STOCKS

News


పీఎస్‌యూ బ్యాంకుల జోరు

Thursday 9th August 2018
Markets_main1533802208.png-19095

కొన్ని బ్యాంకింగ్‌  షేర్లు గురువారం భారీ ర్యాలీని చేశాయి. బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ కారణంగానే ఉదయం ట్రేడింగ్‌లో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు తన జీవతకాల గరిష్టాలను అందుకోగలిగాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని సూచీల్లోకెల్లా నిఫ్టీ బ్యాంకు నిప్టీ ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌యూ), నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంకు సూచీలు అత్యధికంగా లాభపడ్డాయి.
6నెలల గరిష్టాన్ని తాకిన పీఎస్‌యూ బ్యాంక్‌ నిఫ్టీ :-
ఎన్‌ఎస్‌ఈలో అన్ని సూచీల్లోకెల్లా అత్యధికంగా లాభపపడింది. నేడు 3,326.40 ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ సూచీలో స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)షేరు 3.50 శాతం లాభపడంతో సూచి పరుగులు పెట్టింది. ఇదే సూచీలోని యూనియన్‌ బ్యాంకు, అలహాదాబాద్‌ బ్యాంకు, ఓరియంటల్‌ బ్యాంకు షేర్లు 5శాతం లాభపడ్డాయి. ఆంధ్రా బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంకు ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, షేర్లు 4నుంచి 3శాతం లాభపడ్డాయి. ఫలితంగా ఇంట్రాడేలో సూచి 3.70శాతం(121 పాయింట్లు) లాభపడి 6నెలల గరిష్టస్థాయి 3400 స్థాయిని అందుకుంది. మద్యహ్నాం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు ధర(3,281.30)తో పోలిస్తే 99 పాయింట్లు లాభపడి 3,381 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలు అన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.
నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంకు సూచీ:-
నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంకు సూచీని నేటి ట్రేడింగ్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు ముందుండి నడిపించాయి. నేడు ఈ సూచీ 15,835.35 ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే  ఐసీఐసీఐ బ్యాంకు షేరు 8.50శాతం(6నెలల గరిష్టం), యాక్సిస్‌ బ్యాంకు షేరు 3.50శాతం లాభపడంతో ఇంట్రాడేలో సూచీ 1.29శాతం లాభపడి 16040 స్థాయికి చేరుకుంది. మద్యహ్నాం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు ధర(15,835.35)తో పోలిస్తే 140.55 పాయింట్లు లాభపడి 15,975 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమాయానికి ఈ సూచీలోని ఐసీఐసీఐ అత్యధికంగా 4.50శాతం లాభపడగా, యాక్సిస్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు షేర్లు 3నుంచి 1శాతం లాభపడ్డాయి. సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు 1శాతం వరకు లాభపడింది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, ఎస్‌ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, కోటక్‌ బ్యాంకు షేర్లు 1నుంచి అరశాతం నష్టపోయాయి.
నిఫ్టీ బ్యాంకు సూచి:-
నేడు 28,173.65 ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 1శాతం వరకూ లాభపడి 28340 వరుకు చేరింది. మద్యహ్నాం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు ధర(28,062.45)తో పోలిస్తే 183 పాయింట్లు లాభపడి 28,245 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమాయానికి ఈ సూచీలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ అత్యధికంగా 4.50శాతం లాభపడగా, బ్యాంకు ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు షేర్లు 3నుంచి 1శాతం వరకూ లాభపడ్డాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, ఎస్‌ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, కోటక్‌  బ్యాంకు  షేర్లు 1నుంచి అరశాతం నష్టపోయాయి.



You may be interested

ఎంఫసిస్‌ బైబ్యాక్‌.. 17 శాతం దాకా రిటర్న్‌..

Thursday 9th August 2018

ఐటీ సంస్థ ఎంఫసిస్‌ షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీని కోసం రూ.988 కోట్లు వెచ్చించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశమని పేర్కొంది. ఇప్పుడు కంపెనీ షేర్లను కొనుగోలు చేసి, బైబ్యాక్‌లో పాల్గొంటే మంచి రాబడి అందుకోవచ్చని తెలిపింది. ఎంఫసిస్‌ 73.2 లక్షల షేర్లను (ఈక్విటీలో 3.79 శాతం) టెండర్‌ ఆఫర్‌ ద్వారా షేరుకు రూ.1,350 చెల్లించి కొనుగోలు చేయనుంది. మధ్యాహ్నం 1:00 సమయంలో ఎంఫసిస్‌ షేర్లు

18 ఏళ్ల గరిష్ఠానికి నిఫ్టీ పీఈ.. తస్మాత్‌ జాగ్రత్త!

Thursday 9th August 2018

కన్సాలిడేషనా? కరెక‌్షన్‌? సంశయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలని నిపుణుల సూచన దేశీయ సూచీల రికార్డు ర్యాలీ కొనసాగుతూనే ఉంది. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ తొలిసారి 38 వేల పాయింట్లను తాకింది. 37వేల నుంచి 38 వేల పాయింట్ల ప్రయాణాన్ని సెన్సెక్స్‌ కేవలం 11 సెషన్లలో పూర్తి చేసింది. ఈ గమనంలో ఐసీఐసీఐ బ్యాంకు 11 శాతం, యాక్సిస్‌బ్యాంకు 10 శాతం, ఆర్‌ఐఎల్‌ 10 శాతం, టాటా స్టీల్‌ 8 శాతం, ఎస్‌బీఐ షేర్లు ర్యాలీ

Most from this category