News


పడ్డవి ఎప్పుడూ చెడ్డవి కావు!?

Sunday 14th April 2019
Markets_main1555265014.png-25119

ఎన్నికల ముందు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారీ కొనుగోళ్లకు దిగిన విషయం స్పష్టంగా చూస్తున్నాం. దీంతో ఫిబ్రవరి 19 తర్వాత కొన్ని స్టాక్స్‌ మంచి రికవరీ నమోదు చేశాయి. కొన్ని స్టాక్స్‌లో అయితే ఎఫ్‌పీఐలు మార్చి త్రైమాసికంలో ఏకంగా 10 శాతం వాటాలను కొనుగోలు చేయడం వారి దాహాన్ని తెలియజేస్తోంది. ఈ స్టాక్స్‌ ఏకంగా 41 శాతం ఇప్పటికే ర్యాలీ జరిపాయి. విదేశీ ఇన్వెస్టర్ల నిధుల రాకతో మరిన్ని స్టాక్స్‌కు మంచి మద్దతు లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019లో భారత మార్కెట్‌ ఇన్వెస్టర్లకు నచ్చిన ప్రదేశంగానే కొనసాగుతుందని అభిప్రాయపడుతున్నారు. స్థూల ఆర్థిక అంశాలకుతోడు కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ పుంజుకోవడం, వడ్డీ రేట్ల తగ్గుదల వంటి సానుకూల అంశాలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా మార్చి త్రైమాసికం కంపెనీల వాటాదారుల వివరాలను గమనిస్తే ఎఫ్‌పీఐలు బాగా పడి ఉన్న రంగాల్లోని స్టాక్స్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఎన్‌బీఎఫ్‌సీ, ఫార్మా, బ్యాంకుల్లోకి వారి పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయి.

 

స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ నుంచి డీమెర్జ్‌ అయిన సొలారా యాక్టివ్‌ ఫార్మా పట్ల విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శించారు. ఈ కంపెనీలో తమ వాటాను అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 16.2 శాతం నుంచి 17.4 శాతానికి పెంచుకున్నారు. ఈ స్టాక్‌ ఈ ఏడాది ఇప్పటికే 41 శాతం ర్యాలీ చేసింది. ముఖ్యంగా గతేడాది జూలై కనిష్ట స్థాయి రూ.133.50 నుంచి చూస్తే మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుత ధర రూ.415.80. హైదరాబాద్‌కు చెందిన గ్రాన్యూల్స్‌ ఇండియాలోనూ ఎఫ్‌పీఐలు 9.7 శాతం నుంచి 12.8 శాతానికి వాటాలు పెంచుకున్నారు. ఈ ఏడాది  ఈ స్టాక్‌ ఇప్పటికి 26 శాతం పెరిగింది. దివిస్‌ ల్యాబ్స్‌లోనూ విదేశీ ఇన్వెస్టర్ల వాటా 1.2 శాతం పెరిగి 21.2 శాతానికి చేరింది. 2018లో దేశీయ ఫార్మా కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశపరిచిన విషయం తెలిసిందే.  

 

ఇక ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం అనంతరం ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల స్టాక్స్‌ దారుణాతి దారుణంగా అమ్మకాల ఒత్తిడితో పడిపోయాయి. దీంతో మంచి ఆకర్షణీయంగా కనిపిస్తున్న వాటిని విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌లో వాటాలు అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే పెంచుకున్నారు. ఈ స్టాక్స్‌ 20 శాతం వరకు ఇటీవల ర్యాలీ చేశాయి. ఇక ప్రైవేటు రంగంలోని యాక్సిస్‌ బ్యాంకులో వాటాను 47.2 శాతం నుంచి 49.6 శాతానికి పెంచుకున్నారు. ఈ స్టాక్‌ 21 శాతం ఇటీవల పెరిగింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంకు క్యూఐపీ ఇష్యూలోనూ విదేశీ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ఈ కంపెనీలో వాటాను మార్చి త్రైమాసికంలో ఏకంగా 12.18 శాతం మేర పెంచుకున్నారు. దీంతో కంపెనీలో ఎఫ్‌పీఐల వాటా 16.56 శాతానికి పెరిగింది. ఎన్‌సీసీ, ఐవోసీ, వండర్‌లా హాలిడేస్‌లోనూ ఎఫ్‌పీఐలు వాటా పెంచుకోవడం గమనార్హం.



You may be interested

రెండేళ్లలో సత్తా చూపించే స్టాక్స్‌: మోర్గాన్‌ స్టాన్లీ

Sunday 14th April 2019

అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు మోర్గాన్‌ స్టాన్లీ వచ్చే రెండేళ్లలో ఎర్నింగ్స్‌ పరంగా మంచి పనితీరు చూపించే 22 స్టాక్స్‌ను గుర్తించింది. వీటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, మహింద్రా అండ్‌ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంకు తదితర కంపెనీలు ఉన్నాయి. రూపాయి తక్కువ వ్యాల్యూషన్లలో ఉండడం, ప్రభుత్వ వ్యయాలు పెరగడం, వడ్డీ రేట్లు తగ్గడం, సానుకూల వృద్ధి అంచనాలతో ఈ కంపెనీలు ప్రయోజనం పొందగలవన్నది మోర్గాన్‌స్టాన్లీ అంచనా. అయితే, ఎన్నికల ఫలితాలు, చమురు ధరల

ఏడాది కాలానికి నాలుగు స్టాక్స్‌

Sunday 14th April 2019

ఎక్కువ స్టాక్స్‌ ఆకర్షణీయమైన ధరల్లో కనిపిస్తుండడంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే ఎన్నికల సమయం కావడంతో వేచి చూడాలా? లేక ఇప్పుడే ఇన్వెస్ట్‌ చేయాలా? అన్న సంశయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే లార్జ్‌క్యా్ప్‌ స్టాక్స్‌ ర్యాలీ చేయగా, మిడ్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల షేర్ల ధరలు గత గరిష్ట ధరలతో పోలిస్తే 40-50 శాతం వరకు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏడాది కాలంలో మంచి రాబడులకు అవకాశం

Most from this category