STOCKS

News


11600 దాటితేనే బుల్లిష్‌

Monday 17th September 2018
Markets_main1537166200.png-20321

నార్నోలియా ఫిన్‌ సర్వీసెస్‌ 
కొన్ని రోజులుగా రూపాయి, క్రూడాయిల్‌ కారణాలుగా సూచీలు ఆటుపోట్లు చవిచూస్తున్నాయి. గతవారం నిఫ్టీ 50 రోజుల డీఎంఏ స్థాయి వరకు దిగజారి బలంగా రీబౌన్స్‌ అయింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 11600 పాయింట్లను దాటితేనే బుల్లిష్‌గా మారుతుందని నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ టెక్నికల్‌ హెడ్‌ షబ్బీర్‌ ఖయ్యూం చెబుతున్నారు. నిఫ్టీ చార్టుల్లో ఏబీ= సీడీ తరహా పాటర్న్‌ ఏర్పడిందన్నారు. తాజా పుల్‌బ్యాక్‌ క్రమంగా 11560 పాయింట్ల వరకు కొనసాగవచ్చన్నారు. ఈ స్థాయి గత పతనానికి 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయని చెప్పారు.

ఇప్పుడు జరుగుతున్న కరెక‌్షన్‌ తాత్కాలికమా లేక దీర్ఘకాలికమా అనేది తేలాల్సిఉందన్నారు. కొన్ని ఇండికేటర్లు, ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఐ లాంటివి పాజిటివ్‌ మూడ్‌ను చూపుతున్నాయని, కానీ ఫాలింగ్‌ వెడ్జ్‌ పాటర్న్‌ నెగిటివ్‌నెస్‌ చూపుతోందని వివరించారు. అందువల్ల నిఫ్టీ 11600 పాయింట్లను దాటేంతవరకు బుల్లిష్‌ అని చెప్పలేమన్నారు. దిగువన 11200 పాయింట్లను కోల్పోతే పూర్తిగా కరెక‌్షన్‌ మూడ్‌లోకి వచ్చిందని చెప్పవచ్చన్నారు.

ఆప్షన్‌ డేటా చూస్తే 11400, 11500 పాయింట్ల వద్ద పుట్స్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ అధికంగా ఉందని, 11600, 11800 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. దీన్ని బట్టి ప్రస్తుతానికి నిఫ్టీ 11300- 11600 పాయింట్ల రేంజ్‌లోనే కదలాడవచ్చని అంచనా వేశారు. ఈ రేంజ్‌ను ఎటువైపు ఛేదించడమనేదాన్ని బట్టి తదుపరి అంచనాలుంటాయన్నారు. ప్రస్తుతానికి కచ్ఛితమైన స్టాప్‌లాస్‌తో ఎంపిక చేసిన స్టాకుల్లో లాంగ్స్‌ను పరిశీలించవచ్చని సూచించారు. 



You may be interested

పండుగ సీజన్‌ నిరుత్సాహపరిస్తే నిఫ్టీ పరుగుకు బ్రేక్‌

Monday 17th September 2018

నిఫ్టీ-50 ఈ ఏడాది ఇప్పటి దాకా 8 శాతం మేర ర్యాలీ చేసింది. ఈక్విటీల్లో దేశీ ఇన్వెస్ట్‌మెంట్లు పెరగడం, జూన్‌ క్వార్టర్‌ ఎర్నింగ్స్‌ పుంజుకోవడం వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణం. ‘ప్రస్తుతం ఆశావహ పరిస్థితుల్లో ఉన్నామని భావించడం లేదు. సమతుల్యంగా ఉన్నాం. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలు బాగున్నాయి. అయితే అమెరికా మార్కెట్లలో పెరుగులే ఇక్కడ సమస్య’ అని డైమెన్షన్స్‌ కన్సల్టింగ్‌ సీఈవో అజయ్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల

27000 దిగువకు నిఫ్టీ బ్యాంక్‌ .!

Monday 17th September 2018

ముంబై:- రూపాయి పతనంతో పాటు అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సోమవారం ఉదయం సెషన్స్‌లో మార్కెట్‌ భారీగా నష్టపోయింది. ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన షేర్ల పతనంతో సెన్సెక్స్‌ 493 పాయింట్లను, నిఫ్టీ 141 పాయింట్లను కోల్పోయాయి. బ్యాంకింగ్‌ షేర్ల పతనంలో భాగంగా ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీబ్యాంక్‌  సూచి 27వేల మార్కును కోల్పోయింది. ఇంట్రాడేలో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 1.50శాతం(420 పాయింట్లు)

Most from this category