STOCKS

News


బేర్‌ మార్కెట్‌ మంచిదే!

Saturday 2nd February 2019
Markets_main1549099447.png-23963

షేర్‌ మార్కెట్లో బుల్స్‌, బేర్స్‌ రెండూ అవసరమేనని ప్రముఖ ఇన్వెస్టర్‌ శంకర్‌ శర్మ చెప్పారు. బేర్‌ మార్కెట్‌ ఎథికల్‌ హ్యాకర్‌ లాంటిదని, దీని కారణంగా వ్యవస్థలో దాగున్న లొసుగులు బయటపడతాయని అభిప్రాయపడ్డారు. బేర్‌ మార్కెట్‌ కారణంగా సిస్టమ్‌ క్లీనవుతుందని, అప్పుడు తిరిగి ర్యాలీకి ఛాన్సులుంటాయని చెప్పారు. పెద్ద పెద్ద స్కామ్‌లు బయటపడాలంటే బేర్‌మార్కెట్‌ తప్పక రావాలన్నారు. ఇలాంటి స్కాములను బుల్‌ మార్కెట్‌ కప్పిపెడుతుందని చెప్పారు. అందువల్ల బేర్స్‌ పాత్ర చాలా కీలకమని చెప్పారు. హర్షద్‌ మెహతా, సత్యం, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంక్షోభం లాంటివన్నీ బేర్‌ మార్కెట్‌ కారణంగానే బయటపడ్డాయన్నారు. గతేడాది దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులు చూశాయి. గతేడాది దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణం బయటపడింది. అనంతరం చిన్నాచితకా బ్యాంకు మోసాలు బయటకు వచ్చాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభాలు బహిర్గతమయ్యాయి. ఆయా కుంభకోణాలు బయటపడడంతో ప్రభుత్వాలు, సంబంధిత అధార్టిలు కఠిన చర్యలు తీసుకోవడం ఆరంభించాయి. ఈ రకంగా బేర్స్‌ ఎకానమీకి, మార్కెట్‌కు మేలు చేస్తున్నారని శర్మ చెప్పారు. 



You may be interested

బడ్జెట్‌ అనంతరం పెట్టుబడుల ప్లానింగ్‌

Saturday 2nd February 2019

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాగు ఆదాయం పెంచేందుకు పలు చర్యలు ప్రకటించారు. మధ్యతరగతిపై పన్ను భారం తగ్గించే యత్నాలు చేశారు. బడ్జెట్‌లో కురిపించిన వరాలు తమ ప్రభుత్వాన్ని మరోమారు గద్దెనెక్కిస్తాయని బీజేపీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో కీలకాంశాలకు అనుగుణంగా లాంగ్‌టర్మ్‌ పెట్టుబడులను ఎలా ప్లాన్‌ చేసుకోవచ్చనే అంశంపై  నిపుణుల సూచనలు, సలహాలు ఇలా ఉన్నాయి... - రూరల్‌ ఇండియా: గ్రామీణ భారతానికి బడ్జెట్లో 1.35 లక్షల కోట్ల ఉద్దీపనలు

డిమాండ్‌, వృద్ధికి బలం

Saturday 2nd February 2019

వినియోగానికి భారీ ఊతం వేతనజీవులు, రైతులకు ఎంతో మేలు గ్రామీణ ఆర్థిక రంగానికి చేయూత పన్ను మినహాయింపు పెంపు, రైతులకు ఆదాయం ఆహ్వానించతగినవి ఆరోగ్య రంగానికి మరిన్ని కేటాయింపులు అవసరం పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన నిర్ణయాలు డిమాండ్‌కు ప్రేరణనివ్వడంతోపాటు దేశ వృద్ధి రేటుకు బలాన్నిస్తాయని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలు అభిప్రాయపడ్డాయి. మధ్య తరగతి, రైతులకు ఇచ్చిన ప్రయోజనాలు వారు మరింత మొత్తంలో ఖర్చు చేసేందుకు వీలు కల్పిస్తాయని పేర్కొన్నాయి. రైతులు, అవ్యవస్థీకృత రంగంలోని

Most from this category