STOCKS

News


ఒక్కటవుతున్న బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు!

Friday 12th April 2019
Markets_main1555009376.png-25076

గత రెండు సంవత్సరాల్లో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల వ్యాపారంలో చక్కని వృద్ధి నెలకొంది. మార్కెట్‌ నుంచి నిధుల సమీకరణ వ్యయాలు తక్కువగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. కానీ, గతేడాది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ చెల్లింపుల వైఫల్య సంక్షోభం అనంతరం మార్కెట్లో నిధులకు కటకట ఏర్పడింది. నిధుల సమీకరణ వ్యయాలు ఎన్‌బీఎఫ్‌సీలకు పెరిగిపోయాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు ఏర్పడిన ఈ గడ్డు పరిస్థితులు బ్యాంకులకు అనుకూలంగా మారాయి. వీటికి తక్కువ వ్యయాలతో కూడిన డిపాజిట్లు భారీగా ఉండడమే పెద్ద వెసులుబాటు. ఈ మారిన పరిస్థితులు కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకుల విలీనాలకు దారితీస్తున్నాయా? 

 

తాజాగా లక్ష్మీ విలాస్‌ బ్యాంకు, హౌసింగ్‌ రుణాల సంస్థ ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ విలీనానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌లో లక్ష్మీ విలాస్‌ బ్యాంకు విలీనం కానుంది. ప్రతీ 100 లక్ష్మీ విలాస్‌ బ్యాంకు షేర్లకు 14 ఇండియాబుల్స్‌ షేర్లను కేటాయించాలన్నది నిర్ణయం. దీనికి ఆర్‌బీఐ సహా అన్ని నియంత్రణ సంస్థల ఆమోదం అవసరం. కానీ, ఇదొక్కటే కాదు, దీనికంటే ముందు... ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ క్యాపిటల్‌ ఫస్ట్‌ ఐడీఎఫ్‌సీ బ్యాంకుతో విలీనమైన ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకుగా అవతరించింది. భారత్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకులు విలీన నిర్ణయం తీసుకున్నాయి. గృహ్‌ ఫైనాన్స్‌ కూడా బంధన్‌ బ్యాంకులో విలీనం కానుంది. భారత్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ అన్నది అతిపెద్ద సూక్ష్మ రుణాల సంస్థ. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుగా లైసెన్స్‌ పొందలేకపోవడం, అదే సమయంలో ఇండస్‌ఇండ్‌ బ్యాంకు గ్రామీణంగా విస్తరించాలనుకోవడం వీటి మధ్య డీల్‌కు కారణం. 

 

ఐడీఎఫ్‌సీ బ్యాంకు కొన్నేళ్ల క్రితమే బ్యాంకింగ్‌ సేవల్లోకి ప్రవేశించినది. ఐడీఎఫ్‌సీ నుంచి ఏర్పడిన సంస్థ. దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాల కోసం అన్వేషిస్తున్న ఐడీఎఫ్‌సీ బ్యాంకు తొలుత శ్రీరామ్‌ గ్రూపు ఆర్థిక సంస్థలతో విలీనానికి చేసిన ప్రయత్నాలు అనుకూలించలేదు. తర్వాత క్యాపిటల్‌ ఫస్ట్‌ రూపంలో అవకాశం లభించడంతో ముందడుగు వేసింది. ఇక గృహ్‌ ఫైనాన్స్‌ హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపు కంపెనీ. హెచ్‌డీఎఫ్‌సీ కూడా గృహ రుణాల, ఆర్థిక సేవల కంపెనీ కావడంతో బంధన్‌ బ్యాంకులో విలీనానికి అనుకూలంగా నిర్ణయం జరిగింది. బంధన్‌ బ్యాంకు ప్రమోటర్లకు బ్యాంకులో 82.88 శాతం వాటా ఉంది. దీన్ని తగ్గించకోవాల్సిన పరిస్థితుల్లో గృహ్‌ ఫైనాన్స్‌తో విలీనానికి ప్రయత్నించి సఫలం అయింది. ఇక నిధుల సమస్య, నిధుల సమీకరణ వ్యయాలు పెరిగిన ఇబ్బందులను ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎదుర్కొంటోంది. లక్ష్మి విలాస్‌ బ్యాంకు దక్షిణాదిన కార్యకలాపాలు నిర్వహిస్తూ వ్యాపార విస్తరణ, నిధుల, ఎన్‌పీఏల సమస్యలను ఎదుర్కొంటోంది. రెండూ కలిస్తే నిధుల సమస్య తొలగిపోయి, దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించే ఎనిమిదో పెద్ద ప్రైవేటు బ్యాంకు ఏర్పడుతుంది. 

