STOCKS

News


బ్యాంకు స్టాకుల్లో మరింత ర్యాలీ!

Monday 18th March 2019
Markets_main1552890502.png-24657

నిపుణుల అంచనా
ప్రీఎలక‌్షన్‌ ర్యాలీని ఆరంభించిన బ్యాంకు స్టాకుల దూకుడుతో బ్యాంకు నిఫ్టీ ఈ నెల్లో రికార్డు గరిష్ఠాలను దాటేసింది. బ్యాంకు స్టాకుల దూకుడు ట్రేడర్లను ఆకట్టుకుంటోంది. దీంతో పలువురు కొత్త లాంగ్స్‌ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఐసీఐసీఐ, యాక్సిస్‌ కౌంటర్లలో కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ మదుపరులు ఈ రెండు స్టాకుల్లో భారీగా పెట్టుబడులు పెడుతుండడంతో రిటైలర్లు సైతం వీటిపై మక్కువగా ఉన్నారు. నిఫ్టీలో ఫైనాన్స్‌ రంగ స్టాకుల వెయిటేజ్‌ అధికం. అందువల్ల నిఫ్టీలో ఎఫ్‌ఐఐలు నిధులు కుమ్మరించినా ముందుగా బ్యాంకు నిఫ్టీకే ఎక్కువ లాభం ఉంటుంది. మార్చి సీరిస్‌లో బ్యాంకు నిఫ్టీ దాదాపు 10 శాతం ర్యాలీ జరిపింది. దీంతో ఇకపై ప్రాఫిట్‌ బుకింగ్‌ ఉండొచ్చని మదుపరుల్లో సందేహాలు వస్తున్నాయి. కానీ బ్యాంకు నిఫ్టీలో ఇంకా పరుగుల సత్తా తరిగిపోలేదని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు నిఫ్టీ పొజిషన్ల ఓపెన్‌ ఇంట్రెస్ట్‌లో భారీ పెరుగుదలను ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. గతేడాది ఆగస్టు తర్వాత ఈ సూచీలో ఇంత స్థాయిలో ఓఐ పెరగడం ఇదే ప్రథమమని ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. ప్రస్తుత జోరు చూస్తుంటే 30వేల పాయింట్లపైకి చేరే అవకాశాలున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది. ఎఫ్‌పీఐలు ఎక్కువగా దేశ ప్రైవేట్‌ బ్యాంకుల్లో వాటాలు కొనిఉన్నాయని, అందువల్ల తాజా బయింగ్‌లో ఈ ఇన్వెస్టర్లు బ్యాంకు సూచీపైనే ఎక్కువ ఫోకస్‌ పెడతారని యాంటిక్‌ బ్రోకింగ్‌ తెలిపింది. లిక్విడిటీ సమస్యలు కొలిక్కి రావడం, ఆస్తుల నాణ్యత మెరుగవడం, ఎన్‌బీఎఫ్‌సీలు రికవరీ బాట పట్టడంతో బ్యాంకింగ్‌ స్టాకుల్లో జోరు పెరిగిందని, ఈ ఉత్సాహం మరింత కాలం కొనసాగవచ్చని ఐఐఎఫ్‌ఎల్‌ అభిప్రాయపడింది. బ్యాంకు స్టాకుల్లో పరుగులో భాగంగా మధ్యలో కొంత ప్రాఫిట్‌ బుకింగ్‌ కనిపించవచ్చని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. ఇలాంటి కరెక‌్షన్స్‌ను కొనుగోళ్లకు అవకాశంగా చూడాలని సూచించాయి. పీఎస్‌బీల్లో ఎస్‌బీఐని ఎక్కువమంది అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. You may be interested

పదిరోజుల్లో భారీ షార్ట్‌కవరింగ్‌?!

Monday 18th March 2019

ఈక్విటీ 99 అంచనా దేశీ మార్కెట్లో భారీ షార్ట్‌ పొజిషన్లు పోగయి ఉన్నాయని ఈక్విటీ 99 ప్రతినిధి సుమిత్‌ బిల్‌గయాన్‌ చెప్పారు. ఆర్థిక సంవత్సరం త్వరలో ముగిసిపోతున్న నేపథ్యంలో మరో పది రోజుల్లో భారీ షార్ట్‌ కవరింగ్‌ చూడవచ్చని అంచనా వేశారు. ఎంఎఫ్‌లు తమ ఎన్‌ఏవిల విలవ పెంచి చూపడానికి యత్నిస్తాయని, అందువల్ల మార్కెట్లో ర్యాలీ ఉంటుందని చెప్పారు. ఇన్వెస్టర్లు ప్రతి పతనాన్ని ఒక అవకాశంగా మలచుకోవాలని సూచించారు. నిఫ్టీకి ప్రస్తుతం

11500పైన నిఫ్టీ

Monday 18th March 2019

గతవారం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు... ఈ వారం ప్రారంభంలోనూ అదే జోరును కొనసాగిస్తున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న సూచీలు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే చురుగ్గా కదులుతున్నాయి.  ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నిఫ్టీ 103 పాయింట్లు పెరిగి 11500పై 11,530.15వద్ద, సెన్సెక్స్‌ 345 పాయింట్లు లాభపడి 38,369.59ల వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ఫిబ్రవరిలో భారత్‌ వాణిజ్యలోటు భారీగా తగ్గిందని గణంకాలు వెలువడటం, తద్వారా

Most from this category