STOCKS

News


దిగుమతి సుంకాల ఎఫెక్ట్‌: నష్టాల్లో కన్జ్యూమర్‌ షేర్లు

Thursday 27th September 2018
Markets_main1538040549.png-20646

ముంబై:- దిగుమతి సుంకాల పెంపుతో కన్జ్యూమర్‌ షేర్లకు కష్టాలు మొదలయ్యాయి. సుంకాల పెంపుతో రానున్న రోజుల్లో మార్జిన్లు తగ్గితాయని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన దిగుమతుల సుంకాలతో రూపాయి విలువ క్షీణించినప్పటికీ, దిగుమతులు భారీ తగ్గే అవకాశం ఉంది. వినిమయ వస్తువులపై పెంచిన దిగుమతి సుంకాల ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు.

  • విద్యుత్‌ ఉపకరణాల దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 10శాతం సుంకాన్ని 20శాతానికి పెంచారు. ఫలితంగా విద్యు్‌త్‌ ఉపకరణాల బ్లూస్టార్‌, వోల్టాస్‌, వర్ల్పూల్, హావెల్స్‌ ఇండియా షేర్లు 5 నుంచి 2శాతం నష్టపోయాయి.
  • ఇప్పటికి వరకు ఏవియేషన్‌ టర్బన్‌ ఫ్యూయల్‌ దిగుమతులపై ఎలాంటి దిగుమతి సుంకం లేదు. ఈ దిగుమతులపై తాజా 5శాతం పన్ను విధించారు
    ప్రపంచమార్కెట్లో రోజురోజుకు పెరుగుతున్న ముడిచమురు ధరలతో ఇప్పటికే నష్టాల బాట పట్టిన విమాయన షేర్లు ఇప్పుడు ఏవియేషన్‌ టర్బన్‌ ఫ్యూయల్‌ పెంచడంతో మరింత కాలం నష్టాల్లో ట్రేడ్‌ అయ్యే అవకాశం ఉంది. నేటి ట్రేడింగ్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌ షేర్లు 6నుంచి 4శాతం వరకు నష్టపోయాయి.
  • ఏవియేషన్‌ టర్బన్‌ ఫ్యూయల్‌ దిగుమతులపై 5శాతం పన్ను దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎంసీ)లకు కలిసొచ్చే అంశం. ఈ పన్ను విధింపు కారణంగా  రానున్న రోజుల్లో ఓఎంసీలు మార్జిన్లలను పెంచుకుంటాయని విశ్లేషకుల భావిస్తున్నారు. నేటి ట్రేడింగ్‌లో ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 3నుంచి అరశాతం లాభపడ్డాయి.-    
  • రేడియల్‌ కార్ల టైర్లపైన ప్రస్తుతం ఉన్న 10శాతం దిగుమతి సుంకాన్ని 15శాతానికి పెంచారు. దీంతో దేశీయ కంపెనీలైన ఎంఆర్‌ఎఫ్‌, అపోలో టైర్స్‌, సియట్‌, జేకే టైర్స్‌ లాభాల బాట పట్టాయి.



You may be interested

ధర కాదు.. వ్యాల్యుయేషన్‌ చూడాలి..

Thursday 27th September 2018

ధర ప్రాతిపదికన కాకుండా వ్యాల్యుయేషన్స్‌ ఆధారంగా స్టాక్‌ను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు బోఫా-మెరిల్‌లించ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ మూకిన్‌. స్టాక్‌ కొనుగోలుకు ఎంత చెల్లిస్తున్నామనే దాన్ని వ్యాల్యుయేషన్స్‌ కోణంలో చూడాల్సి ఉందన్నారు. ఐటీ రంగం రక్షణాత్మక స్థానంలో ఉందని, అయితే ఇందులో వృద్ధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. కంపెనీల ఎర్నింగ్స్‌ వృద్ధి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  ఈల్డ్స్‌

రివర్స్‌ గేర్‌లో మార్కెట్‌

Thursday 27th September 2018

స్టాక్‌ మార్కెట్‌ రివర్స్‌ గేర్‌ తీసుకుంది. లాభాలతో ప్రారంభమైన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 11,000 మార్క్‌ దిగువకు వచ్చేసింది. మధ్యాహ్నాం 1:56 సమయంలో సెన్సెక్స్‌ 205 పాయింట్ల నష్టంతో 36,338 పాయింట్ల వద్ద, నిఫ్టీ 75 పాయింట్ల నష్టంతో 10,979 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఎఫ్‌అండ్‌వో ఫ్యూచర్స్‌ ఎక్స్‌పైరీ, క్రూడ్‌ ధరల పెరుగుదల, ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ ఆందోళనలు, నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలను కోల్పోవడం, ఫెడ్‌ రేట్ల పెంపు

Most from this category