STOCKS

News


ఈ మూడు రంగాల స్టాక్స్‌తో జాగ్రత్త!

Tuesday 16th October 2018
Markets_main1539672874.png-21199

దేశీ వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించిన కంపెనీల స్టాక్స్‌, వినియోగ ఆధారిత స్టాక్స్‌, రిటైల్‌ లెండింగ్‌కు ప్రాధాన్యమిస్తున్న ఫైనాన్షియల్‌ సంస్థల స్టాక్స్‌తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు నిర్మల్‌ బ్యాంగ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ గిరీశ్‌ పాయ్‌. వీటిల్లో వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో వీటిపై ఒత్తిడి పెరగొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత మార్కెట్‌ కరెక‌్షన్‌లో ఆటో స్టాక్స్‌కు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. మారుతీ సుజుకీ ఎర్నింగ్స్‌ వృద్ధి ఒక అంకెకే పరిమితం కావొచ్చని అంచనా వేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మార్కెట్ల విషయానికి వస్తే ఒత్తిడి కొనసాగుతోందన్నారు. స్థూల ఆర్థికాంశాలు బలహీనంగా ఉన్నాయని, అదే సమయంలో సూక్ష్మ ఆర్థికాంశాలు బలంగా ఉండొచ్చని తెలిపారు. 
త్రైమాసికం పరంగా చూస్తే ఇన్ఫోసిన్‌ ఎర్నింగ్స్‌లో 3 శాతం వృద్ధి ఉండొచ్చని పేర్కొన్నారు. రూపాయి క్షీణత వల్ల ఎంతమేర ప్రయోజనం కలుగుతుందో చూడాల్సి ఉందన్నారు. అలాగే వేతనాలు, ఇంక్రిమెంట్ల విషయంలో కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో గమనించాల్సి ఉందని పేర్కొన్నారు. 
మార్కెట్‌ ప్రస్తుతం కరెక‌్షన్‌ దశలో ఉందని గిరీశ్‌ పాయ్‌ తెలిపారు. ప్రస్తుత పతనంలో ఆటో రంగ షేర్లకు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. మారుతీ సుజుకీలో కొంత అప్‌సైడ్‌కు చాన్స్‌కు ఉందన్నారు. అయితే ప్రస్తుతం మారుతీ ఇతర ఆటోమొబైల్‌ కంపెనీలతో పోలిస్తే అండర్‌పర్ఫార్మ్‌ చేస్తోందని గుర్తుచేశారు. ప్యాసింజర్‌ వాహన అమ్మకాల వృద్ధి ఆశించినంత స్థాయిలో లేదని తెలిపారు. మారుతీ సుజుకీ గరిష్ట ఒక అంకె వృద్ధి ఫలితాలను ప్రకటించొచ్చని అంచనా వేశారు. భవిష్యత్‌ వృద్ధి అంచనాలు కూడా ఆశించినంత స్థాయిలో లేవని తెలిపారు. కంపెనీ రానున్న కాలంలో చెప్పుకోదగ్గ కొత్త ప్రొడక్టులను మార్కెట్‌లోకి తీసుకురావడం లేదని పేర్కొన్నారు. మారుతీ సుజుకీ కోణంలో చూస్తే వృద్ధి నిరుత్సాహకరంగా ఉంటుందని తెలిపారు. అయితే మారుతీ సుజుకీ ఇండియా స్టాక్‌లో కొంత అప్‌సైడ్‌కు అవకాశముందని పేర్కొన్నారు. ఈ స్టాక్‌ ఇటీవల బాగా కరెక‌్షన్‌కు గురైందని గుర్తుచేశారు. 2-3 ఏళ్ల టార్గెట్‌తో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. మారుతీ సుజుకీ, ఐషర్‌ మోటార్స్‌ రెండింటిలో ఐషర్‌ మోటార్స్‌కు ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపారు. 3-5 ఏళ్ల కాలపరిమితిలో చూస్తే ఐషర్‌ మోటార్స్‌ విక్రయాల్లో మంచి వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేశారు. You may be interested

ర్యాలీకి రెడీగా ఉన్న 277 షేర్లు

Tuesday 16th October 2018

దేశీయ సూచీలు పుల్‌బ్యాక్‌ ర్యాలీ మూడ్‌లో ఉన్నాయి. దీంతో పలు షేర్లలో బుల్లిష్‌ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. సోమవారం ముగింపు ప్రకారం 277 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారినకంపెనీల్లో ఆర్‌కామ్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, వొడాఫోన్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, టాటాపవర్‌, ట్రైడెంట్‌, పీఎఫ్‌సీ, ఎన్‌సీసీ,

లాభాల్లో లోహ షేర్లు

Tuesday 16th October 2018

ముంబై:- గత రోజు నష్టాలతో ముగిసిన లోహ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో లోహ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ లోహ సూచీ ఇంట్రాడేలో 1.50శాతం లాభపడి 3,474.35 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:30ని.లకు నిఫ్టీ లోహ సూచీ 1శాతం లాభంతో 3440 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో హిందాల్కో(అర శాతం నష్టం) షేరు తప్ప మిగతా అన్ని

Most from this category