STOCKS

News


కోలుకున్న బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 11th December 2018
Markets_main1544514914.png-22822

ముంబై: మిడ్‌సెషన్ సమయానికి మార్కెట్‌ రికవరీలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు తిరిగి కోలుకుంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ మధ్యాహ్నం గం.12:25ని.లకు 0.10శాతం లాభపడి 26,010 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రిజర్వ్‌బ్యాంకు ఛైర్మన్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామాతో మంగళవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు బాగా నష్టపోయాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2శాతం పతనం ఇండెక్స్‌ను భారీగా నష్టపోయేలా చేసింది. యస్‌ బ్యాంక్‌ షేర్ల 6శాతం ర్యాలీ ఇండెక్స్‌ను రికవరికి ఒక కారణమని చెప్పవచ్చు. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ 3.50శాతం, పంజాబ్‌నేషనల్‌బ్యాంక్‌ 3శాతం, ఆర్‌బీఎల్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 2శాతం పెరిగాయి. అలాగే ఫెడరల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ షేర్లు 1శాతం నష్టపోయి ఇండెక్స్‌పై ఒత్తిడిని పెంచుతుంది. అలాగే ఇండస్‌ఇండ్‌ అరశాతం నష్టపోయింది.



You may be interested

షార్ట్‌ కవరింగ్‌తో నష్టాల నుంచి రికవరీ

Tuesday 11th December 2018

సెన్సెక్స్‌ 186 పాయింట్లు అప్‌ 10,500పైన నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు మధ్యాహ్నం కల్లా రికవరీ అయ్యాయి. ఎన్నికల ఫలితాలు, ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా వంటి అంశాలతో గ్యాప్‌డౌన్‌తో మార్కెట్‌ ప్రారంభమైనా, మిడ్‌సెషన్‌లో జరిగిన షార్ట్‌ కవరింగ్‌తో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు లాభాల్లోకి మళ్లాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 186 పాయింట్ల లాభంతో 35,146 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 10,548 వద్ద ఉన్నాయి. మార్కెట్‌ వర్గాలు ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై

ఎన్నికల ఫలితాలతో సమస్య లేదు..

Tuesday 11th December 2018

విదేశీ ఇన్వెస్టర్లకు ఎన్నికల ఫలితాలతో వచ్చిన సమస్య ఏమీ లేదంటున్నారు ఈఎం ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ అడ్రియన్‌ మోవాత్‌. ప్రజలు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక విధంగా ఓట్లు వేయవచ్చని, సార్వత్రిక ఎన్నికల్లో మరో విధంగా ఓట్లు వేయవచ్చని అంచనా వేశారు. అందువల్ల ఓటర్లు ఎప్పుడూ ఒకేలా ఓట్లు వేస్తారని అంచనా వేయడం తగదని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  భారత్‌ ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులను

Most from this category