STOCKS

News


మిశ్రమ ప్రారంభం

Friday 22nd February 2019
Markets_main1550811611.png-24272

ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం మిశ్రమంగా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 8 పాయింట్ల లాభంతో 35,906 వద్ద 7 పాయింట్ల నష్టంతో 10,783 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు, ఇటీవల దేశీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలు మరోసారి తెరపైకి రావడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. ఉదయం గం.9:30మయంలో సెన్సెక్స్ 50 పాయింట్లు నష్టంతో 35846 వద్ద, నిఫ్టీ 10775ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌, మెటల్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. అటో, ఐటీ, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లలో స్వల్పంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. అమెరికా ముడిచమురు ఉత్పత్తిని పెంచడంతో ప్రపంచమార్కెట్లో ముడిచమురు ధర క్రమంగా దిగివస్తుంది. ఫలితంగా నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ 71.13 వద్ద ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. ఇక విదేశీ ఇన్వెస్టర్లు సైతం దేశీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దగా ఆస్తకి చూపడం లేదని గణంకాలు చెబుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్‌లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.55 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను మాత్రమే కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఇన్వెస్టర్లు మాత్రం రూ.202 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఇక ప్రపంచమార్కెట్ల విషయానికొస్తే... నిన్న రాత్రి అమెరికా మార్కెట్ల నష్టాల్లో ముగియగా నేడు ఆసియాలో అత్యధిక మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి.


గెయిల్‌, హిందాల్కో, సిప్లా, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 4శాతం నష్టపోగా, యస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఇండియన్‌బుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, ఐఓసీ షేర్లు 2శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. 



You may be interested

పీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ

Friday 22nd February 2019

- 2018-19 ఆర్థిక సంవత్సరంపై ఈపీఎఫ్‌ఓ నిర్ణయం న్యూఢిల్లీ: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. పీఎఫ్ రేటును పెంచడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. 2015-16లో 8.8 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2016-17లో 8.65 శాతానికి, అటుపై 2017-18లో అయిదేళ్ల కనిష్టమైన 8.55

రాబడుల కంటే పొదుపు ఎంతన్నది ముఖ్యం

Friday 22nd February 2019

చాలా మంది తమ పెట్టుబడులపై అధిక రాబడులు రావాలని కోరుకుంటుంటారు. నిజానికి రాబడుల కంటే మీరు చేసే పెట్టుబడులే కీలకమని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఆర్జన మొదలు పెట్టిన తొలినాళ్లలోనే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత అంతే మొత్తాన్ని కొనసాగించినా (ఆదాయం పెరుగుతుంది కనుక) మెరుగైన రాబడులు అందుకోవడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. కనుక రాబడుల విషయంలో సేవింగ్స్‌ రేటు (పొదుపు రేటు) చాలా కీలకం అవుతుంది.    ఉదాహరణకు...

Most from this category