STOCKS

News


బేర్‌మంటున్న బ్యాంకింగ్‌ షేర్లు

Monday 10th September 2018
Markets_main1536560889.png-20125

ముంబై:- అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు, రూపాయి కొత్త కనిష్టాలకు క్షీణత తోడవ్వడంతో సోమవారం మార్కెట్‌ నష్టాల బాట పట్టింది. అత్యధికంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌(0.50శాతం లాభం) తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.
నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌:- నేడు 27,395.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభంమైంది. మార్కెట్‌ పతనంలో భాగంగా 1శాతం(271 పాయింట్లు నష్టపోయి 27210 వద్దకు పతనమైంది. ఈ సూచీలోని మొత్తం 12 షేర్లకు గానూ,  ఒక్క యాక్సిస్‌ బ్యాంకు(2 శాతం) షేరు తప్ప 11 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. కొత్త ఛైర్మన్‌గా అమితాబ్‌ చౌధరి నియమాకం ఖరారు కావడంతో యాక్సిస్‌ బ్యాంకు ఇంట్రాడేలో 5శాతం లాభపడింది. అ‍త్యధికంగా ఫెడరల్‌ బ్యాంకు 5శాతం వరకు నష్టపోయింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 2నుంచి 1శాతం నష్టపోయాయి. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు అరశాతం నష్టపోయాయి. ఉదయం గం.11:30ని.కు నిప్టీ బ్యాంకు ఇండెక్స్‌ గత ముగింపు (27,481.45)తో పోలిస్తే 0.89శాతం నష్టంతో 27,236.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

మార్కెట్‌కు రూపీ పోటు..సెన్సెక్స్‌ 300 పాయింట్లు డౌన్‌

Monday 10th September 2018

నెగటివ్‌లో ప్రారంభమైన మార్కెట్లు అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. అయితే ఇండెక్స్‌ల నష్టాలు బాగా పెరిగాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లకుపైగా పడిపోతే.. నిఫ్టీ 100 పాయింట్లకుపైగా పతనమైంది. మధ్యాహ్నం 12:02 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 330 పాయింట్ల నష్టంతో 38,061 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 106 పాయింట్ల నష్టంతో 11,482 వద్ద ట్రేడవుతున్నాయి. రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి 72.57కి పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపింది. రూపాయి ఒక్క రోజులో

ఎస్‌బీఐ ఫండ్‌పై రుణమిస్తారా ?

Monday 10th September 2018

ప్ర: నేను గతంలో ఎస్‌బీఐ డ్యుయల్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌లో రూ.40,000 వరకూ ఇన్వెస్ట్‌ చేశాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆపేశాను. నాకు ఇప్పుడు డబ్బులు అవసరమయ్యాయి. ఈ ఫండ్‌ తనఖాగా నాకు రుణాలు వచ్చే అవకాశాలున్నాయా ? -భవానీ, విజయవాడ  జ: మీ ఎస్‌బీఐ ఫండ్‌పై మీరు రుణం పొందవచ్చు. ఇతర ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, రుణాలు రావడం కష్టమే కానీ, ఎస్‌బీఐ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, మీరు ఓవర్‌డ్రాఫ్ట్‌  పొందే

Most from this category