STOCKS

News


ఈ వారం అప్రమత్తతే ఆయుధం

Saturday 30th March 2019
Markets_main1553936030.png-24882

మార్కెట్‌ వీక్లీ గైడ్‌
దేశీయ మార్కెట్లు అప్‌ అండ్‌ డౌన్‌ ఊగిసలాటల అనంతరం వారాన్ని పాజిటివ్‌గా ముగించాయి. నిఫ్టీ 11600 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. ప్రస్తుతం అడ్వాన్స్‌ డిక్లైన్‌ నిష్పత్తి కూడా బుల్స్‌కు అనుకూలంగా ఉంది. క్రమంగా ఒక్కో రంగం ర్యాలీలో పాలుపంచుకునేందుకు ముందుకువస్తున్నాయి. దీంతో ఇకమీదట సూచీలు మరింత బలపడవచ్చని నిపుణుల అంచనా. మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌కు ఫిబ్రవరిలో ఏర్పడిన కనిష్ఠాలే బాటమ్‌ అవుట్‌గా ఎక్కువమంది భావిస్తున్నారు. యూఎస్‌ ఫెడ్‌ మరోమారు విధాన సడలీకరణ దిశగా మరలడం, ఇండియాలో ప్రస్తుత ప్రభుత్వమే మరలా రావచ్చన్న అంచనాలు.. మార్కెట్లకు డబుల్‌ బొనాంజాగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మదుపరులు ‘‘అంతా బాగున్నప్పుడే అప్రమత్తత అవసరం’’ అనే సూక్తిని గుర్తుంచుకోవాలి. పైపైన అంతా బాగున్నట్లు కనిపిస్తున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పెద్దగా మారలేదు. ఎన్నికల సందర్భంగా వినిమయం మందగించింది. ఆటో రంగంలో పేలవ వాల్యూంలు నమోదవుతున్నాయి. డిమాండ్‌ తగ్గి, వినిమయం పడకేయడం అంతిమంగా ఎకానమీపై ప్రభావం చూపుతుంది. కొత్త పెట్టుబడులు కూడా మార్కెట్లు ఆశించిన రేంజ్‌లో కాకుండా అంతంతమాత్రంగానే ఉన్నాయి. అందువల్ల మార్కెట్‌ ఎంత బలంగా పైకి ఎగిస్తే అంత బలంగా కరెక‌్షన్‌ ఉండొచ్చని నిపుణుల భావన. ప్రస్తుతం నిఫ్టీ డబుల్‌ టాప్‌ను టచ్‌ చేసేందుకు దగ్గర్లో ఉంది. ఈ స్థాయిని తాకిన అనంతరం కొంత కాలం స్వల్పరేంజ్‌లోనే సూచీలు కదలాడవచ్చు. ఆ సమయంలో తప్పక లాభాల స్వీకరణ చేయమని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు ప్రస్తుతానికి ఓవర్‌బాట్‌లో ఉన్నందున ట్రెండ్‌ రివర్సల్‌ ఛాన్సులున్నాయి. లాంగ్‌ పొజిషన్లు ఉన్నవాళ్లు ట్రయిలింగ్‌ స్టాప్‌లాస్‌ను ఫాలో కావాలి. 


 You may be interested

ఆస్తులు, అప్పుల వివరాలు చెప్పండి..

Saturday 30th March 2019

- ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లోని 13 సంస్థలకు ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లోని 13 సంస్థల ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించాల్సిందిగా నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. నిర్వహణపరమైన చెల్లింపులు కొనసాగించేందుకు అనుమతులున్న సంస్థలు ఇందులో ఉన్నాయి. హజారీబాగ్ రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే, జార్ఖండ్ రోడ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కంపెనీ, మొరాదాబాద్‌ బరైలీ ఎక్స్‌ప్రెస్‌వే, వెస్ట్ గుజరాత్ ఎక్స్‌ప్రెస్‌వే వివరాలు సమర్పించాలని చైర్మన్ జస్టిస్

పీఎన్‌బీ హౌసింగ్‌లో వాటా విక్రయించిన పీఎన్‌బీ

Saturday 30th March 2019

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటాను జనరల్‌అట్లాంటిక్‌, వర్డె పార్టనర్స్‌ సంస్థలకు రూ. 1851 కోట్లకు విక్రయించనున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వెల్లడించింది. విక్రయంలో భాగంగా ఇరు సంస్థలు చెరో 1.09 కోట్ల పీఎన్‌బీ హౌసింగ్‌ షేర్లను రూ. 850 చొప్పున కొనుగోలు చేస్తాయి. ఈ విలువ ప్రకారం పీఎన్‌బీ హౌసింగ్‌ మొత్తం విలువ రూ. 926 కోట్లకు చేరుతుంది. విక్రయానంతరం పీఎన్‌బీకి హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటా 32.79 శాతం నుంచి

Most from this category