STOCKS

News


బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ 

Monday 22nd October 2018
Markets_main1540191369.png-21358

ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సానుకూల ఆర్థిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం బ్యాంకింగ్‌ షేర్లు జోరుగా పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2 శాతంపైగా జంప్‌చేసి రూ.2014 గరిష్టస్థాయికి చేరిన అనంతరం ఉదయం 12 గంటల సమయానికి రూ. 2000 సమీపంలో ట్రేడవుతోంది. ఈ షేరు వెయిటేజీ అధికంగా కలిగిన బ్యాంక్‌ నిఫ్టీ ఇదే సమయానికి 1.4 శాతం ర్యాలీ జరిపి 25,400 పాయింట్ల స్థాయిని అధిగమించింది. ఈ సూచీలో భాగమైన షేర్లలో అన్నింటికంటే అధికంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ 3.8 శాతం పెరుగుదలతో రూ. 327 వద్దకు చేరింది. కోటక్‌ బ్యాంక్, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 1–2 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. అయితే మరో రోజులో ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్న ఆర్‌బీఎల్‌ బ్యాంకు 7 శాతం నష్టపోయి రూ.471 వద్దకు పడిపోయింది. బ్యాంక్‌ నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2 శాతం, యస్‌ బ్యాంక్‌ 1 శాతం చొప్పున నష్టపోయాయి. 
 



You may be interested

వివో వీ9పై రూ.8,000 డిస్కౌంట్‌

Monday 22nd October 2018

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ వివో.. వీ9 స్మార్ట్‌ఫోన్‌ ధరను మళ్లీ తగ్గించింది. ఫోన్‌ ధరను తగ్గించడం ఇది మూడోసారి. కంపెనీ వీ9 ఫోన్‌ను రూ.23,990 ధరతో తొలిగా మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వివో తర్వాత దీని ధర రూ.3,000 తగ్గించింది. అప్పుడు ఇది రూ.20,990 అందుబాటులోకి వచ్చింది. అటుపైన మళ్లీ ఫోన్‌ ధరను రూ.2,000 తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఈ వీ9 స్మార్ట్‌ఫోన్‌ రూ.18,990కి కస్టమర్లకు

రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా పోర్టుఫోలియో రివ్యూ..

Monday 22nd October 2018

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా పోర్టుఫోలియోలో ఎలాంటి మార్పులు వచ్చాయి, కొత్తగా వేటిని కొన్నారు, వేటిని విక్రయించారు? చూద్దాం.. - క్యు2లో రాకేశ్‌ పోర్టుఫోలియోలోకి కొత్తగా ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, స్పైస్‌జెట్‌ షేర్లు చేరాయి. స్పైస్‌జెట్‌లో రాకేశ్‌ 1.25 శాతం వాటా కలిగిఉన్నారు. ఫోర్టిస్‌లో 2 శాతం వాటాను కొనుగోలు చేశారు.  - ఇదే సమయంలో 13 కంపెనీల్లో ఆయన వాటాలు యథాతధంగా ఉన్నాయి. వీటిలో ఆగ్రోటెక్‌ఫుడ్స్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌,

Most from this category