STOCKS

News


11400 దిగువన నిఫ్టీ ముగింపు

Thursday 16th August 2018
Markets_main1534416051.png-19347

ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోన్న సూచీలు బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్ల పతనంతో చివరకు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 188 పాయింట్ల నష్టంలో 37,663 వద్ద, నిఫ్టీ 50పాయింట్లు పతనమై 11,385 వద్ద ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితితో పాటు, రూపాయి విలువ పతనంతో మార్కెట్‌ నష్టాల బాట పట్టింది. ట్రేడింగ్‌ ఆత్యంతం ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో నిఫ్టీ  11,400 మార్కు కిందకి వచ్చింది. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, ఐటీ, అటో రంగాలకు చెందిన సూచీలు లాభపడగా, మెటల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన సూచీలు నష్టపోయాయి. కీలకమైన బ్యాంకు నిఫ్టీ 195 పాయింట్లు నష్టపోయి 27,826 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ గరిష్టస్థాయి నుంచి 37892 నుంచి కనిష్టస్థాయి 37634 రేంజ్‌లో(మొత్తం 258 పాయింట్లు) ట్రేడవ్వగా, నిఫ్టీ గరిష్టస్థాయి 11,450నుంచి నుంచి కనిష్టస్థాయి 11,366 రేంజ్‌లో(మొత్తం 84పాయింట్లు) స్థాయిలో కదలాడింది.
ట్రేడింగ్‌ సాగిందిలా:-
ప్రపంచమార్కెట్లో నెలకొన్న అనిశ్చితికి తోడు, రూపాయి కొత్త రికార్డ్‌ కనిష్ట స్థాయికి చేరుకోవడంతో తదితర ప్రతికూల అంశాల నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్‌ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 56 పాయింట్ల నష్టంతో 37,796 వద్ద, నిఫ్టీ  38 పాయింట్ల నష్టంతో 11,397 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లు పతన బాట పట్టాయి. అయితే రూపాయి కొత్త కనిష్టస్థాయికి చేరుకోవడంతో ఐటీ, ఫార్మారంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. గత రాత్రి అమెరికా మార్కెట్‌తో సహా ఆసియా మార్కెట్ల వరకూ నష్టాల ట్రేడింగ్‌ కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఫలితంగా ట్రేడింగ్‌ ఆద్యంతం సూచీలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి.
ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, జీ లిమిటెడ్‌, వేదాంత, కోటక్‌ బ్యాంకు షేర్లు 2.50శాతం నుంచి 4శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్‌, లుపిన్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, గెయిల్‌ షేర్లు 1.50శాతం నుంచి 3.60శాతం లాభపడ్డాయి.



You may be interested

ఎఫ్‌పీఐలు ఏ స్టాక్స్‌ కొంటున్నారు... ఏవి అమ్ముతున్నారు...?

Friday 17th August 2018

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మన దేశ మార్కెట్లలో కీలక పాత్ర పోషించే వారిలో ఒక వర్గం. వీరి అమ్మకాలు, కొనుగోళ్లు కొన్ని స్టాక్‌ కౌంటర్లలో ర్యాలీ, పతనాలను నిర్ణయించగలదు. అలాగే, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ పెట్టుబడులునూ... అందుకే ఇన్వెస్టర్లు ఎఫ్‌పీఐ, ఫండ్స్‌ యాక్టివిటీని జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు మన ఈక్విటీ మార్కెట్లలో రూ.200 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ప్రధానంగా వీరు ఆటోమొబైల్స్‌, కన్జ్యూమర్‌, ఇంధన రంగాల్లో

మోదీ మళ్లీనా?!.. మార్కెట్‌ అంతధీమాగా లేదు!

Thursday 16th August 2018

ప్రభుత్వం ఏర్పడినా మెజార్టీ తగ్గవచ్చు పండితుల అంచనా మరోమారు మోదీ ప్రభుత్వం ఏర్పాటుపై మార్కెట్లేమీ సూపర్‌ బుల్లిష్‌గా లేవని ట్రేడ్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. విపక్షాల ఐక్యత, ప్రభుత్వ వ్యతిరేకతలాంటి రిస్కులను ఇప్పటికే మార్కెట్లు పరిగణిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా ఎకానమీలో వచ్చే మెరుగుదలను సైతం సూచీలు క్రమంగా డిస్కౌంట్‌ చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా ఇప్పటినుంచే మార్కెట్లు  ఎన్నికల

Most from this category