STOCKS

News


బ్యాంకింగ్‌ షేర్ల జోరు

Friday 28th December 2018
Markets_main1545983874.png-23286

కేంద్రం 7 ప్రభుత్వ రంగ బ్యాంకుల‌కు రూ.28615 కోట్ల మూల‌ధ‌నం సమకూరుస్తున్నట్లు ప్రక‌టించ‌డంతో పాటు అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో శుక్రవారం బ్యాంకింగ్ రంగ షేర్లు పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతం, ప్రై‍్రవేట్‌ రంగ ఇండెక్స్‌, బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం చొప్పున ర్యాలీ చేశాయి. ద్రవ్య కొరతను ఎదుర్కొంటున్న ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ డిసెంబర్‌ 31లోగా రూ. 28,615 కోట్ల నిధుల కేటాయింపునకు సిద్ధమైంది. 
పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో 3065ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం లాభపడ్డాయి. ఇండియన్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంక్‌ షేర్లు 2శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు 1శాతం లాభపడ్డాయి. పీఎన్‌బీ, ఐడీబీఐ బ్యాంక్‌, విజయా బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గత ముగింపుతో 1.25శాతం లాభంతో 3,089.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఇండెక్స్‌:- నేడు 15,228.65ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 1.10శాతం లాభంతో 15,316 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేసింది. యస్‌ బ్యాంక్‌ అత్యధికంగా 2.50శాతం లాభపడింది. సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం పెరిగాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. కోటక్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. అయితే ఒక్క ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు మాత్రం 1శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతుంది.

 



You may be interested

టాటా, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ల పోటాపోటీ

Friday 28th December 2018

వాల్యూషన్లలో పోటీ పడుతున్న టాప్‌ బిజినెస్‌ గ్రూప్‌లు  భారత్‌లో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థానం కోసం హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌, టాటా గ్రూప్‌లు పోటీ పడుతున్నాయి. ఒకరోజు ట్రేడింగ్‌ చివరకు టాటా గ్రూప్‌ వాల్యూషన్‌ పరంగా టాప్‌టో ఉంటే మరోరోజు హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ ముందుంటోంది. బుధవారం ట్రేడింగ్‌ చివరకు టాప్‌ కార్పొరేట్‌ గ్రూప్‌గా ఉన్న టాటా గ్రూప్‌ను తోసిరాజని హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ అగ్రస్ధానానికి చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌లోని ఐదు కంపెనీల ఉమ్మడి విలువ

వచ్చే ఏడాది కూడా మనమే బెస్ట్‌!

Friday 28th December 2018

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా ఈ ఏడాది ఇతర దేశాల ఈక్విటీలతో పోలిస్తే మన మార్కెట్లు మంచి ప్రదర్శనే నమోదు చేశాయని, ఇదే జోరు కొత్త ఏడాది కూడా కొనసాగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి వీకే శర్మ అభిప్రాయపడ్డారు. యూఎస్‌ మార్కెట్లు ఉన్నట్లుండి బేర్‌ జోన్‌లోకి వచ్చాయని, దీంతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్‌కావచ్చని చెప్పారు. బ్యాంకింగ్‌ బాగోగులపై యూఎస్‌ ప్రభుత్వం కన్ను సారించిందన్న వార్తలతో అమెరికా మార్కెట్లు భారీగా పతనమయింది. ఈ

Most from this category