STOCKS

News


బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం అప్‌

Thursday 11th July 2019
news_main1562836645.png-26988

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం 0.80శాతం(260 పాయింట్లు) మేర లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 185 పాయింట్ల భారీ గ్యాప్‌తో 30,707.00 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ సెక్టార్లో స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో ఆరంభ లాభాల్ని నిలుపుకోలిగింది. ఇంట్రాడేలో ఒకదశలో 260 పాయింట్లు పెరిగి 30,781.70 వద్ద స్థాయికి అందుకుంది. మధ్యాహ్నం గం 2:30ని.లకు షేరు ఇండెక్స్‌ గత ముగింపు(30,522.10)తో పోలిస్తే 0.80శాతం లాభంతో 30,765.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 4.50శాతం లాభపడింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1.50శాతం, కోటక్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1శాతం పెరిగింది. ఐబీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ అరశాతం లాభపడింది. మరోవైపు యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1శాతం క్షీణించగా, ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ అరశాతం నష్టపోయాయి. 



You may be interested

అక్టోబర్‌ నుంచి అదిరిపోయే ర్యాలీ!

Thursday 11th July 2019

సంజీవ్‌ భాసిన్‌ అంచనా వచ్చే రెండేళ్ల కాలం కొనసాగే భారీ ర్యాలీ దేశీయ సూచీల్లో వచ్చే అక్టోబర్‌లో ఆరంభం అవుతుందని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి సంజీవ్‌ భాసిన్‌ చెప్పారు. బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను పెంపుదలల గురించి అనవసరంగా ఆందోళన పడుతున్నారని, నిజానికి బడ్జెట్లో ఎలాంటి నెగిటివ్‌ లేదని తెలిపారు. ఈక్విటీ ఆదాయాలు భారీగా ఉంటే వాటిపై వేసే పన్నుమాత్రమే పెరుగుతుందని, ఈ మాత్రం పెరుగుదలకూడా సహించలేకపోతే ఈక్విటీల నుంచి వైదొలిగి బాండ్స్‌లో

ఇంకో పక్షం రోజులు మార్కెట్లు ఇంతే

Thursday 11th July 2019

పీఎస్‌బీ రంగం‍లో ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బలంగా ఉన్నాయి ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సెక్టార్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ పరిశీలించవచ్చు ఆటో రంగం‍లో సిఫార్సు, కొనుగోలుకు విముఖతగా ఉన్నాను: సుదీప్‌ బంద్యోపధ్యాయ్‌ బడ్జెట్‌ వెలువడిన తర్వాత మార్కెట్లు భారిగా దిద్దుబాటుకు గురయ్యాయని, మార్కెట్లు ముందుకు వెళ్లడానికి చాలా తక్కువ కారకాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఇంట్రాడే క్యాపిటల్‌ చైర్మన్‌ సుదీప్‌ బంద్యోపధ్యాయ్‌ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన

Most from this category