STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 1.50శాతం డౌన్‌..!

Friday 15th February 2019
Markets_main1550216011.png-24210

మార్కెట్‌ పతనంలో భాగంగా బ్యాంక్‌ షేర్లు శుక్రవారం భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో​బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిప్టీ 1.30శాతం నష్టపోయింది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(26,970.60)తో పోలిస్తే 1శాతం నష్టంతో 26,687.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక ఇండెక్స్‌లో మొత్తం 12 షేర్లకు గానూ అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అ‍త్యధికంగా పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం నష్టపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు 2శాతం క్షీణించాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1.50శాతం పతనమవ్వగా, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం పడిపోయాయి. అలాగే ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. 
ఇక మార్కెట్‌ విషయానికొస్తే..
ఇదే సమయానికి అన్ని రంగాలకు చెందిన సూచీల్లో అ‍మ్మకాలు సునామితో నిఫ్టీ 103 పాయింట్లను నష్టపోయి 10,642 వద్ద, సెన్సెక్స్‌ 300 పాయింట్లను నష్టపోయి 35,574.44 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అత్యధికంగా నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 4.50 శాతం నష్టపోయింది.



You may be interested

వెలుగులోకి షుగర్‌ షేర్లు

Friday 15th February 2019

కేంద్ర ప్రభుత్వం చక్కెర కనీస అమ్మకం ధర పెంచాలనే నిర్ణయంతో శుక్రవారం షుగర్‌ షేర్లు వెలుగులోకి వచ్చాయి. చక్కెర మిల్లులు కిలో చక్కెరను రూ.31 ధరకు తక్కువగా విక్రయించవద్దని గురువారం ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయంతో చక్కెర ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీల ఆర్థిక కష్టాలు తీరతున్నాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే చక్కెర ఫ్యాక్టరీలకు ప్రభుత్వం ఈథనాల్ లోన్

ఎకానమీపై ఉదయ్‌ కోటక్‌ ఆందోళన

Friday 15th February 2019

దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదని ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ అభిప్రాయపడ్డారు. కానీ సరైన చర్యలు తీసుకుంటే ఈ సమస్య వ్యవస్థీకృతం కాకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. కంపెనీల బాలెన్స్‌ షీట్లు బాగుపడి, వాటిపై నమ్మకం కలిగే వరకు ఇన్వెస్టర్లలో భయం పోదన్నారు. ఇప్పటివరకు స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు విస్తృత బాధను చవిచూశాయని చెప్పారు. ఇకపై వీటి కష్టాలు కాస్త గట్టెక్కుతాయని అంచనా వేశారు. చిన్న షేర్లకు ఇబ్బందులున్నా

Most from this category