STOCKS

News


29,650 వద్ద బ్యాంకునిఫ్టీ కన్సాలిడేషన్‌?!

Monday 18th March 2019
Markets_main1552905462.png-24670

కోటక్‌ సెక్యూరిటీస్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌
అందరినీ ఆశ్చర్యపరుస్తూ బ్యాంకు నిఫ్టీ అనూహ్య ర్యాలీ జరుపుతోంది. ఈ వారంకూడా బలంగా ఆరంభించి 29500 పాయింట్ల పైన ముగిసింది. ఎఫ్‌పీఐలు మార్కెట్లో అత్యంత చురుగ్గా ఉండడంతో సూచీల్లో బుల్స్‌ కదం తొక్కుతున్నాయి. గత రెండేళ్లుగా ఎఫ్‌ఐఐలు స్తబ్దుగా ఉండడం లేదా నికర అమ్మకాలు జరపడం చేశాయి. కానీ గత 10-12 రోజుల్లో ఎఫ్‌ఐఐలు 25వేల కోట్ల రూపాయలను మార్కెట్లో కుమ్మరించారు. గత అక్టోబర్‌లో ఎఫ్‌ఐఐలు విక్రయాలు జరపడంతో నిఫ్టీ వెయ్యిపాయింట్ల మేర పతనమైంది. ఈ రెండు సందర్భాల్లో కూడా రూపాయి ఎఫ్‌ఐఐ పెట్టుబడులకు అనుగుణంగా కదలాడింది. ఆర్‌బీఐ చురుగ్గా వ్యవహరించడంతో రూపీ బలహీనతకు అడ్డుకట్ట పడింది. దీంతో మరోమారు ఎఫ్‌ఐఐలు భారత్‌లో కొనుగోళ్లకు దిగాయి.

ప్రస్తుతం ఎకానమీలో స్థూల, సూక్ష్మ ఆర్థికాంశాలన్నీ పాజిటివ్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అందువల్ల తాజా ర్యాలీ మరింత ముందుకు సాగవచ్చు. కానీ నిఫ్టీ ఏదో సమయంలో ఒక మారు 11290- 11320 పాయింట్ల వరకు దిగజారవచ్చు. ఆ సమయాన్ని ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు అవకాశంగా మలచుకోవాలి. ఈ స్థాయికి దిగువన 11000- 11150 పాయింట్లను మద్దతు జోన్‌గా పరిగణించాలి. ఈ జోన్‌ను స్టాప్‌లాస్‌గా ఉంచుకొని కొత్తకొనుగుళ్లు చేపట్టవచ్చు. పైస్థాయిన 11600- 11650 పాయింట్ల వరకు నిఫ్టీ కొనసాగవచ్చు. బ్యాంకు నిఫ్టీ 29650 పాయింట్ల రేంజ్‌లో కన్సాలిడేషన్‌ జరుపవచ్చు. దిగువన 29000 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తుంది. ఈ స్ధాయి వరకు వస్తే కాంట్రా బయింగ్‌ను పరిశీలించవచ్చు.
పైవన్నీ శ్రీకాంత్‌ చౌహాన్‌ అంచనాలు, అభిప్రాయాలు. మదుపరులు సొంత అధ్యయనంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. 



You may be interested

ఆరో రోజూ ఆగని ర్యాలీ

Monday 18th March 2019

మార్కెట్‌ లాభాల ర్యాలీ ఆగడం లేదు. వరుసగా ఆరోరోజూ లాభాలతో ముగిసింది. ఈ సోమవారం సెన్సెక్స్‌ 71 పాయింట్ల లాభంతో 38,095 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 11,462 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు రాణించడంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 214 పాయింట్లు లాభపడి 29,596  పాయింట్ల  వద్ద స్థిరపడింది. ఇంట్రాడే లో బ్యాంకింగ్‌, ఆర్థిక, ఫైనాన్స్‌, మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు అటో షేర్లు అమ్మకాల

గ్లోబల్‌ బుల్‌ మార్కెట్‌ మధ్యలో ఉన్నాం!

Monday 18th March 2019

అతుల్‌ సూరి అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పాజిటివ్‌ మూడ్‌ కారణంగా దేశీయ మార్కెట్లో ర్యాలీ ఆరంభమైందని మారథాన్‌ ట్రెండ్స్‌ సీఈఓ అతుల్‌ సూరి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా భారీ బుల్‌ ర్యాలీ మధ్యలో ఉన్నామన్నారు. భారత్‌ ఇప్పుడే ఈ ర్యాలీలో కాలుమోపిందని చెప్పారు. ప్రీఎన్నికల ర్యాలీని చూస్తే ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం వస్తుందన్న ఆశలు సూచీలను ముందుకు నడిపిస్తున్నట్లు కనిపిస్తోందని, కానీ నిజానికి అంతర్జాతీయ లిక్విడిటీ ప్రవాహమే ఈ ర్యాలీకి మూల

Most from this category