 

ఒప్పందాలకు కారణాలు...
అందుబాటు ధరల్లో ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ఉన్న ఈ అవకాశాలే బ్యాంకులకు ఆకర్షణీయంగా మారుతున్నాయని డెలాయిట్‌ హౌస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌ పార్ట్‌నర్‌ కల్పేష్‌ మెహతా పేర్కొన్నారు. ‘‘హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎన్‌బీఎఫ్‌సీల రుణ పుస్తకంపై పరిమితులు ఉన్నాయి. ఆ స్థాయికి చేరితో అవి తమ పోర్ట్‌ఫోలియోను బ్యాంకులకు విక్రయించడం లేదా బ్యాంకులకు బిజినెస్‌ కరస్పాండెంట్‌గా పనిచేయాల్సిన పరిస్థితి. ఎన్‌బీఎఫ్‌సీలు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుగా మారడం లేదా బ్యాంకుతో కలవడం ద్వారా విస్తరించడానికి అవకాశం ఉంటుంది’’ అని కల్పేష్‌ మెహతా వివరించారు. ఈ తరహా విలీనాలు ఇరు పార్టీలకు మంచిదేనని నిపుణుల అభిప్రాయం. ప్రైవేటు బ్యాంకుల మధ్య పోటీ ఏటేటా తీవ్రతరం అవుతోందని, విలీనం ద్వారా బలోపేతం అయ్యేందుకు అవకాశం లభిస్తుందన్నారు. అలాగే, ఎన్‌డీఎఫ్‌సీలకు లిక్విడిటీ సమస్య ఎదురైన తర్వాత వాటి వ్యాల్యూషన్లు చాలా ఆకర్షణీయమైన స్థాయికి చేరాయని, బ్యాంకులు చాలా ఆకర్షణీయమైన విలువలకే ఎన్‌బీఎఫ్‌సీల నుంచి లోన్‌ బుక్స్‌ను సొంతం చేసుకుంటున్నట్టు చెప్పారు. You may be interested

మార్కెట్లు పడితే ఈక్విటీల్లోకి నిధుల వెల్లువ!

Friday 12th April 2019

ఎన్నికల ఫలితాల తర్వాత మార్కెట్లు పడితే తాము కొనుగోళ్లు జరిపే వారిలో ఉంటామని ఎన్విజన్‌ క్యాపిటల్‌ ఎండీ, సీఈవో నీలేష్‌ షా తెలిపారు. మార్కెట్లపై ఎన్నికల ఫలితాల ప్రభావం గురించి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు. మార్కెట్లు మోడీ 2.0 ప్రభుత్వం వస్తుందని అంచనాతో ఉన్నట్టు చెప్పారు. ప్రజా తీర్పును ఊహించడం చాలా కష్టమేనన్నారు. ఈ దశలో మాత్రం అంచనాలకు వ్యతిరేక ఫలితం వస్తే

స్వల్ప లాభంతో ముగిసిన మార్కెట్‌

Thursday 11th April 2019

తొలి దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో గురువారం దేశీయ మార్కెట్‌  స్వల్ప లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 22 పాయింట్లు బలపడి 38,607 వద్ద,  నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 11,597 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 18పాయింట్లు నష్టపోయి 29,786 వద్ద ముగిసింది. అటో, ఎఫ్‌ఎంజీసీ, ఆర్థిక రంగ షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, మెటల్‌, మెటల్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ దిగ్గజ

Most from this category