STOCKS

News


ఎఫ్‌ఐఐలు, డీఐఐలు భారీగా ఇన్వెస్ట్‌ చేసినవి..?

Friday 23rd November 2018
Markets_main1542912077.png-22316

దేశీయ సంస్థాగత పెట్టుబడి దారులు (డీఐఐలు), విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు/ఎఫ్‌పీఐలు) సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఎక్కువగా కొనుగోలు చేసిన స్టాక్స్‌ ఏ రంగానివో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందా...? బ్యాంకులు, మెటల్స్‌, ఆటోమొబైల్స్‌, ఫార్మా రంగాల్లోకి వీరి నుంచి అదనపు పెట్టుబడులు వచ్చినట్టు ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ డేటా తెలియజేస్తోంది. ముఖ్యంగా బ్యాంకులు, ద్విచక్ర వాహన కంపెనీలు, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, గ్యాస్‌ పంపిణీ, మిడ్‌క్యాప్‌ ఐటీ కంపెనీలు ఆకర్షణీయంగా మారాయి. కొన్ని రంగాల్లో డీఐఐలు ఎక్స్‌పోజర్‌ తగ్గించుకుంటే, ఎఫ్‌ఐఐలు పెంచుకోవడం, కొన్ని రంగాల్లో దీనికి విరుద్ధంగానూ జరిగింది. 


ఎఫ్‌ఐఐలు తగ్గించుకున్నవి
సెప్టెంబర్‌ క్వార్టర్లో యస్‌ బ్యాంకులో 3 శాతం మేర ఎఫ్‌ఐఐల వాటా తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంకులో 1.18 శాతం, యాక్సిస్‌ బ్యాంకులో 0.60 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 0.65 శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకులో 0.41 శాతం మేర ఎఫ్‌ఐఐలు వాటాలు తగ్గించుకున్నారు. బజాజ్‌ ఆటోలో 0.30 శాతం, టీవీఎస్‌ మోటార్‌లో 1.60 శాతం, హీరో మోటోకార్ప్‌లో 0.74 శాతం, మారుతి సుజుకీలో 0.88 శాతం, బెర్జర్‌ పెయింట్స్‌లో 4.90 శాతం, టైటాన్‌లో 1.03 శాతం, బ్రిటానియాలో 0.97 శాతం, సన్‌టీవీ 1.91 శాతం చొప్పున ఎఫ్‌ఐఐల వాటా తగ్గింది. 


ఎఫ్‌ఐఐలు పెంచుకున్నవి
అరబిందో ఫార్మాలో 1.34 శాతం, సిప్లాలో 1.09 శాతం, బయోకాన్‌లో 0.75 శాతం మేర ఎఫ్‌ఐఐలు వాటాలు పెంచుకున్నారు. ఎంజీఎల్‌లో 6.33 శాతం, గెయిల్‌లో 1.32 శాతం, ఐజీఎల్‌లో 1.03 శాతం, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీలో 0.82 శాతం మేర వాటాలు పెంచుకున్నారు. 


డీఐఐల వాటా పెరిగినవి
ఐసీఐసీఐ బ్యాంకులో 1.74 శాతం, యాక్సిస్‌ బ్యాంకులో 0.59 శాతం, ఎస్‌బీఐలో 0.23 శాతం చొప్పున డీఐఐల వాటా పెరిగింది. అదే సమయంలో డీఐఐలు వేదాంతలో 2.94 శాతం, జిందాల్‌ స్టీల్‌లో 1.01 శాతం, హిందుస్తాన్‌ జింక్‌లో 0.40 శాతం, టాటా స్టీల్‌లో 0.57 శాతం చొప్పున వాటా పెంచుకున్నారు. డీఐఐలు టీవీఎస్‌ మోటార్‌లో 1.75 శాతం, మారుతి సుజుకీలో 0.62 శాతం, హీరో మోటోకార్ప్‌లో 0.41 శాతం చొప్పున అదనంగా వాటాలు కొనుగోలు చేశారు. 


డీఐఐల అమ్మకాలు
యస్‌ బ్యాంకులో 2.21 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంకులో 0.36 శాతం మేర డీఐఐల వాటా తగ్గింది. అలాగే, ఎల్‌అండ్‌టీలో 0.50 శాతం, బీహెచ్‌ఈఎల్‌లో 0.40 శాతం వాటా తగ్గించుకున్నారు. 


డీఐఐలు, ఎఫ్‌ఐఐల వాటా పెరిగినవి
ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, హెక్సావేర్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, తేజాస్‌ నెట్‌వర్క్స్‌, మహానగర్‌ గ్యాస్‌లో డీఐఐలు, ఎఫ్‌ఐఐల వాటా పెరగ్గా... సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు, యస్‌ బ్యాంకు, జేపీ అసోసియేట్స్‌, డిష్‌టీవీలో డీఐఐలు, ఎఫ్‌ఐఐల వాటా తగ్గింది. 


 



You may be interested

స్టాక్‌ మార్కెట్‌కు సెలవు

Friday 23rd November 2018

గురునానక్‌ జయంతి సందర్భంగా నేడు (శుక్రవారం) మార్కెట్‌కు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ట్రేడింగ్‌ జరగదు. అలాగే మెటల్‌, బులియన్‌ సహా అన్ని హోల్‌సెల్‌ కమోడిటీ మార్కెట్లు పనిచేయవు. ఫారెక్స్‌, కమోడిటీ ఫ్యూచర్స్‌మార్కెట్లకు కూడా సెలవు. తిరిగి స్టాక్‌ మార్కెట్‌​ట్రేడింగ్‌ 26వ తేదీన (సోమవారం) మొదలవుతుంది. కాగా గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 219 పాయింట్లు నష్టపోయి 34,981 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 10,527 పాయింట్ల వద్ద

ఐషర్‌ మోటార్స్‌ టార్గెట్‌ తగ్గించిన ఇన్వెస్టెక్‌

Thursday 22nd November 2018

ముంబై: ఐషర్‌ మోటార్స్‌ లిమిటెడ్ షేరు ధర గురువారం ఒక శాతం మేర నష్టపోయింది. ఇంట్రాడేలో రూ.23,940 కనిష్టస్థాయిని తాకింది. మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.161 (0.67 శాతం) నష్టపోయి రూ.24,055 వద్ద ముగిసింది. ఈ కంపెనీ షేరు ధరను ఇంతకుముందు ఇచ్చిన టార్గెట్‌ రూ.35,000 నుంచి రూ.30,300 వద్దకు తగ్గిస్తున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ ఇన్వెస్టెక్‌ ప్రకటించింది. ప్రస్తుత ధర నుంచి 13.4 శాతం తగ్గించింది. 2019/20 ఆర్థిక సంవత్సరానికి

Most from this category