STOCKS

News


నష్టాల బాటలో బ్యాంక్‌ షేర్లు

Monday 24th September 2018
Markets_main1537767441.png-20513

ముంబై:- మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని ప్రధాన సూచీలోకెల్లా అత్యధికంగా నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది.
నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌:- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (1శాతం), ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌(3 శాతం), కోటక్‌ బ్యాంకు(2.50 శాతం) పతనం కారణంగా నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో దాదాపు 2శాతం వరకు క్షీణించింది. ఉదయం గం.10:30నిలకు సూచీ 1.25శాతం నష్టంతో 14,350 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన 10 షేర్లలో మొత్తం 8 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. యస్‌ బ్యాంక్‌(1శాతం), యాక్సిస్‌ బ్యాంక్‌(0.75శాతం) మాత్రమే లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 3శాతం నష్టపోయింది. అదే బాటలో ఆర్‌బీఎల్‌, కోటక్‌ బ్యాంక్‌ ఐడీఎఫ్‌సీ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు షేర్లు 2.50శాతం నుంచి 2శాతం వరకు నష్టపోయాయి. అలాగే సౌత్‌ఇండియన్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి.
నిఫ్టీ పీఎస్‌యు బ్యాంక్‌ ఇండెక్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో 2,857 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 1శాతం వరకు నష్టపోయింది. ఉదయం గం.10:30కు ఇండెక్స్‌ అరశాతం నష్టంతో 2,827 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోని మొత్తం 12 షేర్లలో ఒక్క ఎస్‌బీఐ తప్ప మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఆంధ్రాబ్యాంక్‌ 3.50శాతం నష్టపోయింది. అలాగే అలహాదాబాద్‌ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, పీఎన్‌బీ బ్యాంకు, ఇండియన్‌ బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 2శాతం వరకు క్షీణించాయి. వాటితో పాటు సిండికేట్‌ బ్యాంకు, ఓరియంటల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి అరశాతం వరకు నష్టపోయాయి.
నిఫ్టీ బ్యాంక్ఇం‌డెక్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో 25,645 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 1.50శాతం (455 పాయింట్లు) నష్టపోయింది. ఉదయం గం.10:30నిలకు సూచీ 1.07శాతం నష్టంతో 25,322 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో భాగమైన మొత్తం 12షేర్లకు గానూ 9 షేర్లు నష్టపోగా, యస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు (1.50శాతం నుంచి అరశాతం‍ వరకు) మాత్రమే లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

11000- 11400 పాయింట్ల రేంజ్‌లో నిఫ్టీ!

Monday 24th September 2018

స్వల్పకాలానికి నిపుణుల అంచనా రూపాయి పతనం, క్రూడాయిల్‌ ధర పెరుగుదలతో సూచీల్లో ఆరంభమైన పతనాన్ని పెరిగిన బాండ్‌ ఈల్డ్స్‌, కంపెనీల క్రెడిట్‌ సమస్యలు మరింత వేగవంతం చేశాయి. దీంతో సూచీలు రోజురోజుకీ కొత్త కనిష్ఠాలను నమోదు చేస్తూపోతున్నాయి. ఇండియా వీఐఎక్స్‌ ప్రస్తుతం 15.36 స్థాయిలకు పైన ట్రేడవుతూ మరింత పతనాన్ని సూచిస్తోంది. శుక్రవారం ఇందుకు సూచనగా సూచీలు, స్టాకులు ఒక్కమారుగా ఢమాల్‌మని చివర్లో కాస్త రికవరీ అయ్యాయి. నిఫ్టీ 11320కి దిగువన

విదేశీ విద్య.. ఇలా సాధ్యమే!  

Monday 24th September 2018

విదేశాల్లో చదవటమంటే చాలా మందికి ఒక కల. ఒకప్పుడిది చాలా ధనవంతులు, ఎంతో ప్రతిభ కలిగిన వారికే సాధ్యమయ్యేది కూడా. కానీ, ఇపుడు విదేశీ విద్యావకాశాలు విసృ‍్తతమై... చాలామందికి అందుబాటులోకి వచ్చాయి. దేశంలో పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలున్నా.. వాటిలో ప్రవేశానికి కటాఫ్‌ 99 శాతం. దీన్నే రీచ్‌ఐవీ సీఈఓ విభా కాగ్జి మాటల్లో చెప్పాలంటే... దేశంలో ఆమోదనీయ స్థాయిలో ఉన్న నాణ్యమైన విద్య 2 శాతంలోపే!!. మరి మిగిలిన

Most from this category