STOCKS

News


బ్యాంకింగ్‌ ఏడీఆర్‌లు డౌన్‌

Friday 4th January 2019
Markets_main1546572097.png-23393

అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌ కంపెనీల ఏడీఆర్‌లు (అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్స్‌) గత రాత్రి 1-5 శాతం మధ్య నష్టాల్ని చవిచూసాయి. బ్యాంకింగ్‌ ఏడీఆర్‌లు ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.7 శాతం మేర క్షీణించి 10.15 డాలర్ల వద్ద క్లోజ్‌కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.8 శాతం క్షీణతతో 101.9 డాలర్ల వద్ద క్లోజయ్యింది. టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.7 శాతం వరకూ నష్టపోయి 9.47 డాలర్ల వద్ద ముగిసింది. మరో టెక్‌ కంపెనీ విప్రో ఏడీఆర్‌ 1.2 శాతం క్షీణించింది. టాటా గ్రూప్‌ కంపెనీ టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 3 శాతం వరకూ క్షీణించి 11.71 డాలర్ల వద్ద క్లోజయ్యింది. మెటల్‌ కంపెనీ వేదాంత ఏడీఆర్‌ భారీగా 4.9 శాతం మేర నష్టపోయింది. టాటా మోటార్స్‌, వేదాంతలు క్రితం రోజు ఇక్కడి మార్కెట్లో కూడా బాగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇక ఫార్మా కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌ ఏడీఆర్‌ 2 శాతం వరకూ పడిపోయింది. 



You may be interested

10,700 పాయింట్ల వద్ద నిఫ్టీ ప్రారంభం

Friday 4th January 2019

సెన్సెక్స్‌ 77 పాయింట్లు అప్‌ గత రెండు రోజులుగా తీవ్రంగా క్షీణించిన భారత్‌ మార్కెట్‌ శుక్రవారం స్వల్పలాభాలతో మొదలయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్‌ 27 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 10,700 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 77 పాయింట్ల లాభంతో 35,590 పాయింట్ల వద్ద ఓపెన్‌ అయ్యింది. ట్రేడ్‌వార్‌ ముగుస్తుందన్న అంచనాలు, చైనా 21 బిలియన్‌ డాలర్ల విలువైన భారీ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రకటించడంతో ఆసియా సూచీలు పాజటివ్‌ ట్రేడింగ్‌

స్వల్పంగా పెరిగిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Friday 4th January 2019

గత రాత్రి అమెరికా సూచీలు భారీ పతనాన్ని చవిచూసినప్పటికీ, శుక్రవారం జపాన్‌ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్పంగా పెరిగింది. ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్స్‌కు అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40 గంటలకు 11 పాయింట్ల పెరుగుదలతో 10,730 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,719 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగిస్తుందన్న

Most from this category