STOCKS

News


బడ్జెట్‌ ముందు బేర్స్‌దే హవా!

Friday 11th January 2019
Markets_main1547189960.png-23531

గణాంకాల వెల్లడి
పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే బడ్జెట్‌కు ముందు మార్కెట్లో ఎక్కువమార్లు బేర్స్‌ పట్టు బిగించినట్లు తెలుస్తోంది. పదేళ్లలో 12 మార్లు బడ్జెట్‌ సెషన్స్‌ వచ్చాయి. వీటిలో 9 సెషన్స్‌కు ముందు మార్కెట్లపై బేర్‌ పంజా విసిరాయి. ముఖ్యంగా 2016లో బడ్జెట్‌కు ఒకనెల ముందు సూచీలు దాదాపు 7 శాతం బేర్‌ మన్నాయి. బడ్జెట్‌కు ముందు 2013లో 6.1 శాతం, 2011లో 6 శాతం మేర సూచీలు నష్టపోయాయి. కేవలం 2010, 2017, 2018లో మాత్రమే బడ్జెట్‌కు ముందు నెల సూచీలు లాభాలను చూశాయి. ఈ సంవత్సరం మధ్యంతర బడ్జెట్‌ను వచ్చేనెల 1న ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌ సమయంలో సూచీలు ఫ్లాట్‌గా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్‌ అనంతరం స్వల్పకాలంలోనే ఆర్బీఐ పాలసీ సమీక్షా సమావేశం ఉంది. అందువల్ల మార్కెట్లు అటుఇటు ఊగిసలాడి న్యూట్రల్‌గా ఉండే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంచనా. దీనికితోడు ప్రస్తుతం ఎర్నింగ్స్‌ సీజన్‌ నడుస్తున్నందున సూచీల్లో భారీ కదలికలుండకపోవచ్చని మార్కెట్‌ వర్గాల అభిప్రాయం. ఈ సారి బడ్జెట్లో పలు ప్రజాకర్షక పథకాలకు అవకాశం ఉండే ఛాన్సులున్నాయి. ముఖ్యంగా గ్రామీణ భారతాన్ని ఉద్దేశించిన చర్యలు కనిపించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. 
ఈ రంగాలను పరిశీలించవచ్చు
బడ్జెట్‌ ముందు నెలలో కొన్ని కీలక రంగాలను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. వినిమయం, బ్యాంకింగ్‌, వ్యవసాయం, ఇన్‌ఫ్రా, గ్రామీణం, హౌసింగ్‌, ఎంఎస్‌ఎంఈ రంగాలను ఈ సమయంలో పరిశీలించవచ్చని, వీటిలో నాణ్యమైన కంపెనీల స్టాకులను ఎంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. 



You may be interested

మార్కెట్‌ యూ టర్న్‌

Friday 11th January 2019

ఐటీ, అటో, ఇన్ఫ్రా, షేర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి మార్కెట్‌ నష్టాల బాట పట్టింది. నిఫ్టీ 10800 మార్కును, సెన్సెక్స్‌ 36వేల మార్కును కోల్పోయాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్ల క్షీణత సూచీలను నష్టాల్లోకి నెట్టాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల ట్రేడింగ్‌ను అందుకున్న సూచీలు నేడు లాభాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. క్యూ3లో

దేశంలో జల రవాణా విప్లవం

Friday 11th January 2019

న్యూఢిల్లీ: దేశంలో జలరవాణా విప్లవం రాబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఇది రవాణా వ్యయాన్ని 4 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా 30 శాతం మేర ఎగుమతులు పెరగడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాండ్లా నుంచి ట్యూటికోరిన్‌ వరకు (వయా మంగళూరు, కొచ్చిన్‌) రవాణాకు ఉద్దేశించిన కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌) తొలి కంటెయినర్‌ను మంత్రి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం ప్రారంభించారు. జల రవాణా మార్గాల

Most from this category