STOCKS

News


మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో జెమ్స్‌!

Wednesday 20th February 2019
Markets_main1550686312.png-24265

గతేడాది ఆగస్ట్‌ నుంచి స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ భారీగా నష్టపోయాయి. దీంతో ఈ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఒకటికి, రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత ఆగస్ట్‌ నుంచి ఈ విభాగంలో చాలా స్టాక్స్‌ 98 శాతం వరకూ నష్టపోయాయి. కానీ, ఇదే కాలంలో సెన్సెక్స్‌, నిఫ్టీలు రికవరీ కావడం గమనార్హం. అయితే, ఇలా దారుణంగా పడిపోయిన స్టాక్స్‌లో మంచి జెమ్స్‌ కూడా ఉన్నాయంటున్నారు అనలిస్టులు. 

 

గతేడాది ఆగస్ట్‌ నుంచి మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ పతనం జరిగినా... ఇదే కాలంలో చక్కెర రంగానికి చెందిన షేర్లు వాటాదారులకు మంచి తీపి ఫలాలను అందించాయి. స్మాల్‌క్యాప్‌ కంపెనీ ధమ్‌పూర్‌ షుగర్‌ గతేడాది ఆగస్ట్‌ 28న రూ.90.30 నుంచి రూ.212కు చేరుకుంది.అంటే 139 శాతం పెరిగింది. బలరామ్‌పూర్‌ చినీ, దాల్మియా భారత్‌ షుగర్‌, త్రివేణి ఇంజనీరింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, ద్వారికేష్‌ షుగర్‌, ఉత్తమ్‌ షుగర్‌ మిల్స్‌, బజాజ్‌ హిందుస్తాన్‌, అవధ్‌ షుగర్‌ ఇదే కాలంలో 70 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా పంచదారకు మద్దతు ధరను ప్రభుత్వం కిలోకు 29 నుంచి రూ.31కు పెంచడం కలిసొచ్చింది. ప్రజ్‌ ఇండస్ట్రీస్‌, ఐవోఎల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌, ఇండోరమా సింథటిక్స్‌, ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, క్యాప్రి గ్లోబల్‌, న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌, టీటీకే ప్రెస్టీజ్‌ 20 శాతం వరకు ర్యాలీ చేశాయి. 

 

మిడ్‌, స్మాల్‌క్యాప్‌లో షార్ప్‌ కరెక్షన్‌ అధిక నాణ్యత కలిగిన కంపెనీల స్టాక్స్‌ను ఈ స్థాయిల్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ వికాస్‌ జైన్‌ సూచించారు. ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఫిలిప్‌ క్యాపిటల్‌ ప్రజ్‌ ఇండస్ట్రీస్‌ స్టాక్‌ పట్ల బుల్లిష్‌గా ఉంది. దీనికి రూ.150 టార్గెట్‌ను ఇచ్చింది. బయోఫ్యూయల్‌ టెక్నాలజీలో మార్కెట్‌ లీడర్‌ కావడం, రానున్న ఎథనాల్‌ బ్లెండింగ్‌, బయో-సీఎన్‌జీ అవకాశాలతో కంపెనీ లబ్ధి పొందుతుందని ఫిలిప్‌ క్యాపిటల్‌ తెలిపింది. స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో సుబ్రోస్‌, సన్‌టెక్‌ రియాలిటీ, బాటా ఇండియాల పట్ల కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సానుకూలంగా ఉంది. వీటికి వరుసగా రూ.299, రూ.488, రూ.1,407 టార్గెట్‌ ధరలను ఇచ్చింది. సుబ్రోస్‌ గతేడాది ఆగస్ట్‌ నుంచి 28 శాతం పెరగ్గా, సన్‌టెక్‌ రియాలిటీ 34 శాతం రాబడులను ఇచ్చింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఇండియన్‌ హోటల్స్‌ పట్ల బుల్లిష్‌గా ఉంది. 12 నెలల కాలానికి రూ.165 టార్గెట్‌ ఇచ్చింది. మూడో త్రైమాసికంలో మంచి ఫలితాలను ఇచ్చిన విషయాన్ని పేర్కొంది. ‘‘బోటమ్‌అప్‌ స్టాక్‌ ఎంపికకు ఇది సరైన సమయం. మిడ్‌, స్మాల్‌క్యాప్‌లో వచ్చే ఆరు నెలల్లో పెట్టుబడులు పెంచుకోవాలని క్లయింట్లకు సూచిస్తున్నాం’’ అని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పంకజ్‌ టిబ్రేవాల్‌ తెలిపారు.You may be interested

నిఫ్టీకి 10,790 కీలకం

Wednesday 20th February 2019

వరుసగా ఎనిమిది షెషన్ల నష్టాల తర్వాత నిఫ్టీకి బుధవారం లాభాలొచ్చాయి. దిగువ వైపు నుంచి నిఫ్టీ కోలుకోవడంతోపాటు తక్షణ నిరోధ స్థాయి 10,683ను దాటి క్లోజయింది. దీంతో గురువారం మార్కెట్‌ తీరుపై జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తన అంచనాలను తెలియజేశారు.    నిఫ్టీ సానుకూలంగా ట్రేడింగ్‌ ఆరంభించినప్పటికీ... సెషన్‌లో ఎక్కువ సమయం పాటు 100 రోజుల సగటు చలనం (100డీఎంఏ) 10,683 వద్ద నిరోధాన్ని ఎదుర్కొన్నది. చివరి

వ్యాల్యూ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో కొత్త స్టాక్స్‌

Wednesday 20th February 2019

వ్యాల్యూ ఇన్వెస్టర్లు, ప్రముఖ ఇన్వెస్టర్లుగా పేర్కొనే డాలీఖన్నా, ఆశిష్‌ కచోలియా, పొరింజు వెలియాత్‌ వంటి వారి పోర్ట్‌ఫోలియోలోకి కొత్తగా కొన్ని స్టాక్స్‌ వచ్చి చేరాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో మార్కెట్‌ డేటా ఆధారంగా ఈ వివరాలు వెలుగు చూశాయి. ఓ కంపెనీలో ఒక శాతానికి పైగా వాటాలున్న సాధారణ ఇన్వెస్టర్ల వివరాలను కంపెనీలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ ప్రకారం చూస్తే ఏస్‌ ఇన్వెస్టర్ల చేతికి చిక్కిన స్టాక్స్‌ వివరాలు ఇవి...   అన్సాల్‌ బిల్డ్‌వెల్‌ కోచికి

Most from this category