STOCKS

News


ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్‌: సెన్సెక్స్‌ 554 పాయింట్లు డౌన్‌

Thursday 6th June 2019
Markets_main1559816750.png-26140

 

178 పాయింట్లను కోల్పోయిన నిఫ్టీ


ఆర్‌బీఐ పాలసీలో మార్కెట్‌ను ఆశ్చర్యపర్చే అంశాలేవీ లేకపోవడం, లిక్విడిటీ సంక్షోభ నివారణకు స్పష్టమైన చర్యల్నిప్రకటించకపోవడంతో నిరుత్సాహానికి గురైన మార్కెట్‌ గురువారం భారీ నష్టంతో ముగిసింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే పావుశాతం మాత్రమే వడ్డీరేట్ల కోతను ఆర్‌బీఐ ప్రకటించడం, ఆ అంశాన్ని ఇప్పటికే మార్కెట్లు డిస్కౌంట్‌ చేసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు రేట్ల ప్రభావిత షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిపారు. మరోవైపు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌...చెల్లింపుల్లో డిఫాల్డ్‌కావడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా సెన్సెక్స్‌, నిఫ్టీలు ఈ ఏడాదిలో అతి పెద్ద పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్‌ 40,000 స్థాయిని, నిఫ్టీ 12000 స్థాయిని కోల్పోయాయి.  సెన్సెక్స్‌ 554 పాయింట్లు నష్టపోయి 39,529.72 వద్ద, నిఫ్టీ 178 పాయింట్లు నష్టపోయి 11,843.75 వద్ద స్థిరపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 700 పాయింట్ల మేర నష్టపోయి 30,857.40 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఫైనాన్స్‌, ఎనర్జీ రంగ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి.  నేడు ఆర్‌బీఐ పాలసీ సమావేశ నిర్ణయాలు వెల్లడించనున్న నేపథ్యంలో సూచీలు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ... తిరిగి నష్టాల్లో మళ్లాయి. ఆర్‌బీఐ వడ్డీరేట్ల ప్రకటన అనంతరం అమ్మకాలు మరింత ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మార్కెట్‌ ముగింపు సమయంవరకూ అ‍మ్మకాల తీవ్రత అలాగే కొనసాగడంతో సెన్సెక్స్‌ ఒకదశలో 602 పాయింట్లను నష్టపోయి 39,481.15వద్ద, నిఫ్టీ 191 పాయింట్లు కోల్పోయి 11,830.25ల వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ‘‘వడ్డీరేట్ల కోత ముందుగానే ఊహించిందే. ఆర్థిక వ్యవస్థ మందగమన ఆందోళనలు, వ్యవస్థలో ద్రవ్యలోటు సవాళ్లను ఎదుర్కోందుకునేందుకు ఆర్‌బీఐ ఎలాంటి ప్రణాళికలను ప్రకటించకపోవడం మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరిచాయి’’ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

ఎస్‌బీఐ , యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌, గెయిల్‌ 4.50శాతం నుంచి 11.50శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, హీరోమోటోకార్ప్‌, టైటాన్‌, కోల్‌ ఇండియాలు 1శాతం నుంచి 3శాతం వరకూ లాభపడ్డాయి. You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ గట్టెక్కుతుంది..!: సుందరం ఏఎంసీ 

Thursday 6th June 2019

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ చెల్లింపులను వాయిదా వేసిన నేపథ్యంలో ఈ సంస్థ పట్ల ఇన్వెస్టర్లలో నమ్మకం సడలుతుండగా, సుందరం ఏఎంసీ ఎండీ సునీల్‌ సుబ్రమణ్యం మాత్రం సంస్థ నిలదొక్కుకుంటున్న ఆశాభావంతో ఉన్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తిరిగి చెల్లింపులు చేయగలదన్న నమ్మకం తమకు ఉన్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల విశ్వాసం కోల్పోవద్దని సూచించారు.     చెల్లింపులకు ఏడు రోజుల గడువు (గ్రేస్‌

ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ లావాదేవీలపై రుసుముల తొలగింపు

Thursday 6th June 2019

ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసే బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త ప్రకటించింది. ఆర్టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా చేసే నగదు బదిలీలపై ఛార్జీలను తొలగిస్తున్నట్లు తెలిపింది. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, బ్యాంకులు ఈ ప్రయోజనాలను తమ ఖాతాదారులకు బదిలీ చేయాలని ఆదేశించామని తెలిపింది.  దీంతో పాటు ఏటీఎం ఛార్జీలను కూడా

Most from this category