభం అనంతరం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) రంగం గడిచిన రెండు నెలలుగా నగదు లభ్యత సమస్యను ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా హోల్‌సేల్‌ ఫండింగ్‌ లెండర్లలో ఈ సమస్య అధికంగా ఉంది. ఈక్విటీ మార్కెట్‌లో ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెఎఫ్‌సీ) షేర్లు ఏకంగా 10-60 శాతం వరకు పడిపోయాయి. ఈ పరిస్థితికి కారణాలను విశ్లేషించిన మోర్గన్‌ స్టాన్లీ.. ప్రధానంగా నాలుగు అంశాలను హైలైట్‌ చేసింది. ఎన్‌బీఎఫ్‌సీ/హెఎఫ్‌సీలు దీర్ఘకాలంలో అధిక వడ్డీ వస్తుందనే అంచనాతో గడిచిన ఆరు నెలల నుంచి కమర్షియల్‌ పేపర్లు వంటి స్వల్పకాలిక మార్గాలలో నిధులను సమీకరించుకున్నాయి. ఇది ఆస్తి అప్పుల మధ్య అంతరాన్ని పెంచింది. అయితే, వీటిలో సబ్‌స్క్రైబర్లుగా అధిక శాతం మ్యుచువల్‌ ఫండ్సే ఉన్నట్లు తెలిపిన మోర్గన్‌ స్టాన్లీ.. ఈ రంగాలకు ఉన్నటువంటి గరిష్టపరిమితి వరకు నిధులను సమకూర్చాయని వెల్లడించింది. రియల్‌ ఎస్టేట్‌ వంటి దీర్ఘకాలిక రంగాలకు రుణాలను మంజూరీ చేయడం వల్ల నగదు లభ్యత తగ్గిపోయిన సమయంలోనే స్వల్పకాలిన చెల్లింపులకు సమయం ఆసన్నమై సమస్య జఠిలమైనట్లు విశ్లేషించింది. ఈ రకంగా సమస్యల చట్రంలో చిక్కుకున్న ఎన్‌బీఎఫ్‌సీ/హెఎఫ్‌సీ సంస్థలన్నింటినీ ఒకే గాటిన కట్టేసి చూడడం కంటే.. బలమైన ఉనికితో ఉన్నటువంటి కంపెనీల షేర్లలో అవకాశాలను చూడడం ద్వారా ఆకర్షణీయ రాబడిని అందుకోవచ్చని ఆర్థిక సేవల సంస్థ సూచించింది. ఈ జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఎంఎఫ్‌ఎస్‌, ఎస్‌టీఎఫ్‌సీ, ఎడిల్‌వీస్‌ కంపెనీలు ఉన్నట్లు పేర్కొంది. ఈ నాలుగు కంపెనీలు కనీసం 20 శాతానికి మించి పెరుగుతాయని, ఈ కంపెనీలకు ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ ఇచ్చినట్లు విశ్లేషించింది. హెచ్‌డీఎఫ్‌సీ టార్గెట్‌ ధర రూ.2,290, ఎంఎంఎఫ్‌ఎస్‌ టార్గెట్‌ ధర రూ.545, ఎస్‌టీఎఫ్‌సీ టార్గెట్‌ ధర రూ.1,515, ఎడిల్‌వీస్‌ టార్గెట్‌ ధర రూ.205 వద్ద నిర్ణయించినట్లు తెలిపింది.



You may be interested

రెండో రోజూ నష్టాలే

Wednesday 21st November 2018

సూచీలకు ఐటీ షేర్ల షాక్‌ 10600 స్థాయికి నిఫ్టీ 35200 వద్ద సెన్సెక్స్‌ ఐటీ షేర్ల పతనంతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఎల్‌ అండ్‌ టీ షేర్ల క్షీణతతో మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 275 పాయింట్లను కొల్పోయి 35200 వద్ద ముగిసింది. నిఫ్టీ 56 పాయింట్ల నష్టపోయి 10600 వద్ద ముగిసింది. డాలర్‌ మారకంలో రూపాయి రెండు నెలల గరిష్టానికి చేరుకోవడంతో ఐటీ

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ లాభం 53% జంప్‌

Wednesday 21st November 2018

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికం (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ లాభం వార్షిక ప్రాతిపదికన 53 శాతం మేర ఎగసింది. రూ.438 కోట్లుగా నమోదయ్యింది. లిక్విడిటీ సంక్షోభం, అధిక కేటాయింపుల నేపథ్యంలోనూ కంపెనీ ఈ స్థాయి లాభాన్ని అర్జించడం గమనార్హం. కాగా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.287 కోట్ల లాభాన్ని ప్రకటించింది. కంపెనీ

Most from this category