STOCKS

News


బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ

Tuesday 26th March 2019
Markets_main1553592854.png-24806

మార్కెట్‌ లాభాలకు బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ  తోడ్పాటునిస్తుంది. ట్రేడింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లలో చెప్పుకోదగ్గ కోనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సెక్టార్‌లో అధిక వెయిటేజీ గల ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టే్‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు ర్యాలీ ఇండెక్స్‌ ఆయా ఇండెక్స్‌లను పరుగులెత్తించాయి. గతరెండు రోజులుగా మార్కెట్‌ భారీ పతనంలో భాగంగా బ్యాకింగ్‌ రంగషేర్లు తక్కువ విలువ వద్ద లభించడంతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలోని ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2.50శాతం లాభపడగా, ప్రైవేట్‌ రంగ ఇండెక్స్‌ 2శాతం పెరిగాయి. అలాగే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం పెరిగింది.



You may be interested

మళ్లీ 38000 పైకి సెన్సెక్స్‌

Tuesday 26th March 2019

- సెన్సెక్స్‌ 424 పాయింట్ల పరుగు - 129 పాయింట్లు పెరిగిన నిఫ్టీ రెండు రోజులపాటు నష్టాలు చవి చూసిన భారత స్టాక్‌ మార్కెట్లకు మంగళవారం పటిష్టంగా కోలుకున్నాయి.  బ్యాంకింగ్‌, ఆర్థిక, మెటల్‌, ఫార్మా రంగ షేర్లతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 38వేల స్థాయిని, నిఫ్టీ 11450 స్థాయిని తిరిగి అందుకున్నాయి. మార్కెట్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 425 పాయింట్ల లాభంతో 38,233 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు

మిడ్‌క్యాప్స్‌పై ఫోకస్‌ పెంచండి

Tuesday 26th March 2019

మాక్కై‍్వరీ సలహా ఈ ఏడాది ఆరంభం నుంచి లార్జ్‌క్యాప్స్‌లో అప్‌మూవ్‌ కొనసాగుతూ వస్తోంది. తాజా ర్యాలీలో సైతం పెద్ద స్టాకులే ఎక్కువ సందడి చేశాయి. అయితే ఇకపై మిడ్‌క్యాప్స్‌ హవా ఆరంభం కానుందని, అందువల్ల ఇన్వెస్టర్లు తమ దృష్టిని చిన్న, మధ్యతరహా స్టాకులవైపు మరలించాలని సలహా ఇస్తోంది. ఎకనమిక్‌ గ్రోత్‌లో రికవరీ, సాధారణ ఎన్నికలపై ఆశలతో దేశీయ మార్కెట్లో నిధుల ప్రవాహం కొనసాగుతుందని అభిప్రాయపడింది. ఈ ఏడాది ఇండియా ఈక్విటీ మార్కెట్లో

Most from this category