News


రెండో రోజూ నష్టాలే

Wednesday 21st November 2018
Markets_main1542796555.png-22271

  • సూచీలకు ఐటీ షేర్ల షాక్‌
  • 10600 స్థాయికి నిఫ్టీ
  • 35200 వద్ద సెన్సెక్స్‌

ఐటీ షేర్ల పతనంతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఎల్‌ అండ్‌ టీ షేర్ల క్షీణతతో మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 275 పాయింట్లను కొల్పోయి 35200 వద్ద ముగిసింది. నిఫ్టీ 56 పాయింట్ల నష్టపోయి 10600 వద్ద ముగిసింది. డాలర్‌ మారకంలో రూపాయి రెండు నెలల గరిష్టానికి చేరుకోవడంతో ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ 35,112 -  35,494 రేంజ్‌లో కదలాడింది. నిఫ్టీ సూచీ 10,562.35 - 10,671.30 స్థాయిలో ట్రేడైంది. ఎన్‌ఎస్‌ఈలో మరో ప్రధాన సూచీ బ్యాంక్‌ నిఫ్టీ 149 పాయింట్లు లాభంతో 26,262 వద్ద ముగిసింది.  అత్యధికంగా ఐటీ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది. అదే మెటల్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ సూచీలు నష్టాలతో ముగిశాయి. ఫార్మ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, రియల్టీ రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ముగిశాయి.
ఇంట్రాడే ట్రేడింగ్‌ కొనసాగిందిలా:-
సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 18 పాయింట్ల లాభంతో 35,492 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 10,670 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే అంతర్జాతీయ బలహీన సంకేతాలతో పాటు ఐటీ, మెటల్‌ రంగాలకు షేర్లలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు క్షణాల్లో నష్టాల్లోకి మళ్లాయి.దీనికి తోడు రూపాయి బలపడంతో అధిక వెయిటేజీ కలిగిన ఐటీ షేర్ల పతనం సూచీలను వెనక్కి లాగాయి. మిడ్‌ సెషన్‌ సమయానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్ల పతనంతో నిఫ్టీ సూచీ 103 పాయింట్లను కోల్పోయి 10,562 కనిష్టానికి చేరుకుంది. సెన్సెక్స్‌ 362 పాయింట్ల నష్టపోయి  35,112.49 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది.  మిడ్‌సెషన్‌ అనంతరం యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చింది. కొన్ని ప్రధాన షేర్లు బై వాల్యూ తక్కువ ధర వద్ద లభిస్తుండంతో ఇన్వెస్టర్లు స్పల్పంగా కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా సూచీలు ఉదయం కోల్పోయి నష్టాలను కొంత మేర పూడ్చుకోగలిగాయి. మార్కెట్‌ ముగింపు సమయానికి సెన్సెక్స్‌ 35,200 వద్ద, నిఫ్టీ 10600 వద్ద స్థిరపడ్డాయి.
హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్లు 2.50శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి. యూపీఎల్‌, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, యస్‌బ్యాంక్‌, గ్రాసీం, డాక్టర్‌రెడ్డీస్‌ 3శాతం నుంచి 6.50శాతం లాభపడ్డాయి.



You may be interested

వచ్చే ఏడాదిలో మార్కెట్‌ ర్యాలీ..!

Wednesday 21st November 2018

2019 చివరినాటికి నిఫ్టీ 11,800 పాయింట్ల వద్దకు చేరుతుందని అంచనావేసిన ఎడిల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ ముంబై: సాధారణ ఎన్నికలు ఆర్థిక వ్యవస్థకు అంతరాయమే తప్పించి వ్యాపార సరళిని, వ్యవస్థను ఆటంకపరిచే అంశం ఏమాత్రం కాదని ఎడిల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టులు అభిప్రాయపడ్డారు. ఆదిత్య నారాయణ్ పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో ఎడిల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ పట్ల పాజిటివ్‌గా ఉన్నట్లు ప్రకటించింది. వచ్చేఏడాది ద్వితియార్థంలో మార్కెట్‌ ర్యాలీ ఉంటుందని అంచనావేసిన ఈ సంస్థ.. 2019 చివరినాటికి నిఫ్టీ 11,800

4 ఎన్‌బీఎఫ్‌సీలకు మోర్గన్‌ స్టాన్లీ బై రేటింగ్‌

Wednesday 21st November 2018

ముంబై: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) సంక్షోభం అనంతరం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) రంగం గడిచిన రెండు నెలలుగా నగదు లభ్యత సమస్యను ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా హోల్‌సేల్‌ ఫండింగ్‌ లెండర్లలో ఈ సమస్య అధికంగా ఉంది. ఈక్విటీ మార్కెట్‌లో ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెఎఫ్‌సీ) షేర్లు ఏకంగా 10-60 శాతం వరకు పడిపోయాయి. ఈ పరిస్థితికి కారణాలను

Most from this category