STOCKS

News


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ...   కొనొచ్చు

Monday 7th January 2019
Markets_main1546857648.png-23453

బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.122
టార్గెట్‌ ధర: రూ.140

ఎందుకంటే..?: దేనా, విజయా బ్యాంక్‌లను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేయడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి సంబంధించి షేర్ల మార్పిడి నిష్పత్తి దేనా, విజయ బ్యాంక్‌ల కంటే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వాటాదారులకే లాభదాయకంగా ఉంది. ప్రతి వెయ్యి విజయ బ్యాంక్‌ షేర్లకు 402 బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు, ప్రతి వెయ్యి దేనా బ్యాంక్‌ షేర్లకు 110 బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు లభిస్తాయి. ఈ విలీనం కారణంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. దేశంలోనే అతి పెద్ద మూడో బ్యాంక్‌గా అవతరిస్తుంది. మొత్తం దేశవ్యాప్త బ్యాంక్‌ రుణాల్లో 7 శాతం, డిపాజిట్లలో 7.4 శాతం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వాటాయే ఉంటుంది. సమీప భవిష్యత్తులో విలీన సమస్యలున్నా, దీర్ఘకాలంలో ఈ విలీనం బీఓబీ మంచికే. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పుస్తక విలువ 8 శాతం వృద్ధితో రూ.184కు పెరగనుంది. టైర్‌ వన్‌ మూలధనం 10.1 శాతానికి పెరుగుతుంది.  ప్రభుత్వం నుంచి మరిన్ని మూలధన నిధులు వచ్చే అవకాశాలుండటంతో మూలధన సంబంధిత సమస్యలు ఈ బ్యాంక్‌కు ఉండవు. దాంతో విలీన సంబంధిత సమస్యలను (నెట్‌వర్క్, బ్రాంచ్‌ల పునర్వ్యస్థీకరణ, వ్యాపారాల, ఉద్యోగుల సమన్వయం మొదలైనవి) ఈ బ్యాంక్‌ సులభంగా అధిగమించగలదు. బ్రాంచ్‌ల సంఖ్య 9,511కు పెరుగుతుంది. అత్యధిక సంఖ్యలో బ్యాంక్‌ శాఖలున్న రెండో అతి పెద్ద బ్యాంక్‌  ఇదే అవుతుంది. మార్జిన్లు అధికంగా ఉండే రిటైల్‌ రుణాలు 20 శాతం పెరుగుతాయి. ఇటీవలి క్వార్టర్ల పనితీరు ఈ బ్యాంక్‌ టర్న్‌ అరౌండ్‌ను సూచిస్తోంది. రుణాల రికవరీ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. కేటాయింపులు మెరుగుపడుతున్నాయి. నిలకడగా వృద్దిని సాధిస్తోంది. 

కోల్‌ ఇండియా    కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్స్‌
ప్రస్తుత ధర: రూ.236
టార్గెట్‌ ధర: రూ.325

ఎందుకంటే...?: ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు నిల్వల కంపెనీ ఇది. భారత బొగ్గు మార్కెట్లో 80 శాతం వాటాను ఈ కంపెనీయే నియంత్రిస్తోంది. అతి తక్కువ వ్యయంతో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ప్రపంచ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఈ మహారత్న కంపెనీ... టర్నోవర్‌ పరంగా చూస్తే, భారత్‌లో ప్రభుత్వ రంగంలో అతిపెద్దది. దేశవ్యాప్తంగా 471 గనుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కోల్‌ ఇండియా అతి పెద్ద అనుబంధ కంపెనీ సౌత్‌ ఈస్ట్రన్‌  కోల్‌ఫీల్డ్స్‌ (ఎస్‌ఈసీఎల్‌) ఉత్పత్తి 13 శాతం తగ్గింది. దీంతో గత నెలలో కోల్‌ ఇండియా ఎగుమతులు 1 శాతం తగ్గాయి. వరుసగా రెండో నెలలోనూ నిల్వలు పెరిగాయి. అయితే నిర్వహణ సంబంధిత సమస్యలు తొలగిపోవడంతో ఎస్‌ఈసీఎల్‌లో ఉత్పత్తి పెరగగలదని భావిస్తున్నాం. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తిలో 5.5 శాతం వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం. బొగ్గు దిగుమతులను నియంత్రించడానికి దేశీయంగా ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. దిగుమతి బొగ్గు ధరల కన్నా ఈ కంపెనీ ధరలను తక్కువగా నిర్ణయిస్తే, కోల్‌ ఇండియాకే ప్రయోజనం. అయితే సమీప భవిష్యత్తులో బొగ్గు ధరలను పెంచకుంటే కంపెనీ లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. డివిడెండ్‌ ఈల్డ్‌ 6–7 శాతం శ్రేణిలో ఉండటం సానుకూల అంశం. నగదు నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయి. అమ్మకాల వృద్ధి అంచనాల కంటే తక్కువగా ఉండే అవకాశాలు, వ్యయాలు పెరగడం... ప్రతికూలాంశాలు. You may be interested

9 శాతం రాబడినిచ్చే డెట్‌ ఫండ్లు ఉన్నాయా?

Monday 7th January 2019

- పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయటం తప్పా? - ఫండ్‌ నిపుణుడు ధీరేంద్రకు ‘సాక్షి’ పాఠకుల ప్రశ్నలు ప్ర: నేను ఏడాది క్రితం ఫ్రాంక్లిన్‌ ఇండియా స్మాలర్‌ కంపెనీస్‌ ఫండ్‌లో పెద్ద మొత్తం ఇన్వెస్ట్‌ చేశాను. అప్పటి నుంచి ఈ ఫండ్‌ పనితీరు ఏ మాత్రం బాగులేదు. నా ఇన్వెస్ట్‌మెంట్‌ 20 శాతం వరకూ తరిగిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? -సత్యం, విజయవాడ  జ: సాధారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు చేసే తప్పునే

లాభాల ముగింపు

Monday 7th January 2019

సెన్సెక్స్‌ 155 పాయింట్లు, నిఫ్టీ 44 పాయింట్లు అప్‌ ప్రస్తుత వడ్డీ రేట్ల పెంపు పాలసీని పునర్‌సమీక్షిస్తామంటూ అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చేసిన ప్రకటనతో సోమవారం భారీగ్యాప్‌అప్‌తో భారత్‌ సూచీలు ప్రారంభమైనప్పటికీ, ముగింపులో ఆ లాభాలు అరశాతం లోపునకే పరిమితమయ్యాయి. ఒకదశలో 300 పాయింట్లకుపైగా పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 155 పాయింట్ల లాభంతో 35,809 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో 90 పాయింట్ల మేర పెరిగిన

Most from this category